skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

పెసరఉండలతో మజ్జిగపులుసు

5:16 PM | Publish by తృష్ణ


మజ్జిగపులుసును కొందరు "మజ్జిగ చారు" అనీ, కొందరు "చల్ల పులుసు" అని కూడా అంటారు. మేము "మజ్జిగ పులుసు" అంటాం. పుల్లటి పెరుగులో కానీ, తాజా పెరుగులో కానీ కాస్తంత శనగపిండి కలిపి మజ్జిగ పులుసు చేస్తారు. ఒకట్రెండు రోజుల పెరుగు కాస్త కాస్త మిగిలిపోతే, అంతా కలిపి మా ఇంట్లో అమ్మ "మజ్జిగ పులుసు" చేసేది. మరీ పులుపు మాకు ఇష్టం ఉండదు కాబట్టి కాసిని పాలు కలిపేది. మజ్జిగ మరీ పాతది కాకుండా ఉంటేనే దీని రుచి బాగుంటుంది. మా ఇంటిపక్కన కొన్నాళ్ళు గుజరాతీవాళ్ళు ఉన్నారు. వాళ్ళూ కూడా మజ్జిగపులుసు చేసేవారు. "కడీ" అంటారు వాళ్ళు. కానీ దాంట్లోనూ బెల్లం వేసేవారు. (వాళ్ళన్నింటిలోనూ, పప్పులో కూడా తీపి వేస్తారు.) మనవైపు నాకు తెలిసీ మజ్జిగపులుసులో తీపి ఎవరం వేసుకోము.

మజ్జిగపులుసులో రకాలు ఉన్నాయి :

* చిన్నఉల్లిపాయలతో(సాంబారు ఉల్లిపాయలు)
* ఆనపకాయ ముక్కలు, కేరెట్, ములక్కాడ తో
* అల్లం, ధనియాల పొడీ, కొబ్బరి పేస్ట్ తో
* పెసర ఉండలతో
* బచ్చలి ఆకుతో
* పాలకూర ఆకుతో
* ఏమీ వెయ్యకుండా ఉత్తదే.
* నేను బేబీ పొటాటోస్, ఉల్లిపాయలు వేసి కూడా చేస్తూంటాను.
* కొందరు బంగాళాదుంప బజ్జీలు, లేదా వేరే రకం బజ్జీలుగా చేసుకుని మజ్జిగపులుసులో వేస్కుంటారు.

మామూలు విధానం:
* ఒక గ్లాసు పెరుగుకి రెండు గ్లాసుల నీళ్ళు పోసి, ఉప్పు వేసి బాగా చిలుక్కోవాలి.
* శనగపిండి రెండు చెంచాలు, పావు చెంచా పసుపు ఆ చిలికిన మజ్జిగలో వేసి మళ్ళీ కాస్తంత చిలకాలి.
* ఇప్పుడీ మజ్జిగను మందపాటి గిన్నెలో లేదా మూకుడులో పోసి స్టౌ మీద పెట్టి, బాగా మరిగించాలి.
* మధ్య మధ్య కలపకపోతే అడుగంటి, మాడిపోతుంది.
* కాస్తంత కొత్తిమీర, సన్నగా పొడుగ్గా చీలికలు చేసిన ఒకటి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి.
* దింపే ముందు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కర్వేపాకు వేసి పోపు పెట్టాలి.

ఆకుకూరలు,కూరలతో:
బచ్చలి, పాలకూర మొదలైన వాటితో చేయాలంటే ముందర వాటిని సగం ఉడికించుకుని తరువాత మజ్జిగపులుసులో వెయ్యాలి. కూర ముక్కలతో చేసేది కూడా అంతే. ముందు ఉల్లిపాయ, కేరెట్, ములక్కాడ, ఆనపకాయ చిన్నచిన్న ముక్కలు చేసి, ఉడికించి తరువాత ఉడికే మజ్జిగపులుసులో వెయ్యాలి.

అల్లం, ధనియాల పొడీ, కొబ్బరి పేస్ట్ తో:
ఒక అంగుళం అల్లం ముక్క, పచ్చి ధనియాల పొడి ఒక చెంచా, రెండు చెంచాల ఫ్రెష్ కొబ్బరి కలిపి గ్రైండ్ చేసేసి అది పైన రాసిన మాములు మజ్జిగపులుసు ఉడుకుతున్నప్పుడు వేయాలి. దీని రుచి చాలా బాగుంటుంది. దీనిలో ఏ ముక్కలూ వేయకపోయినా బాగుంటుంది.

పెసర ఉండలతో:

* టీ గ్లాసులో 3/4 పెసరపప్పు ఓ గంట ముందు నానబెట్టాలి.
* పెసరపప్పు నానాకా, నీళ్ళు పూర్తిగా ఓడ్చేసి కాస్త ఉప్పు, పచ్చిమిర్చి(మీ టేస్టుకి తగినంత), కాస్త ఇంగువ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. దీనినే పెసరపప్పు పచ్చడి అంటారు. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే భలే ఉంటుంది.
* పైన రాసిన మామూలు మజ్జిగ పులుసు విధానం ప్రకారం మజ్జిగపులుసు చేసేసి, అది మరుగుతూండగా ఈ పెసరపప్పు ముద్దని ఒక గిన్నెలో తీసుకుని, కాస్త కాస్త చప్పున (పుణుకులపిండి నూనెలో వేసినట్లుగా) మరుగుతున్న పులుసులో వదలాలి. చేతి మీద వేడి పులుసు చిందకుండా జాగ్రత్త పడాలి మరి. ఈ పెసర పచ్చడి పులుసులో వెయ్యగానే ఉండలుగా ఎలా మారుతోంది? అని చిన్నప్పుడు ఆసక్తిగా ఉండేది చూట్టానికి.
* మరుగుతున్న పులుసులో ఈ పెసర ముద్దలు వెయ్యగానే గట్టిగా ఉండల్లా మారిపోతాయి. మరి కొంచెం సేపు మరగనిచ్చాకా దింపేసుకోవటమే.

Labels: పులుసులు 5 comments
5 Responses
  1. జ్యోతి Says:
    March 25, 2011 8:38 PM

    నేనైతే తొందరగా ఐపోతుందని సెనగపిండి బజ్జలు వేస్తాను. చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా పెరుగు కాస్త పుల్లగా ఉందంటే ఆరోజు మజ్జిగ పులుసు చేయాల్సిందే. ఈ మధ్యే కొన్ని కూరగాయలు వేసి మజ్జిగ పులుసు చేసాను.


  2. నైమిష్ Says:
    March 26, 2011 1:33 AM

    త్రుష్ణ గారు మజ్జిగ పులుసు నా ఆల్ టైం ఫేవరెట్..వారానికి ఒకరోజు మా ఇంట్లొ తప్పనిసరిగా చేస్తారు..మీరు చెప్పిన అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి..వంకాయ ముక్కలతో కూడా బాగుంటుంది..
    "అయితే మా బామ్మల తరం నుండి శనగపిండి విడిగా నీళ్ళలొ కలిపి మరుగుతున్న పులుసులో కలుపుతారు.." ..గుంటూర్ వాళ్లం కదా కాస్త కారం ఎక్కువ తింటాం.అందుకని అల్లంతో పాటు పచ్చి మిర్చి కూడా కలిపి పేస్ట్ చేసి కలుపుతారు..మీ రెసీప్స్ ఎప్పటిలాగే అదిరాయి..


  3. తృష్ణ Says:
    March 26, 2011 6:31 AM

    @జ్యోతి: మా అత్తగారు ఎప్పుడు మజ్జిగపులుసు చేసినా ఆలూ బజ్జీలు వేస్తూంటారు. ధన్యవాదాలు.

    @నైమిష్: వంకాయ కూడా వేస్తారండొయ్. మీరు రాస్తే గుర్తువచ్చింది. మా అమ్మ కుడా సనగపిండి అలానే కలుపుతుంది. నేను మాత్రం ఇలా మజ్జిగతో పాటూ చిలికేస్తాను.
    ధన్యవాదాలు.


  4. నైమిష్ Says:
    March 31, 2011 7:34 PM

    త్రుష్ణ గారు వీకెండ్ వస్తుంది..మరో మంచి వంటకం మాకోసం అందిస్తారని ఎదురుచూస్తూ..


  5. తృష్ణ Says:
    April 1, 2011 7:20 PM

    @నైమిష్: చాలా థాంక్స్ అండి. కొంచెం బిజీగా ఉన్నాను. పొద్దున్నలోపు వీలైతే ట్రై చేస్తాను. చాలా ఉన్నాయి లైనులో రాయాల్సినవి..:)


Post a Comment

« Newer Post Older Post »
Subscribe to: Post Comments (Atom)
"Health is Wealth."

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2012 (11)
    • ►  May (3)
      • ఆవకాయలు మాగాయలు - 2
      • ఆవకాయలు మాగాయలు - 1
      • పచ్చి బొప్పాయి(raw papaya) కూర
    • ►  April (1)
      • మావిడి పిందెలతో ఆవబద్దలు
    • ►  March (1)
      • ఆనపకాయతో చపాతీ/పూరీ కూర
    • ►  February (4)
      • కొబ్బరి + కంది పచ్చడి
      • నారింజకాయ కారం
      • ముల్లంగి చపాతీ
      • బ్రెడ్ ఉప్మా
    • ►  January (2)
      • అప్పాలు
      • వాంగీబాత్
  • ▼  2011 (35)
    • ►  December (3)
      • పండుమిరమకాయ - చింతకాయ పచ్చడి
      • ఓట్స్ దోశ
      • (కాల్చిన)అరటికాయ పొడి కూర
    • ►  November (6)
      • ఆయిల్ ఫ్రీ పొంగడాలు
      • దబ్బకాయ ఊరగాయ
      • mixed vegetable "కూటు"
      • బెంగుళూరు వంకాయ (chow chow) తో రకాలు...
      • పనసపొట్టు ఆవకూర
      • అరటిపువ్వు పచ్చడి
    • ►  September (3)
      • వాక్కాయ-కొబ్బరికాయ పచ్చడి
      • కేబేజీ పకోడి
      • కొబ్బరన్నం with & without masala
    • ►  August (4)
      • Russian salad
      • బీట్రూట్ - ఆవ కూర
      • మిక్స్డ్ వెజిటెబుల్ ఆవకాయ
      • పచ్చి టమాటా తో ' మెంతిబద్దలు '
    • ►  June (2)
      • ములక్కాడ(drumstick) తియ్య కూర
      • పుదీనా రైస్
    • ►  May (4)
      • ఆంధ్రా pizza
      • One salad - Two dressings !!
      • Gujarati 'chundo'
      • my most favourite - ఉప్పుడుపిండి పులిహోర !
    • ►  April (6)
      • పేలాల వడియాలు
      • అరటిపువ్వు వడలు - no one can eat just one !
      • ఆదివారం పొద్దున్నే ఓట్స్ ఉప్మా !!
      • మెంతిబద్దలు
      • సోయా వడలు
      • కొత్తావకాయ, కందిపొడి, ముద్దపప్పు !!
    • ▼  March (5)
      • పెసరఉండలతో మజ్జిగపులుసు
      • చారులు .. రకాలు..
      • ఇంట్లోనే "సాంబార్ పౌడర్" చేసుకోండిలా...
      • కాకరకాయ ఒరుగులు
      • stuffed capsicum
    • ►  February (2)
      • గోంగూర గ్రీన్ పచ్చడి
      • కందట్టు
  • ►  2010 (14)
    • ►  December (6)
      • మెంతికూర-పనీర్ రైస్
      • స్పాంజ్/స్టీం దోశ
      • శీతాకాలంలో బూడిదగుమ్మడి వడియాలు + అట్టు ?!
      • కాలీఫ్లవర్ ఆవకాయ
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

My Photo
తృష్ణ
View my complete profile

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    "రజనీ ఆత్మకథా విభావరి" - రెండు మంచి ప్రసంగాలు
    2 days ago
  • సంగీతప్రియ
    "అప్పుడప్పుడు"
    3 days ago
  • మనోనేత్రం
    mobile photos
    2 weeks ago
  • సినిమా పేజీ
    "Children of Heaven"
    2 months ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys (1)
  • expetiments (2)
  • Kitchen Essentials (1)
  • pulses (1)
  • recipe links (1)
  • rotis (1)
  • salads (2)
  • snacks (5)
  • tiffins (2)
  • అట్లు - రకాలు (5)
  • ఊరగాయలు-రకాలు (7)
  • ఒడియాలు (3)
  • కూరలు (13)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (2)
  • పచ్చళ్ళు (7)
  • పప్పులు (2)
  • పులిహోర (1)
  • పులుసులు (1)
  • మన పిండివంటలు (1)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (4)

'రుచి' ఇష్టపడేవారు

కూడలి haaram logo మాలిక: Telugu Blogs
Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.