skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

అరటి దూట( Banana stem ) చేసే మేలు - కొన్ని వంటలు

11:23 AM | Publish by తృష్ణ


అరటి దూట తో చేసే వంటకాలు నాకెంతో ఇష్టం. ముఖ్యంగా అరటి దూట పెరుగుపచ్చడి. రోజూ దూట దొరికితే రోజూ తినేంత. సిటీల్లో అరటి దూట దొరకటం కొంచెం కష్టమైన పనే. అయినా దొరికినప్పుడల్లా కనీసం వారానికి రెండు,మూడుసార్లు అయినా తినటం చాలా ఆరోగ్యకరం.
దూట తినటం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే --
1) దీనిలో పీచు పదార్ధం(ఫైబర్) ఎక్కువ ఉండటం వల్ల అరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది.
2) పిచు పదార్ధం ఎక్కువ ఉండటం వల్ల అధిక బరువు తగ్గించటానికి కూడా దూట బాగా ఉపయోగపడుతుంది.
3) దీనిలోని పొటాషియం, విటమిన్ B6 శరీరంలో హీమోబ్లోబిన్ , ఇన్సులిన్ మొదలైన రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. పొటాషియం శరీరంలోని కండరాలు సరిగా పనిచేయటానికి, బ్లడ్ ప్రషర్ ను అదుపులో ఉంచటానికీ బాగా దోహదపడుతుంది.
4) దూటకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది.


ఒక గ్లాసు దూట రసం పొద్దున్న,సాయంత్రం త్రాగటం వల్ల ఉపయోగాలు :1) లేత అరటి దూట రసం tuberculosis తాలూకు బ్యాక్టీరియను సంహరిస్తుంది.
2) అన్నిరకాల మూత్ర సంబంధిత వ్యాధులనూ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ నూ దూట రసం బాగా తగ్గిస్తుంది.
3) అరటిదూట రసం అన్నిరకాల కిడ్నీ రాళ్ళను కరిగిస్తుందని అంటారు. గాల్ బ్లాడర్ లోని రాళ్ళను కూడా కరిగిస్తుందని అంటారు.
అయితే ఈ రసాన్ని బూడిదగుమ్మడికాయ రసంతో కలిపి తీసుకోవటమ్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయిట.

తరగటం కొద్దిగా కష్టమైన పని అయినా అరటిదూట వల్ల శరీరానికి జరిగే మేలు అనంతం కాబట్టి వీలైనంత ఎక్కువగా తినటం ఎంతో ఆరోగ్యకరం.
ముందుగా దూటను తరిగే పధ్ధతి:
పైన చూపిన విధంగా చక్రాలాగ తరుక్కుని, తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
వీటిని పల్చటి మజ్జిగ నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. లేకపోతే నల్లబడిపోతాయి.

ఇక దీనితో తయారయ్యే వంటకాలు కొన్ని..

దూట కూర :(1.ఆవ పెట్టి)

"అరటిదూట ఆవకూర చేయటం వస్తే బోలెడు ఓర్పు ఉన్నట్లు లెఖ్ఖ..." అని శ్రీరమణగారి బంగారుమురుగు కధలోని బామ్మగారు చెప్తారు.
చిన్నగా తరిగిన అరటి దూట ముక్కలను తగినన్ని నీళ్ళలో ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. (ఉడికాకా నీళ్ళు వార్చకుండా సరిపోయేటన్నే పోసుకోవాలి.)
ఉడికాకా ముక్కలలో కొద్దిగా నీరు ఉన్నా తడిలేకుండా వార్చేసుకోవాలి.
తరువాత తగినంత నూనెలో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఎండు మిరపకాయలు, కర్వేపాకు,ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
కూర చల్లారిన తరువాత, కొద్దిగా పచ్చిఆవ పొడి(బజారులో దొరుకుతుంది లేదా పచ్చి ఆవాలను గ్రైండ్ చేసుకోవచ్చు.) చల్లి బాగా కలుపుకోవాలి.

దూట కూర :(౨.కొబ్బరి వేసి)


కూర పైన చెప్పిన విధంగానే చేసుకోవాలి. ఆవ బదులు పోపు పెట్టేప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి కలుపుకోవాలి. అందులో ఉడికిన దూట ముక్కలు వేసి రెండు నిమిషాల తరువాత దింపుకోవాలి.

దూట కూర (౩.చింతపండు రసంతో):


ముందు నిమ్మకాయంత చింతపండు గోరువెచ్చనినీళ్ళలో నానబెట్టి రసం చిక్కగా తీసి ఉంచుకోవాలి.
తరువాత పైన చెప్పిన విధంగా పోపు పెట్టేసుకుని, చిటికెడు పసుపు, కాస్తంత చింతపండు రసం వేసి, అందులో ఉడికిన దూట ముక్కలు వేసి బాగా కలిపాకా దింపుకోవాలి. దీనిలో పచ్చికొబ్బరి కోరు కూడా వేసుకోవచ్చు.

దూట - పెసరపప్పు పొడి కూర (౪):

చిన్నగా తరిగిన అరటి దూట ముక్కలను, ముక్కలకు సగం క్వాంటిటీలో పెసరపప్పును తగినన్ని నీళ్ళలో ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు బద్దగానే ఉండాలి. ముద్ద అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. పొడి పొడిగా ఉడికాకా దింపేసుకోవాలి.
ఆవాలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి,ఎండుమిర్చి (రెండూ తినే కారాన్ని బట్టి),కర్వేపాకు, చిటికెడు పసుపు వేసి,అందులో ఉడికిన దూట ముక్కలు, పెసరపప్పు మిక్స్ వేసి రెండు నిమిషాల తరువాత దింపుకోవాలి.

దూట పెరుగు పచ్చడి :

కమ్మని పెరుగు ఒక కప్పు కాసిని నీళ్ళలో చిలికి ఉంచాలి. ఉప్పు కలపాలి.
తరువాత తరిగిన దూట ముక్కలను (పచ్చివే) చిలికిన పెరుగులో కలపాలి.
ఆవాలు, మినపప్పు, మెంతులు, కర్వేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
(ఆవ ఇష్టం ఉంటే) దీనిలో కొద్దిగా పచ్చిఆవ పొడి కలుపుకుంటే చాలా బాగుంటుంది.
మెంతులు ఇష్టం లేకపోతే పోపులోనే చిటికెడు మెంతిపొడి వేసి బాగా వేగాకా(ఎర్రబడ్డాకా) పెరుగులో కలుపుకోవచ్చు.


Labels: కూరలు 9 comments
9 Responses
  1. శేఖర్ పెద్దగోపు Says:
    August 26, 2010 12:02 AM

    నాకు చాలా ఇష్టం అరటి దూట(మేం దవ్వ అంటాం) కూర..వంటలతో పాటు పోషకాల వివరాలు ఇవ్వటం బాగుంది...మా ఊళ్ళో కొంతమంది దీన్ని సన్నటి చక్రాల్లా కోసి, ఉసిరికాయ ఊరేసినట్టు ఊరేస్తారు..భలే ఉంటాయి అవి తినడానికి...కానీ సిటీల్లో చాలా అరుదు దొరకటం...


  2. తృష్ణ Says:
    August 26, 2010 2:42 PM

    @ శేఖర్ పెద్దగోపు:nearly 300 people has seen this post and only you have written a comment..

    THANKYOU VERYMUCH..


  3. sunita Says:
    August 26, 2010 3:29 PM

    ivi ilaa vanDutaarani kooDaa teliyadu naaku. maa inTloe gela koesaaka mokka baiTa paDaestaam.manchi poesT.


  4. Krishnapriya Says:
    August 26, 2010 4:08 PM

    మా ఇంటి ముందు షాప్ లో చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడూ కొనలేదు. ఈసారి కొని పెరుగుపచ్చడి చేస్తాను ఈ వీకెండ్ ఐతే..


  5. తృష్ణ Says:
    August 26, 2010 4:10 PM

    @sunita: ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా బాగుంటుంది. మీకు "దూట" దొరికితే తప్పక ప్రయత్నించి చూడంది.
    Thankyou.


  6. తృష్ణ Says:
    August 27, 2010 11:19 AM

    @krishnapriya:తప్పక ప్రయత్నించి చూడండి. ధన్యవాదాలు.


  7. Satya Says:
    August 28, 2010 1:25 AM

    hey akka ,thanks you somuch for visiting blog n for ur lovely comments ...we too use banana stem but don't know those many versions of kura ...some time we make kootu of this stem too ...thanks for sharing

    Satya
    http://www.superyummyrecipes.com


  8. pourudu Says:
    June 23, 2011 1:33 PM

    nenu emadhyne me blogni follow avutunnanu. meru pettina receips bagunnayi. naa chinnapati nimchi arati dutato, puvvuto kura chestarani telusu kani ela chestaro teliyadu. eppudu tinaledu kudaa. ikkada me post chusaka cheyyalani anukuntunna.Deniki arati duta manam pandagalappudu techchukune chinna arati chettu nimchi teyachcha leka bayata ivi ammutaraa..


  9. తృష్ణ Says:
    June 24, 2011 4:41 PM

    @సత్య: thanks for the comment.

    @పౌరుడు: పూజకు తెచ్చుకునే చిన్న అరటి చెట్టుకు ఎంత దూట ఉంటుందండి? నేను చూసిన పూజ కు తెచ్చేవి చాలా చిన్నవి. వాటికి వండుకునేంత లావుపాటి దూట ఉండదు. నాకైతే కొనటమే అలవాటండీ. అరటి ఆకులు దొరికే చాలా చోట్ల దూట కూడా దొరుకుతుందండీ.
    ధన్యవాదాలు.


Post a Comment

« Newer Post Older Post »
Subscribe to: Post Comments (Atom)
"Health is Wealth."

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2012 (11)
    • ►  May (3)
      • ఆవకాయలు మాగాయలు - 2
      • ఆవకాయలు మాగాయలు - 1
      • పచ్చి బొప్పాయి(raw papaya) కూర
    • ►  April (1)
      • మావిడి పిందెలతో ఆవబద్దలు
    • ►  March (1)
      • ఆనపకాయతో చపాతీ/పూరీ కూర
    • ►  February (4)
      • కొబ్బరి + కంది పచ్చడి
      • నారింజకాయ కారం
      • ముల్లంగి చపాతీ
      • బ్రెడ్ ఉప్మా
    • ►  January (2)
      • అప్పాలు
      • వాంగీబాత్
  • ►  2011 (35)
    • ►  December (3)
      • పండుమిరమకాయ - చింతకాయ పచ్చడి
      • ఓట్స్ దోశ
      • (కాల్చిన)అరటికాయ పొడి కూర
    • ►  November (6)
      • ఆయిల్ ఫ్రీ పొంగడాలు
      • దబ్బకాయ ఊరగాయ
      • mixed vegetable "కూటు"
      • బెంగుళూరు వంకాయ (chow chow) తో రకాలు...
      • పనసపొట్టు ఆవకూర
      • అరటిపువ్వు పచ్చడి
    • ►  September (3)
      • వాక్కాయ-కొబ్బరికాయ పచ్చడి
      • కేబేజీ పకోడి
      • కొబ్బరన్నం with & without masala
    • ►  August (4)
      • Russian salad
      • బీట్రూట్ - ఆవ కూర
      • మిక్స్డ్ వెజిటెబుల్ ఆవకాయ
      • పచ్చి టమాటా తో ' మెంతిబద్దలు '
    • ►  June (2)
      • ములక్కాడ(drumstick) తియ్య కూర
      • పుదీనా రైస్
    • ►  May (4)
      • ఆంధ్రా pizza
      • One salad - Two dressings !!
      • Gujarati 'chundo'
      • my most favourite - ఉప్పుడుపిండి పులిహోర !
    • ►  April (6)
      • పేలాల వడియాలు
      • అరటిపువ్వు వడలు - no one can eat just one !
      • ఆదివారం పొద్దున్నే ఓట్స్ ఉప్మా !!
      • మెంతిబద్దలు
      • సోయా వడలు
      • కొత్తావకాయ, కందిపొడి, ముద్దపప్పు !!
    • ►  March (5)
      • పెసరఉండలతో మజ్జిగపులుసు
      • చారులు .. రకాలు..
      • ఇంట్లోనే "సాంబార్ పౌడర్" చేసుకోండిలా...
      • కాకరకాయ ఒరుగులు
      • stuffed capsicum
    • ►  February (2)
      • గోంగూర గ్రీన్ పచ్చడి
      • కందట్టు
  • ▼  2010 (14)
    • ►  December (6)
      • మెంతికూర-పనీర్ రైస్
      • స్పాంజ్/స్టీం దోశ
      • శీతాకాలంలో బూడిదగుమ్మడి వడియాలు + అట్టు ?!
      • కాలీఫ్లవర్ ఆవకాయ
    • ►  September (4)
    • ▼  August (1)
      • అరటి దూట( Banana stem ) చేసే మేలు - కొన్ని వంటలు
    • ►  June (3)

About

My Photo
తృష్ణ
View my complete profile

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    "రజనీ ఆత్మకథా విభావరి" - రెండు మంచి ప్రసంగాలు
    2 days ago
  • సంగీతప్రియ
    "అప్పుడప్పుడు"
    3 days ago
  • మనోనేత్రం
    mobile photos
    2 weeks ago
  • సినిమా పేజీ
    "Children of Heaven"
    2 months ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys (1)
  • expetiments (2)
  • Kitchen Essentials (1)
  • pulses (1)
  • recipe links (1)
  • rotis (1)
  • salads (2)
  • snacks (5)
  • tiffins (2)
  • అట్లు - రకాలు (5)
  • ఊరగాయలు-రకాలు (7)
  • ఒడియాలు (3)
  • కూరలు (13)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (2)
  • పచ్చళ్ళు (7)
  • పప్పులు (2)
  • పులిహోర (1)
  • పులుసులు (1)
  • మన పిండివంటలు (1)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (4)

'రుచి' ఇష్టపడేవారు

కూడలి haaram logo మాలిక: Telugu Blogs
Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.