skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."
Showing posts with label rotis. Show all posts
Showing posts with label rotis. Show all posts

మెంతాకు(methi) చపాతీ

9:37 AM | Publish by తృష్ణ




 మేం బొంబాయిలో ఉన్నప్పుడు "మేథీ థేప్లా" అని దొరికేది. కాస్త స్పైసీ గా ఉంటుంది. మెంతి ఆకులు, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, పసుపు అవీ వేసి చేస్తారు. అలా కాకుండా ప్లైన్ గా ఏ పొడాలు కలపకుండా నేనిలా ప్లైన్ మెంతి చపాతీలు చేస్తూంటాను. పెద్ద మెంతికూర కట్టలు కాకుండా చిన్నమెంతి కట్టలు అమ్ముతారు కదా.. అవి వాడతాను. ఇవి మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కుండీలో గుప్పెడు మెంతులు వేస్తే ఇలా చిన్నచిన్న మొక్కలు వస్తాయి.




మెంతి చపాతీ:

* చిన్న మెంతి కట్టలు రెండు బాగా కడిగి నీళ్ళు ఓడ్చేయాలి ఇలా..


* మామూలుగా మనం చపాతీకి కలుపుకునే పిండిలోనే ఈ కడిగిన చిన్న మెంతి ఆకులు కూడా వేసి పిండి కలుపుకోవాలి. చిన్న కట్టలే కాబట్టి తరగక్కర్లేదు.
* మామూలుగా చపాతి ఒత్తుకున్నట్లే ఒత్తేసి, కాల్చటమే. 
* చిన్న మెంతి కాబట్టి చేదు కూడా తెలీదు.
* పిల్లలకి కాస్త నెయ్యి వేసి చపాతీ కాలిస్తే ఇష్టంగా తింటారు.


Labels: rotis 2 comments

ముల్లంగి చపాతీ

3:57 PM | Publish by తృష్ణ




చలికాలం అయిపోతోంది కానీ ఇంకా లేత ముల్లంగి దొరుకుతోంది. ముల్లంగి వాసన నచ్చక కూరగా కానీ పచ్చడిగా కానీ  తినలేనివారు ముల్లంగి తురుముకుని చపాతీ చేసుకోవచ్చు.

ముల్లంగి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో క్రింద లింక్ లో చూడవచ్చు:
http://en.petitchef.com/recipes/health-benefits-of-mooliradish-fid-418423


తయారీ:

* ముందుగా లేత ముల్లంగి ఇలా తురుముకోవాలి.





* ముల్లంగి వాసన నచ్చకపోతే, ఆ తురుములో కాస్తంత ఉప్పు వేసి ఐదు నిమిషాలు అట్టే పెట్టి, ఆతర్వాత  ముల్లంగి తురుముని గట్టిగా పిండేసి, గోధుమపిండిలో కలపాలి.

* రెండు గ్లాసుల గోధుమపిండికి, ఒకటిన్నర గ్లాసుల ముల్లంగి తురుము వేసి చపాతీ పిండి కలుపుకోవాలి. ఇలా..





* కలుపుకున్న పిండిని వీలయినంత త్వరగా వత్తేసుకోవాలి. ఎక్కువ సేపు ఉంచితే ముల్లంగిలో ఉన్న తేమ వల్ల పిండి బాగా మెత్తగా అయిపోతుంది.

* వీలయినంత సన్నగా చపాతీ వత్తుకుని, పెనం మీద చపాతీ చూట్టు పావు చెంచా నూనె వేసి మీద చపాతీ కాల్చుకోవాలి.

* రుచికరమైన ముల్లంగి చపాతీలు ఏదైనా ఆకుకూరపప్పుతో కానీ, ఏదైనా కూరతో కానీ తినవచ్చు.




Labels: rotis 7 comments
Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    'Krishnavataram Part 1: The Heart
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    11 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.