skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."
Showing posts with label experiments. Show all posts
Showing posts with label experiments. Show all posts

జొన్న మొలకల ఉప్మా (Upma with Sprouted jowar)

8:49 AM | Publish by తృష్ణ



నిన్న రాత్రి మొదటిసారి చేసిన ఈ ప్రయోగానికి ఏం పేరు పేట్టాలో అని ఆలోచిస్తే.. 'జొన్న మొలకల ఉప్మా' అనచ్చేమో అనిపించింది.
జొన్నలని(Jowar) ఒకపూటంతా(6,7hrs) నానబెట్టి, నీళ్ళు తీసేసి, రాత్రికి పల్చటి కాటన్ బట్టలో మూట కట్టచ్చు.. లేదా బాగా డ్రైగా చేసేసి ఏదైనా గిన్నె/బాక్స్ లో వేసి మూత పెడితే పొద్దుటికి మొలకలు వచ్చేస్తాయి. పెసలైనా, బొబ్బర్లైనా మొలకెత్తించడానికి ఇదే పధ్ధతి. ఒకవేళ రాత్రికి నానబెడితే పొద్దున్నే డ్రైగా మూట కట్టేస్తే సాయంత్రానికి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. మరనాటిదాకా ఉంచితే ఇంకా ఎక్కువ మొలకలు వస్తాయి.

ఇదివరకూ సజ్జలు(Bajra), రాగులు(ragi) మొలకెత్తించి వాడాను కానీ జొన్నలు ఇదే మొలకెత్తించడం. ఏదో ఒక టిఫిన్ + రాగి మజ్జిగ నా రాత్రి భోజనం మెనూ. ఇడ్లీ, దోశలాంటి రొటీన్ టిఫిన్స్ వరుస అయిపోయాకా, రకరకాల కొత్త టిఫిన్ ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను. జొన్నలతో సరదాగా కొత్త రకం ఏదైనా చెద్దామని మనసై మొన్న రాత్రి జొన్నలు నానబెట్టాను. నిన్న పొద్దున్నే నీళ్ళు తీసేసి ఓ గిన్నెలో వేసి మూతపెట్టాను. రాత్రికి మొలకలు వచ్చాయి. 


జొన్న మొలకల ఉప్మా తయారీ:
* ముందర జొన్నలు కుక్కర్లో ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. (జొన్నన్నం ఇలానే వండుతారేమో!) వీటితో సంతోషకరమైనదేమిటంటే ఎక్కువ విజిల్స్ వచ్చినా పేస్ట్ అవ్వవు ఇవి :) సుమారు 100gms జొన్నలకి  300ml నీళ్ళు + తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. కుక్కర్ ఓపెన్ చేసాకా జొన్నలతో పాటూ మిగిలి ఉన్న నీళ్ళు పారబొయ్యకుండా ఉంచాలి.

* ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తరిగి, ఉప్మా కి లానే మినపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర, మిర్చి, కర్వేపాకు పోపు వేయించి, అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. 

*ఎదురుగా అప్పుడే మార్కెట్ నుండి తెచ్చిన fresh green peas కనిపిస్తే అవి ఓ నాలుగు వలిచి ఉల్లిపాయ ముక్కల్లో పడేసా. ఓ కేరెట్ కూడా తరిగి వేసా.(కేరెట్ గ్రేట్ చేసేసుకోవచ్చు.వేయించకపోయినా పర్వాలేదు)

* ఇప్పుడూ ఉడికిన జొన్న మొలకలను ఈ ఉల్లిపాయముక్కల పోపులో పడేయాలి, నీళ్ళతో సహా. ఉప్పు చెక్ చేసి కావాలిస్తే కలిపి, చిటికెడు పసుపు వెయ్యాలి. కాసేపటికి నీళ్ళు ఇగిరిపోతాయి. 

* ఉప్మా దగ్గర పడ్డాకా దింపేసుకుని నాలుగు కొత్తిమీర ఆకులు అలంకరించి, ఒక అరచెక్క నిమ్మరసం పిండేసి తినేయడమే..!


ఈ రెసిపీ కాస్త పళ్ళకి పెద్ద పనే కానీ టేస్టీగా ఉంది.
ఇవాళ పొద్దున్నకి నేను బానే ఉన్నా కాబట్టీ.. కొత్తరకాలు ఇష్టపడేవారు ట్రై చేయచ్చు..:)

టిప్:
ఉప్మాలోకి ఉల్లిపాయలతో పాటూ టమాటా ముక్కలు వాడితే నిమ్మరసం అక్కర్లేదేమో! నే టమాటా వాడలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా.

Labels: experiments, pulses, tiffins 2 comments

చాక్లేట్ కేక్ without oven

8:45 PM | Publish by తృష్ణ



మా బుజ్జెమ్మ కోరికపై మొదటిసారి చాక్లేట్ కేక్ చేసాను.. ఇప్పుడే అయ్యింది. వేడివేడిగా తింటే బాగుంది..:)

ఓవెన్ లేకుండా చేసిన ప్రయోగం. ఎక్స్పరిమెంట్ చేసా కాబట్టి డేకరేట్ చెయ్యడానికి చెర్రీస్, క్రీం చెయ్యడానికి ఫ్రెష్ బటర్ రెడీగా లేవు. సో, ఈసారి మళ్ళీ చేసి డెకరేషన్ తో పాటూ రెసిపీ చెప్తాను :-)
 

Labels: experiments 1 comments

క్రీమీ పాస్తా (Creamy Pasta in White Sauce)

5:21 PM | Publish by తృష్ణ

Pasta in white Sauce without adding cream

ఓసారి ఓ బఫే లంచ్ కి వెళ్లినప్పుడు అక్కడ 'లైవ్ పాస్తా కౌంటర్' లో 'ఫుల్ క్రీమ్ పాస్తా' టేస్ట్ చూసినప్పటినుండీ అది చెయ్యమని మా అమ్మాయి పేచీ! మ్యాగీ వాళ్ళదో ఎవరిదో రెడీమేడ్ క్రీమీ పాస్తా(టూ మినిట్స్ మ్యాగీ లాంటిది) కొన్నాం కానీ అది బాలేదుట. హోటల్లో చేసినట్లే కావాలని గొడవ. సరే మరి తప్పుతుందా? పాస్తా కొనుక్కొచ్చా. ఆ పాస్తా రకాల్లో నాకన్నింటి కన్నా ఇలాంటివే నచ్చుతాయి.




రెసిపీ గూగులించి మొత్తానికి తయారు చేసా! అమ్మాయికీ, వాళ్ల నాన్నకీ బాగా నచ్చింది. మరి నాలా ఇప్పటిదాకా చెయ్యనివాళ్లెవరైనా ఉంటే ఇలా చేసేసుకోండి..

తయారీ:

* ముందుగా పాస్తా ని బోలెడు నీళ్ళలో.. అంటే ఒక కప్పు పాస్తా అయితే నాలుగు కప్పుల నీళ్లలో ఓ చెంచా ఉప్పు వేసి మరిగించాలి. పాస్తా ఉడికాకా చల్లటి నీళ్లతో వడబోసేసి ఒక చెంచా నునె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే ముద్దయిపోకుండా పొడిపొడిగా ఉంటుంది పాస్తా.(నూడుల్స్ లాగానే)



* తర్వాత ఓ కేరెట్, కాస్తంత స్వీట్ కార్న్ గింజల్ని కాస్త ఉప్పు వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. (కేప్సికమ్, కేబేజ్ సన్నగా తురుముకుని అవి కూడా ఉడికించవచ్చు) ముక్కలు మరీ మెత్తగా ఉడకనఖ్ఖర్లేదు. 
* తర్వాత ఓ చెంచా బటర్ లో ఈ కూరముక్కలు 2mins వేయించి పావు చెంచా మిరియాల పొడి వేసి పక్కన పెట్టాలి.


 వైట్ సాస్ తయారీ:


* రెండు చెంచాల కార్న్ ఫ్లోర్, రెండు చెంచాల బటర్ లో( సాల్టెడ్ బటర్ కాకుండా ఫ్రెష్ బటర్ నెయ్యి అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. అదైతే మంచిది. నేను ఇంట్లో చేసిన వెన్న వాడాను.) నల్లబడకుండా రెండు నిమిషాలు వేయించాలి. 

* తర్వాత ఒక కప్పుడు పాలు(150gms) అందులో పోసి ఉండలు లేకుండా కలుపుతూ సాస్ చిక్కబడనివ్వాలి. మరీ ముద్దగా ఉంటే కాసిని నీళ్లు కలుపుకోవచ్చు. స్టౌ ఆపే ముందర అర చెంచా సాల్ట్, చిటికెడు పెప్పర్ వేసి బాగా కలపాలి.

* ఈ వైట్ సాస్ మిశ్రమాన్ని చల్లారాకా ఓమాటు వడబోసుకుంటే వైట్ సాస్ క్లియర్ గా ఉంటుంది ఉండలు లేకుండా. 
(ఇలా తయారైన సాస్ ను ఫ్రిజ్ లో పెట్టుకుని ఓ వారం లోపూ మరేదైనా కూరలోకి వాడుకోవచ్చు.)



*ఇప్పుడు ఉడికించి ఉంచిన పాస్తా, ఈ వైట్ సాస్, కూరముక్కలు అన్నీ కలిపి ఫ్రైయింగ్ పేన్ లో వేసి, అరచెంచా ఆరిగానో(Oregano) వేసి, ఓ రెండుమూడు నిమిషాలు బాగా కలిపి స్టౌ ఆపేయాలి. ఉప్పు తక్కువ ఉంటే కలుపుకోవాలి.
Oregano పుదీనా జాతికి చెందిన హెర్బ్. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇదివరకు పీజ్జా చేసేప్పుడు కొనేదాన్ని నేను. ఆరిగానో లేకపోయినా పర్వాలేదు నాలుగు కొత్తిమీరఆకులు కాస్త సన్నగా తరిగి వేసేస్తే సరిపోతుంది :)


* తయారైన పాస్తాలో ఒక అర కప్పు అముల్ క్రీమ్ కలిపి సర్వ్ చేయండి. Heaven! అంతే!




Labels: experiments, snacks n sweets 2 comments

ఉల్లిపాయ, బచ్చలి పకోడీస్ with జొన్నపిండి(jowar)

6:03 PM | Publish by తృష్ణ



వర్షాలు ఎక్కువైయ్యాయి కదా.. ఇక మరి వేడివేడిగా బజ్జీలూ, పకోడీలూ, జంతికలు, చెక్కలు, పుణుకులు మొదలైనవి తినాలనిపింస్తుంది అందరికీ. కానీ శెనగపిండి మంచిది కాదు వాడద్దు అని ఆరోగ్యసూత్రం! ఎందుకు అంటే అరుగుదల తక్కువ, గ్యాస్ ప్రోబ్లం ఉన్నవాళ్ళకి, డయాబెటిక్ పేషంట్స్ కీ కూడా మంచిది కాదు అంటారు. సో, శెనగపిండి వాడకుండా వర్షాకాలపు సాయంత్రాలు స్నాక్స్ కి ఏ పిండి వాడచ్చు, ఏం చేయచ్చు అని ఎక్స్పరిమెంట్లు చేస్తున్నా నేను. అందులో ఒకటి జొన్నపిండితో పకోడి.

ముందర ఉల్లిపాయ పకోడికి కావాల్సినవి చూద్దాం:
* ఒక కప్పు జొన్నపిండి
* అర కప్పు బియ్యప్పిండి
* గుప్పెడు పుట్నాలపప్పు
* ఒక ఇంచ్ అల్లం, రెండు పచ్చిమిరపకాయలు
* ఓ చెంచా వాము 
* ఓ గుప్పెడు పల్లీలు(అక్కర్లేకపోతే మానేయచ్చు కూడా)
* తగినంత ఉప్పు
* రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
* వేయించటానికి తగినంత నూనె

తయారీ:
* పుట్నాలపప్పు, అల్లం, పచ్చి మిర్చి కలిపి గ్రైండ్ చెయ్యాలి. పొడిగానే వస్తుంది.
* అలానే పల్లీలు కూడా ఒక్కసారి (ఓ అరనిమిషం) పొడిగా మిక్సిలో తిప్పి తీసేయాలి. పలుకులుగా అన్నమాట.
* ఒక బేసెన్ లో జొన్నపిండి,బియ్యపిండి, గ్రైండ్ చేసిన పుట్నాల పిండి, వాము, పల్లూ పలుకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి  ఏదన్నా స్పూన్ తో బాగా కలపాలి.



* పిండిలన్నీ బాగా కలిసాకా, అప్పుడు కాసిని నీళ్ళు చిలకరిస్తూ ముద్దగా మళ్ళీ కలపాలి.



* ఇలా కలిపిన పిండిని కాస్త కాస్తగా కాగిన నూనెలో వేయించటమే. 
జొన్నపిండితో ఉల్లి పకోడీలు రెడీ అయిపోతాయి :)



బచ్చలాకుతో పకోడి:

బచ్చలాకుతో బజ్జీ చేస్తారు కదా; తోటకూర, పుదీనా పకోడీలకి వేసినప్పుడు బచ్చలాకు పకోడి ఎందుకు చేయకూడదు అని ఐడియా వచ్చి ట్రై చేసా. బానే ఉన్నాయి తినటానికి. ఈ ఉల్లిపాయలు కలిపిన జొన్నపిండిలోనే బచ్చలాకు తరిగి వేసేసా. కాబట్టి ఇందులో ఉల్లిపాయ వేసినా బాగుంటుందన్నమాట. 




ఈ పిండితో వేసినవి నచ్చుతాయో లేదో అనుకున్నా, బాగున్నాయని ఇంట్లోవాళ్ళు కూడా తినేసారు :) తేడా తెలియకపోతే మంచిదే కదా!

Labels: experiments, snacks n sweets 3 comments

dry fruits లడ్డూ

11:48 AM | Publish by తృష్ణ



డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్, వెయిట్ ప్రాబ్లంస్ రీత్యా మంచిది కాదు కానీ మనకు దొరికే ఐదారు రకాల డ్రైఫ్రూట్స్(బాదం, పిస్తా, అంజీర్, జీడిపప్పు, కిస్మిస్, ఆక్రోడ్)  రోజుకి తలొకటి తింటే ఆరోగ్యానికి, ముఖ్యంగా ఎదిగే పిల్లలకీ, ప్రెగ్నెంట్ లేడీస్ కీ ఎంతో మంచిది. ఇవన్నీ డ్రై ఫ్రూట్ లడ్డులో కలుస్తాయి కాబట్టి రోజుకి ఒకటి తినచ్చు. అదీ ఖజ్జూరాలతో చేసినదయితే ఇంకా మంచిది. ఖజ్జూరాలతో అయితే పూర్తిగా నేచురల్ షుగర్స్ ఉపయోగించినట్లే.


 డ్రై ఫ్రూట్స్ తో చేసిన లడ్డూ రెండు రకాలుగా చేస్తారు.  బెల్లం పాకంతో లేదా ఖజ్జూరాలతో.  పిల్లలైనా, పెద్దలైనా రోజుకి ఒకటి తింటే మంచి పోషకాలు అందుతాయి. బలకరం. బయట కొనేకంటే ఇంట్లోనే తయారుచేస్కుంటే ఎలా ఉంటుంది? అని ఐడియా వచ్చింది మాకు. వెంఠనే ప్రయత్నాలు మొదలెట్టి ఆఖరికి సక్సెస్ఫుల్ గా పూర్తి చేసాను. తయారీకి ఓ అరగంట సమయం పడుతుంది. 


కావాల్సినవి:

1) 1/2 kg ఖజ్జూరాలు( lion dates అయితే బెటర్) 
(తీపి తక్కువ ఉండాలి అంటే 300,350gms వాడినా చాలు.నేను తక్కువే వాడాను)
2) 100 gm పిస్తా
3) 100 gm జీడిపప్పు
4) 100 gm అంజీర్
5) 100 gm బాదాం
6) 50 gm కిస్మిస్
7) 50 gm ఆక్రోడ్
8)1 చెంచా ఏలకుల పౌడర్
 9)1 చెంచా గసగసాలు
10) edible gum(నార్త్ ఇండియన్స్ gaund అంటారు) ఒక చెంచాడు.
11)రెండు చెంచాల నెయ్యి
12) 1/2 చెంచా జాజికాయ (nutmeg) పౌడర్ - optional
      (జాజికాయ ఇంట్లో ఉంటే ఓ అరచెంచా పౌడర్ కొట్టుకోవడమే)
13) 100 gm ఎండు కొబ్బరి పొడి - optional


edible gum(gaund) ఇలా ఉంటుంది. సూపర్ మార్కెట్లలో, కిరాణా షాప్స్ లో దొరుకుతుంది. 


దీనిని కొంచెం నెయ్యిలో(పావు చెంచా) వేయిస్తే పాప్కార్న్ లాగ పెద్దవవుతాయి. మాడకుండా కలుపుతూ వేగగానే స్టౌ ఆపేసి, చల్లారాకా పొడి చేసి ఉంచాలి దీనిని. లడ్డూలు చుట్టడానికి ఇది బైండింగ్ ఏజెంట్ అన్నమాట.


ముందస్తు తయారీ:

1) ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ విడి విడిగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. పొడి అవ్వకుండా, పలుకులు కనబడేలా ఒకటి రెండు సార్లు తిప్పితే చాలు. అంజీర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తిప్పాలి. అంజీర్ తో పాటే కిస్మిస్ వేసేయచ్చు.
2) జాజికాయ, ఏలకులు విడివిడిగా పౌడర్ కొట్టి ఉంచుకోవాలి.
3) గసగసాలు కావాలంటే పొడి చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా వాడుకోవచ్చు.
4) edible gum పైన చెప్పినట్లు వేయించి, పొడి చేసుకోవాలి.
5) ఖజ్జూరాలు గింజ తీసేసి కాస్త గోరువెచ్చని నీటిలో కడిగేసి గ్రైండ్ చేసి ఉంచాలి. ఇది కూడా ఓమాటు తిప్పితే సరిపోతుంది. మరీ ముద్దగా అక్కర్లేదు.

తయారీ:

1) కాస్త పెద్ద మూకుడులో రెండు చెంచాల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ వేయించాలి.
2) అప్పుడు జాజికాయ పొడి, ఏలకుపొడి, గసగసాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుతూ వేయించాలి.
3) తర్వాత ఖజ్జూరాల ముద్ద వేసి అడుగంటకుండా మరో మూడు నిమిషాలు కలపాలి.
4) స్టౌ ఆపేసిన వెంఠనే edible gum పొడి వేసి మరోసారి అంతా మిక్స్ చెయ్యాలి.
5) మొత్తం మిశ్రమం కాస్త చల్లరాకా చేత్తో ఉండలు చుట్టుకోవటమే. మధ్యలో వేడి తగ్గి ఉండ రావట్లేదనిపిస్తే ఓసారి పొయ్యి మీద డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేడి చేసుకుంటే ఉండ అవుతుంది. ఆరాకా లడ్డూలు గట్టిపడిపోతాయి.
6) రుచికరమైన డ్రైఫ్రూట్స్ లడ్డూలు తినటానికి రెడీ!




Labels: experiments, snacks n sweets 2 comments

Pan Cake

7:44 PM | Publish by తృష్ణ





ఈ బ్లాగ్ లో పెట్టే ఏ రెసిపి అయినా, ప్రయోగం అయినా నేను వండి రుచి చూసిన తర్వాతే టపాలో రాస్తూంటాను. ఇవాళ బ్లాగ్మిత్రులు జయ గారి కోసం "Pan Cake" రెసిపీ వెతికి నేను మొదటిసారి ప్రయోగం చేసాను. మా పాపకూ నచ్చింది. 

కావాల్సిన పదార్థాలు:

* ఒక కప్పు మైదా
* ఒక egg
* చిటికెడు ఉప్పు
* అర స్పూన్ బేకింగ్ పౌడర్
* చిటికెడు వంట సోడా
* రెండు చెంచాల పంచదార
* అర కప్పు పాలు
* ఒక చెంచా వెన్న 
*కాస్తంత తేనె

తయారీ:
* పొడులన్ని కలిపి ఈ గిన్నెలోకి జల్లించాలి. అప్పుడు అన్నీ బాగా కలుస్తాయన్నమాట.

* అందులో ఒక egg, అరకప్పు పాలు వేసి అన్నీ కలిపి బాగా గిలకొట్టాలి. ఇలా:




* పెనం వేడెక్కాకా వెన్న(బటర్) రాసి అందిపై గరిటెతో పిండి వెయ్యాలి. పెనంపై వేసాకా ఇక పిండి కదపకూడదు.




* వేగాకా రెండో వైపుకి తిప్పాలి.

* కప్పుడు పిండికి మూడు నాలుగు పేన్ కేక్స్ అవుతాయి.

* అవన్నీ తేనె రాసుకుని విడివిడిగా తినచ్చు లేదా ఒకో ఫేన్ కేక్ కీ తేనె రాసుకుంటూ ఒకదానిపై ఒకటి పెట్టి అన్నీ కలిపి కట్ చేసుకుని తినచ్చు. ఇలా..



Labels: experiments, snacks n sweets 9 comments

పనసపొట్టు ఆవకాయ

2:42 PM | Publish by తృష్ణ



ఇవాళ ఇంట్లో అక్షయమైపోయిన పనస పొట్టు గురించి ఇక్కడ రాసాను కదా.. కాస్త మా మరిది వాళ్ళింటికి పంపించాను.. మిగిలినది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మా వదినవాళ్ల అమ్మాగారు అప్పుడెప్పుడో ఇచ్చిన "పనసపొట్టు ఆవకాయ" గుర్తుకొచ్చింది. వెంఠనే ప్రయోగమ్ మొదలుపెట్టేసాను.. బాగా కుదిరింది.

ఎలా చెయ్యాలంటే:

* ఒక కప్పు పనసపొట్టు (పచ్చిదే)
* ఆవ పొడి, ఉప్పు, కారం సమపాళ్ళలో 1/2 కప్పు
* అర కప్పు నూనె
* పది వెల్లుల్లి రేకలు
* పులిహోర పోపు 
* ఒక పెద్ద నిమ్మకాయ రసం







తయారీ:

* పచ్చిఆవ పొడి, కారం, ఉప్పు సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి పనసపొట్టులో కలపాలి.

* కాస్త నూనెలో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పసుపు,కర్వేపాకు,వేరుసనగపప్పు, ఇంగువ కలిపి పులిహోరకి పెట్టుకున్నట్లు పోపు పెట్టుకోవాలి.

* అది తెచ్చి పనసపొట్టు,కారం మిశ్రమంలో కలపాలి.

* ఓ పది వెల్లుల్లిపాయలు కాస్తంత చిట్లేలా దంచి తొక్క వలిచి ఆవకాయలో వెయ్యాలి.

* తర్వాత నూనె వేసి అంతా బాగా కలపాలి.

* చివరిగా నిమ్మరసం వేసి మరోసారి బాగా కలిపి సీసాలో దాచటమే.

* ఈ పనసపొట్టుఆవకాయ ఎక్కువ నిలవ ఉండదు. కాస్త కాస్త చేసుకోవాలి. ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం, పదిరోజులు పాడవ్వకుండా ఉంటుంది.

ఒక సలహా: ఆవపొడి, ఉప్పు, కారం, పనసపొట్టు అన్నీ బాగా పొడిగానే కలిపి ఒక సీసాలో వేసి ఫ్రిజ్ లో దాచుకోవచ్చు. కావాల్సినప్పుడు తీసి నూనె వేసి, పులిహోర పోపు,నిమ్మరసం పిండుకుని తినచ్చు.ఇలా నూనే,నిమ్మరసమ్ కలపని పొడిగా ఉన్న పొడి అయితే ఒక నెల రోజులు ఉంటుంది ఫ్రిజ్ లో.






Labels: experiments, ఊరగాయలు-రకాలు 7 comments

Oil-free అప్పడాలు

6:30 PM | Publish by తృష్ణ



అప్పడాలు లేకుండా అన్నం తినరు మా ఇంట్లోవాళ్ళు ! రోజూ డీప్ ఫ్రైడ్ పాపడ్ అంటే నాకు చెయ్యటం ఇష్టం లేదు. మా చిన్నప్పుడు అమ్మ స్టౌ మీదే కాల్చేది అప్పడాలు. కానీ అలా చేస్తే నాకు సగం అప్పాడాలు మాడిపోయాయి. మైక్రోవేవ్ లో చక్కగా బాగా వస్తాయి. కానీ ఒక్క అప్పడాల కోసం మైక్రోవేవ్ కొనటం ఎందుకు? అనిపించి ఎలా ఎలా అని ఆలోచిస్తే.. ఈ ఐడియా వచ్చింది.. ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇక్కడ రాస్తున్నాను.. 






ఫోటో లోది పుల్కాలు చేస్కుందుకు కొన్న చట్రం. దాని మీద అప్పడాలు పెట్టాలని ఐడియా వచ్చింది. మాడకుండా బాగా వచ్చాయి అప్పడాలు. దానికి హేండిల్ ఉంటుంది కాబట్టి వేడిని బట్టి పైకి కిందకీ హేండిల్ పట్టుకుని తిప్పచ్చు. 

ఇప్పుడింక ఆయిల్ ఫ్రీ అప్పడాలు చక్కగా రోజూ కాలుస్తున్నా..:)



Labels: experiments 0 comments

పచ్చి బొప్పాయి(raw papaya) కూర

7:56 PM | Publish by తృష్ణ






ఇదివరకు ఓసారి ఈ కూర తృష్ణ లో రాసాను. ఒక్క కొబ్బరి మాత్రమే వేసి చేసాను అప్పుడు. ఇవాళ ఇదే కూరలో కొబ్బరిలో అల్లం, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసి వండాను. బాగా వచ్చింది.




తయారీ:


* పచ్చి బొప్పాసి కాయ మధ్యలో గింజలు తీసేసి తురుముకోవాలి.


* చిన్న అల్లం ముక్క, నాలుగు పచ్చిమిర్చి,కొబ్బరి ముక్కలు కలిపి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 


* కుక్కర్లో అయితే కొద్దిగా (అంటే తురుము క్వాంటిటిలో సగం నీళ్ళు) పోసి ఒక్క కూత రాగానే ఆపేసుకుని తడంతా పోయేలా వడబోసేసుకోవాలి. తక్కువ నీళ్ళు పోస్తాం కాబట్టి వడబోసినప్పుడు కాస్తంత మాత్రమే నీళ్ళు పోతాయి.





* శనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర, కర్వేపాకు,ఒక ఎండు మిర్చి పోపు పెట్టుకుని, అందులో గ్రైడ్ చేసుకున్న కొబ్బరికోరు వేసి కాస్త వేగాకా ఉడికించి ఉంచుకున్న బొప్పాయి తురుము వేసి బాగా కలపాలి.


* ఈ కూర అన్నంలో కన్నా చెపాతీల్లోకి బాగుంటుంది.

Labels: experiments, కూరలు 0 comments

One salad - Two dressings !!

1:05 PM | Publish by తృష్ణ


mixed sprouts
dressing one :(ఈ ప్రయోగం నిన్న రాత్రి చేసాను)


white pepper
Eggless mayonnaise(ఇది Egg ఉన్న mayonnaise కన్నా బెటర్ అని నా అభిప్రాయం. ఏదైనా mayonnaise ఎక్కువ తినకూడదంటారు. once in a while పర్లేదన్నమాట...:))

a pinch mustard powder
salt (as per the taste)
red chilli powder (1/2 sp)
తరిగిన కొత్తిమీర
తురిమిన కేరెట్


dressing 2: (ఈ ప్రయోగం ఇవాళ పొద్దున్న చేసాను)


tomato sauce ఒక పెద్ద sp
soya sauce ఒక పెద్ద sp
salt (as per the taste)
red chilli powder (1/2 sp)
తరిగిన కొత్తిమీర
తురిమిన కేరెట్




రెండింటిలో కలిపిన mixed sprouts మరియు ఇతర పదార్ధాలు :


మొలకలొచ్చిన పెసలు, మొంతులు(పెద్దగా చేదు ఉండవు), ఉలవలు, బొబ్బర్లు, నల్ల శనగలు, తెల్ల శనగలు, బఠాణీలు, మొన్న కొన్న అల్ఫాల్ఫా మొలకలు + కేప్సికం, కొద్దిగా స్వీట్ కార్న్ గింజలు.

ఇవన్నీ కూడా కుక్కర్లో ఉప్పు వేసి కొంచెం ఉడికించాలి. అంటే ఒక విజిల్ వచ్చాకా ఆపేయాలి. బాగా ముద్దగా ఉడకనివ్వకూడదు. ఉడకబెట్టకుండా కూడా తినచ్చు. నాలా గడ్డి గాదం తినేవాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ పాపం శ్రీవారిలా పచ్చివి తినటానికి కష్టపడేవాళ్ళకి కొద్దిగా ఉడకబెట్టి చేస్తే ప్రసన్నంగా తినగలరన్నమాట.



ఇక డ్రెస్సింగ్ ఐటేమ్స్ అన్నీ కలిపేసుకుని దాన్లో ఈ ఉడకబెట్టిన మొలకలన్నీ కలిపేసుకోవాలన్నమాట. సలాడ్ రెడీ ! నిన్న రాత్రి ఇవాళ పొద్దున్న రెండు రకాలు తినాకా మేం ok కాబట్టి మీరూ ప్రయత్నించవచ్చు...:)




Labels: experiments, salads 4 comments
Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    'Krishnavataram Part 1: The Heart
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    11 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.