కావాల్సినవి:
* మామూలు మొక్కజొన్నలు గింజలు వలిచినవి రెండు కప్పులు
* స్వీట్ కార్న్ గింజలు అరకప్పు (ఇవి ఎక్కువ వేస్తే మరీ తియ్యగా అయిపోతాయి వడలు)
* మూడు పచ్చిమిరపకాయలు
* అంగుళం అల్లం ముక్క
* కడిగిన పుదీనా ఆకులు ఒక కప్పుడు(ఒక చిన్న కట్ట అనుకోవచ్చు)
* తగినంత ఉప్పు
తయారీ:
* పైన చెప్పిన మొక్కజొన్న గింజలు, స్వీట్ కార్న్ గింజలు, మిర్చి, అల్లం, పుదీనా ఆకులు, ఉప్పు అన్ని కలిపి మెత్తగా గ్రైండ్ చెసుకోవాలి. మెత్తగా అవటానికి కాసిని నీళ్ళు పోయచ్చు. ( నీళ్ళు ఎక్కువయితే వడలు రావు, నూనె కూడా పీల్చేస్తాయి.)
*పుదీనా ఇష్టం లేకపోతే కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు.
* గ్రైండ్ చేసిన పిండి మరి జారుగా అయిపోతే కాస్త కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి) కలపితే పిండి గట్టిగా అవుతుంది.
* మూకుడులో నూనె కాగాకా వడల్లా చేత్తో వత్తుతూ వడలు వేయించటమే.
* వేయించాకా టిష్యూ పేపర్ మీద వేస్తే మంచిది.
* బయటనుండి వచ్చేవాళ్ళ కోసమైతే పిండి గ్రైండ్ చేసుకుని ఉంచి, అప్పటికప్పుడే వేసి పెట్టండి. ముందరే వడలు తయారయిపోతే మాత్రం ఎవరైనా వచ్చేలోపే చేసినవి ఖాళీ అయిపోతాయి.. too tempting మరి :-)