అరటి దూట తో చేసే వంటకాలు నాకెంతో ఇష్టం. ముఖ్యంగా అరటి దూట పెరుగుపచ్చడి. రోజూ దూట దొరికితే రోజూ తినేంత. సిటీల్లో అరటి దూట దొరకటం కొంచెం కష్టమైన పనే. అయినా దొరికినప్పుడల్లా కనీసం వారానికి రెండు,మూడుసార్లు అయినా తినటం చాలా ఆరోగ్యకరం.
దూట తినటం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే --
1) దీనిలో పీచు పదార్ధం(ఫైబర్) ఎక్కువ ఉండటం వల్ల అరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది.
2) పిచు పదార్ధం ఎక్కువ ఉండటం వల్ల అధిక బరువు తగ్గించటానికి కూడా దూట బాగా ఉపయోగపడుతుంది.
3) దీనిలోని పొటాషియం, విటమిన్ B6 శరీరంలో హీమోబ్లోబిన్ , ఇన్సులిన్ మొదలైన రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. పొటాషియం శరీరంలోని కండరాలు సరిగా పనిచేయటానికి, బ్లడ్ ప్రషర్ ను అదుపులో ఉంచటానికీ బాగా దోహదపడుతుంది.
4) దూటకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది.
ఒక గ్లాసు దూట రసం పొద్దున్న,సాయంత్రం త్రాగటం వల్ల ఉపయోగాలు :1) లేత అరటి దూట రసం tuberculosis తాలూకు బ్యాక్టీరియను సంహరిస్తుంది.
2) అన్నిరకాల మూత్ర సంబంధిత వ్యాధులనూ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ నూ దూట రసం బాగా తగ్గిస్తుంది.
3) అరటిదూట రసం అన్నిరకాల కిడ్నీ రాళ్ళను కరిగిస్తుందని అంటారు. గాల్ బ్లాడర్ లోని రాళ్ళను కూడా కరిగిస్తుందని అంటారు.
అయితే ఈ రసాన్ని బూడిదగుమ్మడికాయ రసంతో కలిపి తీసుకోవటమ్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయిట.
తరగటం కొద్దిగా కష్టమైన పని అయినా అరటిదూట వల్ల శరీరానికి జరిగే మేలు అనంతం కాబట్టి వీలైనంత ఎక్కువగా తినటం ఎంతో ఆరోగ్యకరం.
ముందుగా దూటను తరిగే పధ్ధతి:
ముందుగా దూటను తరిగే పధ్ధతి:
పైన చూపిన విధంగా చక్రాలాగ తరుక్కుని, తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
వీటిని పల్చటి మజ్జిగ నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. లేకపోతే నల్లబడిపోతాయి.
ఇక దీనితో తయారయ్యే వంటకాలు కొన్ని..
దూట కూర :(1.ఆవ పెట్టి)
"అరటిదూట ఆవకూర చేయటం వస్తే బోలెడు ఓర్పు ఉన్నట్లు లెఖ్ఖ..." అని శ్రీరమణగారి బంగారుమురుగు కధలోని బామ్మగారు చెప్తారు.
చిన్నగా తరిగిన అరటి దూట ముక్కలను తగినన్ని నీళ్ళలో ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. (ఉడికాకా నీళ్ళు వార్చకుండా సరిపోయేటన్నే పోసుకోవాలి.)
ఉడికాకా ముక్కలలో కొద్దిగా నీరు ఉన్నా తడిలేకుండా వార్చేసుకోవాలి.
తరువాత తగినంత నూనెలో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఎండు మిరపకాయలు, కర్వేపాకు,ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
కూర చల్లారిన తరువాత, కొద్దిగా పచ్చిఆవ పొడి(బజారులో దొరుకుతుంది లేదా పచ్చి ఆవాలను గ్రైండ్ చేసుకోవచ్చు.) చల్లి బాగా కలుపుకోవాలి.
దూట కూర :(౨.కొబ్బరి వేసి)
కూర పైన చెప్పిన విధంగానే చేసుకోవాలి. ఆవ బదులు పోపు పెట్టేప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి కలుపుకోవాలి. అందులో ఉడికిన దూట ముక్కలు వేసి రెండు నిమిషాల తరువాత దింపుకోవాలి.
దూట కూర (౩.చింతపండు రసంతో):
ముందు నిమ్మకాయంత చింతపండు గోరువెచ్చనినీళ్ళలో నానబెట్టి రసం చిక్కగా తీసి ఉంచుకోవాలి.
తరువాత పైన చెప్పిన విధంగా పోపు పెట్టేసుకుని, చిటికెడు పసుపు, కాస్తంత చింతపండు రసం వేసి, అందులో ఉడికిన దూట ముక్కలు వేసి బాగా కలిపాకా దింపుకోవాలి. దీనిలో పచ్చికొబ్బరి కోరు కూడా వేసుకోవచ్చు.
దూట - పెసరపప్పు పొడి కూర (౪):
చిన్నగా తరిగిన అరటి దూట ముక్కలను, ముక్కలకు సగం క్వాంటిటీలో పెసరపప్పును తగినన్ని నీళ్ళలో ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు బద్దగానే ఉండాలి. ముద్ద అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. పొడి పొడిగా ఉడికాకా దింపేసుకోవాలి.
ఆవాలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి,ఎండుమిర్చి (రెండూ తినే కారాన్ని బట్టి),కర్వేపాకు, చిటికెడు పసుపు వేసి,అందులో ఉడికిన దూట ముక్కలు, పెసరపప్పు మిక్స్ వేసి రెండు నిమిషాల తరువాత దింపుకోవాలి.

దూట పెరుగు పచ్చడి :
కమ్మని పెరుగు ఒక కప్పు కాసిని నీళ్ళలో చిలికి ఉంచాలి. ఉప్పు కలపాలి.
తరువాత తరిగిన దూట ముక్కలను (పచ్చివే) చిలికిన పెరుగులో కలపాలి.
ఆవాలు, మినపప్పు, మెంతులు, కర్వేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
(ఆవ ఇష్టం ఉంటే) దీనిలో కొద్దిగా పచ్చిఆవ పొడి కలుపుకుంటే చాలా బాగుంటుంది.
మెంతులు ఇష్టం లేకపోతే పోపులోనే చిటికెడు మెంతిపొడి వేసి బాగా వేగాకా(ఎర్రబడ్డాకా) పెరుగులో కలుపుకోవచ్చు.