రెండ్రోజుల క్రితం మా రాత్రి అన్నం మెనూ ఇది. మా పెద్దత్తగారు కాకినాడ నుంచి పంపించారు. వాటిని చూడగానే నోరూరి ఇక ఆ పూటకు చపాతీలకు స్వస్తి చెప్పి(రాత్రి పూట మేం రోజూ చపాతీలే) దంపుడు బియ్యం కాకుండా వైట్ రైస్ వండేసి, వేడి వేడి అన్నంలో ఆవకాయ, కందిపొడి విత్ "ఇంట్లో చేసిన నెయ్యి" వేసుకుని సుభ్భరంగా తినేసాం. ఒక్కరోజుకు డైటింగ్ కు టాటా చెప్పచ్చు...:)
ఆవకాయలోనూ, కందిపొడిలోనూ నూనె వేసుకుని తినటం మామూలే. నెయ్యి వేసుకుని కూడా తింటే భలే ఉంటుంది. ఇక ముద్దపప్పు నాకోసం కాదు శ్రీవారి కోసం. ముద్దపప్పు + ఆవకాయ వాళ్ళింట్లో కాంబినేషన్. మరి మీరు కూడా కందిపొడి చేసేసుకుంటారా?
కందిపొడి:
కందిపప్పు : ఒక గ్లాసు
పెసరపప్పు : అర గ్లాసు
శెనగపప్పు : పావు గ్లాసు
పుట్నాలపప్పు : పావు గ్లాసు
చారెడు మినప్పప్పు (ఇది వేయకపోయినా పర్వాలేదు)
మీరు తినే కారానికి సరిపడా ఎండు మిరపకాయలు
