
"ఉప్మా" అంటే సులువుగా చేసి పడేసే టిఫిన్ అని చాలామందికి లోకువ. "అబ్బా ఉప్మా..నా.." అని మొహం చిట్లించుకునేదాన్ని చిన్నప్పుడు అమ్మ పెడితే. వంటగది ఆధీనంలోకొచ్చాకా అన్నింటికన్నా త్వరగా చేసేయచ్చని "ఉప్మా చేసేయనా.." అని నేనే అడుగుతానిప్పుడు :) అందులోనూ ఇన్ని రకాలు చెసుకోవచ్చని తెలిసాకా!
ముందు సరదాగా కొన్ని ఉప్మా ఫోటోలు..
బొంబాయిరవ్వ ఉప్మా
నేను మామూలు బొంబాయిరవ్వ ఉప్మా కన్నా గోధుమరవ్వ ఉప్మా ఎక్కువ చేస్తాను. పోపు వేసేసి, రవ్వ, కాసిని కూరముక్కలు పడేసి,ఉప్పు, నీళ్ళు పోసేసి చిన్నకుక్కర్ మూతపెట్టేస్తే చాలు. ఐదు నిమిషాల్లో...