ఇవాళ ఇంట్లో అక్షయమైపోయిన పనస పొట్టు గురించి ఇక్కడ రాసాను కదా.. కాస్త మా మరిది వాళ్ళింటికి పంపించాను.. మిగిలినది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మా వదినవాళ్ల అమ్మాగారు అప్పుడెప్పుడో ఇచ్చిన "పనసపొట్టు ఆవకాయ" గుర్తుకొచ్చింది. వెంఠనే ప్రయోగమ్ మొదలుపెట్టేసాను.. బాగా కుదిరింది.
ఎలా చెయ్యాలంటే:
* ఒక కప్పు పనసపొట్టు (పచ్చిదే)
* ఆవ పొడి, ఉప్పు, కారం సమపాళ్ళలో 1/2 కప్పు
* అర కప్పు నూనె
* పది వెల్లుల్లి రేకలు
* పులిహోర పోపు
* ఒక పెద్ద నిమ్మకాయ రసం
తయారీ:
* పచ్చిఆవ పొడి, కారం, ఉప్పు సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి పనసపొట్టులో కలపాలి.
* కాస్త నూనెలో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పసుపు,కర్వేపాకు,వేరుసనగపప్పు, ఇంగువ కలిపి పులిహోరకి పెట్టుకున్నట్లు పోపు పెట్టుకోవాలి.
* అది తెచ్చి పనసపొట్టు,కారం మిశ్రమంలో కలపాలి.
* ఓ పది వెల్లుల్లిపాయలు కాస్తంత చిట్లేలా దంచి తొక్క వలిచి ఆవకాయలో వెయ్యాలి.
* తర్వాత నూనె వేసి అంతా బాగా కలపాలి.
* చివరిగా నిమ్మరసం వేసి మరోసారి బాగా కలిపి సీసాలో దాచటమే.
* ఈ పనసపొట్టుఆవకాయ ఎక్కువ నిలవ ఉండదు. కాస్త కాస్త చేసుకోవాలి. ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం, పదిరోజులు పాడవ్వకుండా ఉంటుంది.
అబ్బా!! చదువుతుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయండీ బాబు.. పైగా ఫోటో కూడా పెట్టారు :)
థాంక్స్ ఇంత మంచి వంటకం నేర్పినందుకు. కాని చిన్న సందేహం.. ఆవ పొడి అంటే ఏంటండీ?
@priya: ఆవకాయలో వేస్తాం కదా ఆవపొడి..అదేనండి. పచ్చి ఆవాలు పొడి చేసి అమ్ముతారు. ఇంట్లో కూడా ఆవాలపొడి(పోపులో వేయటానికి కొనే ఆవాలని) మెత్తగా గ్రైండ్ చేస్కోవచ్చు.
try this..u'll like the taste. Thanks for the visit.
Sure.. thank you very much for the clarification :)
బాగుంది . కొత్త ఆవకాయ పరిచయం చేసారు మాకు. ప్రియ గారు చెప్పినట్టు చదువుతుంటేనే నోరు ఊరిపోతోంది .థాంక్స్
@Sarada vibhavari: :-)
Thanks for the visit.
నిమ్మరసం బదులు నిమ్మ ఉప్పు వేస్తే నిలవ వుంటుందండీ మేం రెండు మూణ్ణెళ్ళు తింటాం .
మామిడి కాయ ముక్కలు ఇందులో వేసి పులుపు దిగాకా తీసేయొచ్చు .
@లలిత: చాలా ఉపయోగకరమైన సలహా చెప్పినందుకు ధన్యవాదాలు లలిత గారూ.