skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."
Showing posts with label మన పిండివంటలు. Show all posts
Showing posts with label మన పిండివంటలు. Show all posts

దధ్యోజనం

11:20 AM | Publish by తృష్ణ





వాడుకలో మనం 'దద్దోజనం' అనే పెరుగన్నం అసలు పేరు 'దధ్యోజనం'. బయట 'curd rice' అని హోటల్స్ లో పెట్టేది చల్ల అన్నంతో, మిగిలిపోయిన అన్నంతో చేసేయచ్చు. కానీ మనకి గుడులలో పెడ్తారు కదా ప్రసాదంగా ఆ దద్దోజనం అంటే వేడి వేడి అన్నం అప్పటికప్పుడు వండి చేసేదే. ఎప్పుడైనా బిర్యాని, ఫ్రైడ్ రైస్ మొదలైన రైస్ ఐటెమ్స్ చేసినప్పుడు నేనీ దద్దోజనం చేస్తుంటాను. రెండూ కాస్త కాస్త తినేసి వంటిల్లు క్లోజ్ చేసేయచ్చని :)

కమ్మటి దద్దోజనం చేసుకోవాలంటే..
కావాల్సినవి:

* ఒక గ్లాస్ బియ్యం (nearly 150gms)
* రెండు గ్లాసుల కమ్మటి పెరుగు
(పెరుగు విజయా డైట్ మిల్క్ కాచి తోడుపెట్టినదైనా నీళ్ళు కలపకుడ్మా ఉంటే బాగుంటుంది. నే చేసినది డైట్ మిల్క్ పెరుగుతోనే))
* ఒక చెంచా నెయ్యి లేదా నూనె
* తురిమిన లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న అంగుళం అల్లం 
* తగినంత ఉప్పు 
* గుప్పెడు దానిమ్మ గింజలు
* పోపుకి: ఆవాలు,జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కర్వేపాకు, చిటికెడు పసుపు, రెండు పచ్చి మిరపకాయలు, ఒక ఎండు మిర్చి, 


చేసే విధానం:
* గ్లాసు బియ్యానికి రెండున్నర లేదా మూడు గ్లాసుల నీళ్ళు పోసి కాస్త మెత్తని అన్నం వండాలి.పెరుగన్నం కదా అన్నం గట్టిగా ఉంటే బావుండదు.

*  చెంచా నెయ్యి/నూనెలో పైన చెప్పిన పోపు పదార్ధాలతో పోపు వేయించాలి. చివరన అల్లం ముక్కలు వేసి స్టౌ ఆపేయాలి. అల్లం ముక్కలకి ఆ వేడి చాలు. 

* పెరుగు నీళ్లు పొయ్యకుండా చిలికి తగినంత ఉప్పు కలపాలి. అన్నం చలారాకా అందులో  వేయించిన పోపు కలపాలి. తరువాత చిలికిన పెరుగు కలపాలి. 




* కొత్తిమీర ఇష్టం ఉంటే సర్వ్ చేసే ముందర కాసిని ఆకులు దధ్యోజనం పైన  చల్లచ్చు. 

* అన్నం,పెరుగు,ఉప్పు బాగా కలిసాకా సర్వ్ చేసే ముందు గుప్పెడు దానిమ్మకాయ గింజలు పైన చల్లితే రుచి బాగుంటుంది + దానిమ్మకాయ అరుగుదలకి చాలా మంచిది.

Tips:
* అన్నం వేడిగా ఉన్నప్పుడు పెరుగు కలిపితే పెరుగు విరిగినట్లు అయిపోయి రుచిలో తేడా వచ్చేస్తుంది.

* ఏదన్నా డిష్ మీద కొత్తిమీర అలంకరించేప్పుడు కొత్తిమీరఆకులు కట్ట పడంగా కట్ చేసేస్తే అందమైన లుక్ పోతుంది. అందుకని కొత్తిమీర ఆకులపడంగా తుంపి వెయ్యాలి.




Labels: మన పిండివంటలు, రైస్ వెరైటీస్ 3 comments

అప్పాలు

2:06 PM | Publish by తృష్ణ





గోధుమ పిండీ, బియ్యపిండీ కలిపి అప్పాలు చేస్తారు. అరిశలు కష్టం అనుకునేవారు ఇలా రెండుమూడు రకాల పిండిలు కలిపి అప్పాలు చేసుకోవచ్చు. మరోరకం అప్పాలు సజ్జ పిండితో(bajra) చేస్తారు. వాటినే సజ్జప్పాలు అంటారు.

నేను ఈసారి గోధుమ పిండీ, బియ్యపిండీ + సజ్జ పిండి కలిపి అప్పాలు చేసాను. బాగా వచ్చాయి.

ఇదిగో రెసిపీ:

* గోధుమపిండి: రెండు గ్లాసులు
* బియ్యప్పిండి :ఒక గ్లాసు
* సజ్జపిండి: ఒక గ్లాసు
* ఒక చిప్ప కొబ్బరి కోరు
* బెల్లం తురుము: రెండు గ్లాసులు
* పావు కప్పు నెయ్యి
* ఐదారు ఏలకుల పొడి
* అప్పాలు వేయించటానికి తగినంత నూనె

విధానం:

* పిండిలన్నీ బాగా కలిపి జల్లించి ఉంచుకోవాలి.

* బెల్లంతురుములో గ్లాసుడు నీళ్ళు పోసి ఉండపాకం పట్టాలి. (కాస్త పాకం చెంచాతో తీసి నీళ్ళల్లో వేస్తే కరగకుండా గట్టిపడుతున్నట్లు ఉండాలి)

* బెల్లం పాకం తయారవ్వగానే కొబ్బరికోరు, జల్లించి ఉంచిన పిండి పాకంలో పోసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. యాలకుల పొడి, నెయ్యి కూడా ఈ కలిపేప్పుడే వేసేయాలి.

* నాలుగైదు నిమిషాలు పొయ్యి మీద మొత్తం మిశ్రమం బాగా కలిపి బాగా దగ్గర పడినట్లు కనబడ్డాకా స్టౌ ఆపేయాలి. తయారైన ఉండ ఇలా ఉంటుంది.



* చలిమిడి లాగ ఉన్న ఆ మిశ్రమం కొద్దిగా చల్లారాకా(ఎక్కువ చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది) గోరుచెచ్చగా ఉండగానే చిన్న చిన్న ఉండలు చేసుకుని, పాల కవర్ మీదో లేక అరిటాకు మీదో కాస్తంత నూనె రాసి, చేత్తో గుండ్రంగా వత్తుకోవాలి. (మరీ సన్నంగా వత్తనక్కర్లేదు.)

* వత్తిన వెంఠనే నూనెలో వేయించాలి.




* పొంగిన అప్పాలను ఏదైనా గరిటతో లేదా అరిశలు వత్తే చెక్కతో వత్తాలి. ఇలా వత్తటం వల్ల ఎక్సెస్ నూనె అంతా బయటికి వచ్చేసి అప్పాలు ఫ్లాట్ గా అవుతాయి.


* ఇలా చేసుకున్న అప్పాలు పదిహేను ఇరవై రోజులు నిలవ ఉంటాయి. అప్పటికి ఇంట్లో వాళ్ళు డబ్బా ఖాళీ చేసేయకుండా ఉంటే..:)


Labels: మన పిండివంటలు 2 comments
Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    'Krishnavataram Part 1: The Heart
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    11 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.