skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."
Showing posts with label salads. Show all posts
Showing posts with label salads. Show all posts

సలాడ్ ప్రసాదం :-)

9:00 AM | Publish by తృష్ణ



శ్రీరామనవమికి అమ్మ చేసే ఈ వడపప్పు మాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇది మామూలుగా కూడా సాయంత్రాలు సలాడ్ లాగ చేసుకుని తినచ్చు..
ఎలాగంటే..
* అరకప్పు మామిడి కోరు
* ముప్పావు కప్పు కొబ్బరి కోరు
* కప్పు నానబెట్టిన పెసరపప్పు
* తగినంత ఉప్పు, కారం లేదా చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు
* అరచెంచా నూనెలో అరచెంచా ఆవాలు, చిటికెడు ఇంగువ ఇంగువ వేసిన పోపు.

పైన చెప్పినవన్నీ ఒక గిన్నెలో బాగా కలిపి రాముడికి పానకంతో పాటూ నైవేద్యం పెట్టాకా మనం ఆరగించడమే :-)

Labels: salads 0 comments

స్పెషల్ వడపప్పు !

10:11 AM | Publish by తృష్ణ




వడపప్పు రెసిపీ ఏమిటి అనుకుంటున్నారా? ఇది అమ్మ మా చిన్నప్పటి నుండీ శ్రీరామనవమి కి చేసే స్పెషల్ వడపప్పు. పానకం, ఈ వడపప్పు పెద్ద గిన్నెతో చెస్తే అటొచ్చి ఇటొచ్చీ తినేసి సాయంత్రం అవ్వకుండానే నేనూ ,తమ్ముడూ రెండు గిన్నెలూ ఖాళీ చేసేసేవాళ్లం. అందులోనూ మా ఇంట్లో బెల్లం ఉండేది కాదు పంచదార పానకమే :) ఇంతకీ ఈ వడపప్పులో స్పెషల్ ఏంటంటే 'మామిడికోరు'! 

ఎలా చెయ్యాలంటే..

ఒక టీ గ్లాస్ నానబెట్టిన పెసరపప్పు
ఒక చెక్క కొబ్బరికోరు
చిన్న మామిడికాయ కోరు(మామిడికాయ పుల్లటిదైతే  కొబ్బరికోరులో సగం ఉండేలా చూసుకోవాలి 
సన్నగా తరిగిన ఒక పచ్చి మిరపకాయ
అరచెంచా ఆవాలు, చిటికెడు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి.
చిన్న చెంచాడు ఉప్పు


* నానిన పెసరపప్పు తడి లేకుండా వాడేసి ఒక గిన్నెలోకి తీసుకుని, పైన చెప్పినవన్నీ వేసి బాగా కలపాలి.
* పచ్చి మిరపకాయ ఇష్టం లేకపోతే కాస్త కారం వేసుకోవచ్చు.


చెప్పాలంటే, ఇదో మంచి సలాడ్. కొబ్బరి, మామిడి రెండిటిదీ భీభత్సమైన కాంబినేషన్ కదా..అందులోనూ కూరల్లో వేసేకన్నా raw కొబ్బరి తింటేనే మంచిది అంటారు కూడా. శ్రీరామనవమి కే కాక మామూలుగా కూడా ఈవినింగ్స్ స్నాక్ లాగ పచ్చి మామిడికాయలు దొరికినంత కాలం ఇది చేసుకుని తినచ్చు. కానీ ఇలా తినేప్పుడు పెసరపప్పు కాస్త తక్కువ వేసుకుంటే ఏమీ చెయ్యకుండా ఉంటుంది.


Labels: salads 2 comments

మావిడల్లం, కేరెట్, క్యాబేజీ సలాడ్

6:10 PM | Publish by తృష్ణ






మావిడల్లంతో మరొక సింపుల్ సలాడ్..

మొన్న చేసాను.. బాగా వచ్చింది.

* మావిడల్లం, కేరెట్, క్యాబేజీ మూడూ తురుముకోవాలి.

* కాస్త ఉప్పు, పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే కారం చల్లి, చిన్న నిమ్మకాయ రసం పిండుకోవాలి. పెద్ద నిమ్మకాయాయితే అరచెక్క రసం చాలు.

* మొత్తం బాగా కలపాలి.

* చపాతీల్లోకి చాలా బావుంది ఇది. కూర లేకపోయినా ఈ సలాడ్ తో తినేయచ్చు చపాతీలు.

Labels: salads 0 comments

మావిడల్లం పులిహోర

5:36 PM | Publish by తృష్ణ







చూడటానికి అల్లం లాగానే ఉండే "మావిడల్లం"(Mango-Ginger) పసుపు జాతికి చెందిన దుంప. చలికాలంలో ఎక్కువగా దొరికే మావిడల్లం మామూలు రోజుల్లోఎక్కువ దొరకదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో. బెజవాడలో కూడా మాకు బాగా దొరికేది మావిడల్లం. బీట్రూట్, కేరెట్,పచ్చి మిరపకాయ, ముక్కలతో పాటు మావిడల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగి నిమ్మరసం,ఉప్పు కలిపి సలాడ్ లాగ చేసేది అమ్మ. బీట్రూట్ లేకుండా కేరెట్ తో కూడా కలిపి చేయచ్చు.


with beetroot & carrot

with carrot





అలాకాక అల్లం పచ్చడి చేసుకున్నట్లు పచ్చడి కూడా చేయవచ్చు. అది మరోసారెప్పుడైనా చెప్తాను. ఈసారి మావిడల్లంతో పులిహోర చెప్తాను. ఎలా ఉంటుందో అని రెండు మూడు సార్లు ప్రయత్నించాను. బాగా వచ్చింది. చెయ్యటం కూడా సులువే.




ఎలాగంటే:

* మామూలు పులిహోర పోపు(ఆవాలు,శనగపప్పు,మినపప్పు,కాస్త జీలకర్ర, కర్వేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, అరచెంచా ఇంగువ, వేరుశనగపప్పు, పసుపు) వేయించేసి స్టౌ ఆపేయాలి. అప్పుడు తురిమిన మావిడల్లం కోరు ఆ పోపులో వేసి కలపాలి. ఆ వేడి సరిపోతుంది. మావిడల్లం కోరు మరీ పచ్చిది కాకుండా మరి వేగిపొకుండా ఉండాలన్నమాట.

* మావిడల్లం తురుము ఎంత అంటే.. ఒక గ్లాసు అంటే సుమారు 150gms బియ్యానికి 50gms మావిడల్లం తురుముకోవాలి.

* ఇప్పుడు ఉడికి చల్లారిన అన్నంలో పోపు, సరిపడా ఉప్పు, అవసరమైతే మరికాస్త పసుపు వేసి కలిపేసాకా నిమ్మరసం పిండాలి.

* అంటే చింతపండు పులిహోరలో మాములు అల్లం తురుము వేసినట్లుగా, నిమ్మకాయపులిహోరలో మావిడల్లం తురుము కలపాలన్నమాట :) 

* మరి చింతపండు పులిహోరలో  మావిడల్లం తురుము కలిపితేనో...? నేను ట్రై చెయ్యలేదు. మీరు చేసాకా బాగుంటే చెప్పండి..:-)



Labels: salads, పులిహోర 1 comments

మొలకెత్తిన పెసలతో సులువైన salad

5:03 PM | Publish by తృష్ణ







పెసలు ఒక రాత్రంతా నానబెట్టి పొద్దున్నే నీరు వాడ్చేసి, తడిలేకుండా చూసి పొడి గిన్నెలో కానీ పొడిగా ఉన్న స్టీల్ బాక్స్ లో కానీ వేసి మూత పెట్టేస్తే రాత్రికల్లా చక్కగా మొలకెత్తుతాయి. పల్చటి గుడ్డలో మూట కడితే ఇంకా బాగా వస్తాయి కానీ పొడి గిన్నెలో పెట్టడం సులువుగా ఉంటుంది. అప్పుడు మొలకపెసలని ఫ్రిజ్ లో పెట్టేస్తే రెండుమూడు రోజులు వాడుకోవచ్చు. వారమైనా పాడవవు కానీ తాజాగా ఉండాలి అనుకుంటే కొద్దిగా నానబెట్టుకోవాలి.





మొలకెత్తిన పెసలతో పెసరట్టు, పుణుకులు, రైస్, సూప్ మొదలైనవి చేసుకోవచ్చు. నేనైతే ఉప్మాలో, అట్టు మీద, కూరల్లో కూడా వేస్తుంటాను. క్రింద రాసిన సలాడ్ సులువుగా ఎవరైనా చేసుకుని తినచ్చు. ఇది తింటే చాలాసేపు ఆకలి వెయ్యకుండా కూడా ఉంటుంది. 


 కావల్సినవి:


*3/4 cup మొలకెత్తిన పెసలు(పచ్చివి)
*one medium cup మరమరాలు(puffed rice)
* 1/2 cup చిన్నగా తరిగిన కీరా ముక్కలు
* చిన్నగా తరిగిన ఉల్లిపాయ(medium size) ముక్కలు
*half lemon juice
*తగినంత ఉప్పు, కారం
* పైన చల్లటానికి తరిగిన కొత్తిమీర



తయారీ:

* పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక బౌల్ లో కలిపేసుకోవాలి.

* ఉప్పు,కారం వేసి కలిపాకా, నిమ్మరసం పిండుకుని, పైన కొత్తిమీర చల్లాలి.

* ఇందులో సన్నకారప్పూస కూడా చల్లుకుంటే ఇంకా బావుంటుంది.

* పైన చెప్పిన కొలతలు ఒక్కళ్ళు తినటానికి సరిపోతాయి :-)


Labels: salads 2 comments

Russian salad

7:54 PM | Publish by తృష్ణ






నాకు బాగా ఇష్టమైన, నేను తరచూ చేసే సలాడ్ ఇది. కాకపోతే రకరకాల హోటల్స్ లో రకరకాల పదార్ధాలతో చేస్తారు. అంటే కొందరు పొటాటో, కేప్సికం కూడా వేస్తారు. కొందరు అవి వెయ్యరు. నేను ఎలా చేస్తానంటే:



* పైనాపిల్ ముక్కలు, కేరెట్ , బఠాణీ, బీన్స్ ముక్కలు వాడతాను. బఠాణీ ఫ్రెష్ వి దొరకని సీజన్లో నానబెట్టి, విడిగా ఉడకబెట్టి కలుపుతాను. కూరముక్కల కన్నా ఎక్కువ టైమ్ తీశుకుంటాయి కదా ఉడకటానికి అందుకు.



* కేరెట్ , బీన్స్ రెండూ కొంచెం ఉడకబెట్టిన ముక్కలు. పూర్తిగా మెత్తగా అవ్వకుండా కాస్త మెత్తబడితే చాలు. (half-boiled అన్నమాట)



* ఈ ముక్కలు రెండు కప్పులు ఉన్నాయంటే డ్రెస్సింగ్ కోసం క్రింద పదార్ధాలన్నీ తీసుకుంటాను..

1) నాలుగు చెంచాలు మయోన్నీస్( నేను ఎగ్లెస్స్ వాడతాను. ఎగ్ ఉన్నదయినా వాడచ్చు)

2) చిటికెడు ఆవపొడి

3) అర చెంచా ఉప్పు

4) వైట్ పెప్పర్ లేక బ్లాక్ పెప్పర్ అర చెంచా

5) ఫ్రెష్ క్రీం నాలుగు చెంచాలు(ఇది వెయ్యకపోయిన పర్వాలేదు). ఫ్రెష్ క్రీం బజార్లో చిన్న చిన్న పేకెట్లలో దొరుకుతుంది.



* పైన రాసిన నాలుగు పదార్ధాలు బాగా కలిపేసి; పైనాపిల్, బఠాణీ, కూర ముక్కలు అందులో వేసి మళ్ళీ బాగా కలపాలి. 


* పైన ఫోటోలో సలాడ్లో నేను ఎక్కువ క్రీం వేయలేదు. weight problem లేనివారు క్రీం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు.


* కొందరు అర చెంచా పంచదార కూడా వేస్తారు కానీ మయోన్నీస్ లో కాస్త షుగర్ ఎలానూ ఉంటుందని నేను వెయ్యను.



* యమ్మీ యమ్మీ టేస్టి రష్యన్ సలాడ్ రెడీ. సర్వింగ్ బౌల్ చుట్టూరా పైన ఫోటోలోలాగ బత్తాయి లేక కమలా గానీ అలా గుండ్రని స్లైసెస్ చేసి పెట్టుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది. ఆ ముక్కలు కూడా సలాడ్ తో పాటూ తినొచ్చు.



Labels: salads 2 comments

One salad - Two dressings !!

1:05 PM | Publish by తృష్ణ


mixed sprouts
dressing one :(ఈ ప్రయోగం నిన్న రాత్రి చేసాను)


white pepper
Eggless mayonnaise(ఇది Egg ఉన్న mayonnaise కన్నా బెటర్ అని నా అభిప్రాయం. ఏదైనా mayonnaise ఎక్కువ తినకూడదంటారు. once in a while పర్లేదన్నమాట...:))

a pinch mustard powder
salt (as per the taste)
red chilli powder (1/2 sp)
తరిగిన కొత్తిమీర
తురిమిన కేరెట్


dressing 2: (ఈ ప్రయోగం ఇవాళ పొద్దున్న చేసాను)


tomato sauce ఒక పెద్ద sp
soya sauce ఒక పెద్ద sp
salt (as per the taste)
red chilli powder (1/2 sp)
తరిగిన కొత్తిమీర
తురిమిన కేరెట్




రెండింటిలో కలిపిన mixed sprouts మరియు ఇతర పదార్ధాలు :


మొలకలొచ్చిన పెసలు, మొంతులు(పెద్దగా చేదు ఉండవు), ఉలవలు, బొబ్బర్లు, నల్ల శనగలు, తెల్ల శనగలు, బఠాణీలు, మొన్న కొన్న అల్ఫాల్ఫా మొలకలు + కేప్సికం, కొద్దిగా స్వీట్ కార్న్ గింజలు.

ఇవన్నీ కూడా కుక్కర్లో ఉప్పు వేసి కొంచెం ఉడికించాలి. అంటే ఒక విజిల్ వచ్చాకా ఆపేయాలి. బాగా ముద్దగా ఉడకనివ్వకూడదు. ఉడకబెట్టకుండా కూడా తినచ్చు. నాలా గడ్డి గాదం తినేవాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ పాపం శ్రీవారిలా పచ్చివి తినటానికి కష్టపడేవాళ్ళకి కొద్దిగా ఉడకబెట్టి చేస్తే ప్రసన్నంగా తినగలరన్నమాట.



ఇక డ్రెస్సింగ్ ఐటేమ్స్ అన్నీ కలిపేసుకుని దాన్లో ఈ ఉడకబెట్టిన మొలకలన్నీ కలిపేసుకోవాలన్నమాట. సలాడ్ రెడీ ! నిన్న రాత్రి ఇవాళ పొద్దున్న రెండు రకాలు తినాకా మేం ok కాబట్టి మీరూ ప్రయత్నించవచ్చు...:)




Labels: experiments, salads 4 comments
Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    'Krishnavataram Part 1: The Heart
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    11 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.