
ఆనపకాయతో పాలు పోసి వండే కూర, అల్లంపచ్చిమిర్చి, కొత్తిమీర కారం, నూపప్పు కారం, కూటు, పప్పుకూర, పెసరపప్పు పొడికూర, పంచదార వేసి తియ్యకూర మొదలైన ఎన్నో రకాల కూరలు వండుకోవచ్చు. అయినా సరే నీటి శాతం ఎక్కువ ఉండి రుచిలో చప్పదనం ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువమంది ఆనపకాయ కూరను ఒక పథ్యం కూరగానే పరిగణిస్తారు. ఆనపకాయ కూర కూడా ఓ కూరేనా? అనేవారు కూడా ఉన్నారు. పైన రాసినవి కాక ఆనపకాయతో చపాతీ లేదా పూరీల్లోకి తినేలాంటి రెండు రకాల కూరలు బొంబాయిలో ఉండగా మా పక్కింటి ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. అందులో ఒకటి ఈ టపాలో చెప్తున్నాను. చేస్కోవటమ్ చాలా తేలిక. ఎలాగంటే...