skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."
Showing posts with label ఒడియాలు. Show all posts
Showing posts with label ఒడియాలు. Show all posts

పేలాల వడియాలు

2:29 PM | Publish by తృష్ణ


పేలాల వడియాలు మొదటిసారి మా వదిన తెచ్చినప్పుడు తిన్నాను. రుచి అమోఘం. పేలాలతో చేస్తారు. మా వదినావాళ్ళ అమ్మమ్మగారు అనకాపల్లిలో ఉంటారు. ఆవిడ ఒకట్రెండుసార్లు పేలాల వడియాలు పంపించారు. చాలా నచ్చాయి మాకు. మరో రెండుసార్లు ఎవరో చేసి అమ్ముతున్నారంటే తెప్పించుకున్నాం. ఎన్నిసార్లని తెప్పించుకుంటాం? ఎలా చేయాలో తెలిసేసుకుని చేసేస్తే ఒ పనైపోతుంది కదా అని అడిగేసి మొత్తానికి ఈ ఏడు పెట్టేసాను. బాగా వచ్చాయి. ఎలా చేయాలో చెప్పేస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు పెట్టేసుకోండి మరి.



పేలాలంటే కొంతమంది బజార్లో మరమరాలు ఇచ్చేస్తారు. మొదట నేను కూడా వాటితోనే ఒడియాలు పెట్టేసి వేయించేసరికీ అవి విరవటానికి వీల్లేకుండా వచ్చాయి. మళ్ళీ సరిగ్గా కనుక్కుని సరిగ్గా అడిగి కొని మళ్ళి పెట్టాను. అప్పుడు బాగా వచ్చాయి..:)

పేలాలు క్రింద ఫోటోలోలాగ ఉంటాయి.(తెలియనివాళ్ళకు)


ఎలా చేయాలంటే:


* అరకిలో పేలాలు తీసుకుని ఒడ్లు ఏరేసి శుభ్రం చేసుకోవాలి. నేను తడిపాకా ఆ సంగతి గ్రహించాను. అందువల్ల సరిగ్గా ఏరలేకపోయా..:)

* కాసిని నీళ్ళు తీసుకుని కాస్త కాస్త చప్పున పేలాలన్నీ ఒకసారి ముంచి తీసేసి, గట్టిగా పిండి పక్కనపెట్టుకోవాలి.

* అర కిలో పేలాలకి ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని రాత్రి నానబెట్టి పొద్దున్నే వాడుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడు రెండుగ్లాసులు నీళ్ళలో సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టాలి.

* మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, కాస్తంత జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

*కాసిని నువ్వులు కూడా తీసుకోవాలి.

* ఇప్పుడు నీటిలో పిండేసి ఉంచిన పేలాల ముద్ద, ఉడికిన సగ్గుబియ్యం, తగినంత ఉప్పు, రుబ్బిన మిర్చి-జీలకర్ర పేస్ట్, నువ్వులు అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. నాకులా చేత్తో కలిపి తర్వాత మంట మంట అని గోలపెట్టకుండా చక్కగా ఒక గరిటేతో మొత్తం బాగా కలుపుకోండి.

ఆ ముద్ద క్రింది ఫోటోలోలాగ ఉంటుంది. ఫోటో సరిగ్గా రాలేదు..:(


రెండు ఎండలకే బాగా ఎండిపోయాయి వడియాలు. అవి వేయించుకుని తింటే... 'ఆహా ఏమి రుచి' అనక మానరు !!

 

Labels: ఒడియాలు 1 comments

కాకరకాయ ఒరుగులు

7:31 PM | Publish by తృష్ణ


ఎండబెట్టిన తరువాత వడియాల్లా అయిపోయే కూరముక్కలను "ఒరుగులు" అంటారు. దొండకాయ, వంకాయ, బెండకాయ, కాకరకాయ మొదలైన కూరలతో ఒరుగులు చేస్తారు. పండిన కూరలు ఉంటే వాటిని తరిగి ఉప్పు, కారం రాసి ఎండబెడితే అవి ఒరుగులైపోతాయి. పచ్చివి కూడా తరిగి ఎండబెట్టుకోవచ్చు. నేను ఒడియాలతో పాటూ ఈ ఒరుగులను కూడా చేస్తూంటాను. పప్పులో, పులుసుల్లో అప్పడాల స్థానంలో ఒరుగుల్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడన్నా కూర లేకపోతే వీటిని వేయించుకుని కూరలాగే అన్నంలో అద్దుకు తినేసేవాళ్ళం చిన్నప్పుడు.

నాకు ముఖ్యంగా కాకర, దొండ ఒరుగులు ఇష్టం. ఎండల్లోనే కాక మామూలు రోజుల్లో కూడా వీటిని చేస్కోవచ్చు. కానీ కొంచెం ఎక్కువ రోజులు ఎండబెట్టాలి అంతే. ఒక తడవ అయిపోగానే మళ్ళీ ఓ కేజీ కొనేసి అన్ని కాలాల్లోనూ ఒరుగులు చేసేస్కుంటూ ఉంటాను నేను. కాకరకాయ కూర తినలేనివాళ్ళు ఇలా ఒరుగుల్లా చేసుకుంటే చేదు రుచి తెలీకుండా తినవచ్చు.

చేసుకోవటం ఎలాగంటే:
పచ్చివి కానీ పండువి కానీ కాకరకాయలు గుండ్రంగా తరుక్కుని ఉప్పు,కారం రాసి మంచి ఎండలో రెండు రోజులు బాగా ఎండబెట్టడమే. ఒరుగులు రెడీ. మరి మీరూ చేసేయండి.


Labels: ఒడియాలు 5 comments

శీతాకాలంలో బూడిదగుమ్మడి వడియాలు + అట్టు ?!

2:16 PM | Publish by తృష్ణ



ఆదివారం పొద్దున్నే నాన్నకు ఫోన్ చేసి నాన్నా, పొద్దున్నే వడియాలు  పెట్టేసా అని ఆనందంగా చెప్పా. "ఏమిటే శీతాకాలంలో వడియాలు పెట్టే మొహం నువ్వూనూ..ఎండేదే? అన్నారు నవ్వుతూ. "మా కొత్త ఇంట్లో మేడ మీద బోలెడు ఎండ. మీ మనవరాలు రోజూ అమ్మా బోలెడు ఎండ వస్తోందే. ఏవన్నా వడియాలు పెట్టుకుందాం అని ఒకటే గొడవ." అన్నాన్నేను. మొన్నటి దాకా అపార్ట్మెంట్లో ఎండ మొహం కూడా తెలియక ఆరేసిన బట్టలు రెండురోజులకు ఆరటమే తెలుసు మాకు. అలాంటిది ఒక్కసారిగా ఈ కొత్తింట్లో స్వచ్ఛమైన, సహజమైన, చుర్రుమనే ఎండను చూడగానే మా ప్రాణాలు కుదుటపడటమే కాక నాట్యం చేయటం కూడా మొదలెట్టాయి.


ఇక పక్క వీధిలోని కూరల కోట్లో బూడిదగుమ్మడికాయలు చూసినప్పటి నుంచీ మనసు అటే లాగటం మొదలెట్టింది. ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు పెంచిన బూడిదగుమ్మడి పాదు, పండించిన పంచిన గుమ్మడి కాయలు, పెట్టిన వడియాలు అన్నీ గుర్తుకొచ్చేసాయి. ఓ శుభ ముహుర్తాన వెళ్ళి బేరమాడి ఒక బుల్లి బూడిదగుమ్మడికాయ కొనేసాను. ఇక శనివారం రాత్రి ముక్కలు తరిగేసాను.


వాటిని ఉప్పేసి మూటగట్టి నీళ్ళబిందె క్రింద పెట్టాను. చిన్నప్పుడు అమ్మ అయితే రోలు క్రింద పెట్టేది. మినపప్పు నానబెట్టి ఉంచాను. ఆదివారం పొద్దుటే ఇంగువ, పచ్చిమిర్చి,ఉప్పు వేసి పప్పు గ్రైండ్ చేసి ముక్కల్లో కలిపేసాను. మినప్పిండి నేను ఎక్కువ కలపను. ఈ వడియాలు  గుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. అమ్మ కొన్ని పచ్చి మిరపకాయలతోనూ, కొన్ని పండు మిరపకాయలతోనూ కలిపి పెట్టేది.




ఇక ప్లేస్టిక్ కవర్ పెట్టుకెళ్ళి మాకోసమే అన్నట్లు డాబా మీద మధ్యలో ఉన్న సిమెంటు బెంచీ మీద వడియాలు  నిర్విఘ్నంగా పెట్టేసాను. రెండు రోజుల్లో శుభ్రంగా వడియాలు రెడీ అయిపోతాయి.


ఇక కాస్తంత పిండి అట్టు వేసుకోవటానికి దాచాను. బూడిద గుమ్మడి వడియాలు నాకు చాలా ఇష్టం. అలానే ఈ వడియాల పిండితో వేసే అట్టు కూడా నాకు భలే ఇష్టం.అన్నం తినే ముందు వేడి వేడిగా వేసుకుంటే బాగుంటాయి.


ఇదిగో ఇలా ఒక బుల్లి అట్లు రెండు వచ్చాయి. వేస్తూ వేస్తూనే ఒకటి లాగించేసాను, పోటీకెవరూ లేరు కాబట్టి అన్నంలోకి ఒకటి వేసుకున్నా.




"పేటా" అని బూడిదగుమ్మడితో చేసిన స్వీట్ అమ్ముతారు. చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నాన్న ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మా కోసం తెచ్చేవారు. అదండి నా శీతాకాలం బూడిదగుమ్మడివడియాల కథ. ఇంతకూ మీకూ వడియాలు కావాలా? అట్టు కావాలా?

Labels: tiffins, అట్లు - రకాలు, ఒడియాలు 4 comments
Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    దివ్యమైన అనుభూతిని అందించిన "HANUMAN ANSH"
    2 weeks ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    11 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.