Thursday, September 15, 2011

వాక్కాయ-కొబ్బరికాయ పచ్చడి



మార్కెట్లోకి వక్కాయలు వచ్చాయి.. మరి పచ్చడి చేసేస్కుందామా? వాక్కాయలు మరీ పండిపోకుండా గ్రీన్ గా ఉన్నవి కొనుక్కోవాలి.. ఇలా..




వాటి మధ్యన గింజలు తీసేయాలి క్రింద ఫోటోలోలాగ. లేకపోతే పచ్చడి చేదొస్తుంది.


కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకుంటామో అలానే అన్ని పాళ్ళు తీసుకుని, చింతపండు బదులుగా ఈ వాక్కయల్ని వాడాలి. అంతే.


 కొలతలు కావలంటే:

* మొదట ఆవలు, మినపప్పు (కాస్త ఎక్కువ), కాస్త జీలకర్ర, రెండు ఎండు మిర్చి, కాస్త ఇంగువ, ఓ రొబ్బ కర్వేపాకు లతో పోపు పెట్టుకోవాలి.

తర్వాత:

* ఒక కొబ్బరి చిప్ప (మొత్తం కాదు సగమే..:)) చిన్నగా ముక్కలు తరుక్కోవాలి లేదా కోరుకోవాలి

* ఎనిమిది లేక పది వాక్కాయలు (ఎక్కువ వేస్తే పులుపు తినలేము)


* రెండు పచ్చిమిర్చి

* తగినంత ఉప్పు ,చిటికెడు పసుపు

* పోపుతో వేయించిన ఎండు మిరపకాయలు



* పైన చెప్పినవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయ్యిన పచ్చడిలో మొదట్లో పెట్టుకున్న పోపు కలిపేసుకోవాలి.



* పోపు కూడా పచ్చడితో గ్రైండ్ చేసేస్తారు కొందరు. కానీ పెరుగు పచ్చడిలో అయినా, రోటి పచ్చడిలో అయినా పోపు చివరన వేస్తేనే మధ్య మధ్య వేగిన మినపప్పు తగులుతూ రుచిగా ఉంటుంది.




6 comments:

మానస చామర్తి said...

చాలా రోజులకి వాక్కాయ చూశాను. మా అమ్మగారు బాగా చేసేవారు. ఒక్కసారిగా ఆ పోపు వాసనలు, రుచులు చుట్టుముట్టాయి.థాంక్స్. :)

రసజ్ఞ said...

ఏమిటీ ఘుమ ఘుమ? ఓహో వాక్కాయలు తెచ్చారా? ఇంట్లో వాక్కాయలు కనిపించినప్పుడల్లా పచ్చివి తెగ తినేసి గొంతు నొప్పి తెచ్చేసుకునేదానిని. కొబ్బరికాయి వాక్కాయి పచ్చడి బాగుంటుంది కానీ నాకు మాత్రం వాక్కాయి పప్పు, బచ్చలికూరా వాక్కాయి పులుసు చాలా ఇష్టం! మా ఇంటిని తలపించారు ధన్యవాదములు!

Mahek said...

నేనింతవరకు వాక్కాయలు ఎప్పుడు చూడలేదు. థాంక్యు తృష్ణ, ఫర్ ది ఫోటో :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

అబ్బా,,,, ఈ పోస్ట్ చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి... తలచుకుంటే నోట్లో నీరూరుతుంది :)

ఇప్పుడివి దొరుకుతున్నాయా? మా వైపు వీటిని పుల్లేరు కాయలు/పళ్ళు అంటారు.

చాలా ఇష్టం ఈ కాయల పచ్చడన్నా, పచ్చివే తినడమన్నా.

తృష్ణ said...

@మానస చామర్తి: మా నాన్నమ్మ తరువాత మా ఆత్తగారు ఈ పచ్చడి ఎక్కువ చేయటం చూసానండి. ధన్యవాదాలు.

@రసజ్ఞ : బచ్చలికూర వాక్కాయ పులుసా? ఇదేదో ప్రయత్నించాల్సిందే !
ధన్యవాదాలు.

తృష్ణ said...

@మహెక్: ఇంతవరకు వాక్కాయలు చూళ్ళేదా? అయ్యో...ఈసారి దొరికితే ప్రయత్నించండి...ఇండియా వస్తే దొరుకుతాయిలెండి.
ధన్యవాదాలు.

@అవినేని భాస్కర్ : చిన్ననాటి స్మృతుల్లోకి వెళ్పోయారన్నమాట...:) పచ్చివి తినేస్తారా? బాబోయ్ పుల్లగా ఉండవు? "పుల్లేరు కాయలు" పేరు ఇప్పుడే వినటమండి.
ధన్యవాదాలు.