"ఉప్మా" అంటే సులువుగా చేసి పడేసే టిఫిన్ అని చాలామందికి లోకువ. "అబ్బా ఉప్మా..నా.." అని మొహం చిట్లించుకునేదాన్ని చిన్నప్పుడు అమ్మ పెడితే. వంటగది ఆధీనంలోకొచ్చాకా అన్నింటికన్నా త్వరగా చేసేయచ్చని "ఉప్మా చేసేయనా.." అని నేనే అడుగుతానిప్పుడు :) అందులోనూ ఇన్ని రకాలు చెసుకోవచ్చని తెలిసాకా!
ముందు సరదాగా కొన్ని ఉప్మా ఫోటోలు..
బొంబాయిరవ్వ ఉప్మా |
గోధుమరవ్వ ఉప్మా |
సగ్గుబియ్యం నానబెట్టి చేసే ఉప్మా అప్పుడప్పుడు చేస్తూంటా.. అది కూడా సులువే!
(Oats ఉప్మా చేయటమెలానో కామెంట్లలో ఉంది)
http://ruchi-thetemptation.blogspot.in/2011/04/blog-post_3843.html
సేమ్యా ఉప్మా తెలిసినదే కదా!
మరొకటి రైస్ సేమ్యా ఉప్మా: "రైస్ సేమ్యా" అని దొరుకుతుంది. దాన్ని వేడినీళ్లతో వడబోసేసి, పోపు వేసుకుంటే రుచికరమైన మరో ఉప్మా రెడీ !
రైస్ సేమ్యా ఉప్మా |
తర్వాత "జొన్నరవ్వ " ని కనుక్కున్నాకా జొన్న రవ్వతో కూడా ఉప్మా చేస్తున్నా.
ఇవి కాక, మరో రెండు రకాల ఉప్మాలు కనుక్కున్నా ఈమధ్యన.. రాగి సేమ్యాతో, మల్టీ గ్రైన్ రవ్వతో.. రెండు ఉప్మాలు ! వెరైటీలు ఇష్తపడేవారు ట్రై చేయచ్చు. "ఒక హెల్త్ డ్రింక్" అని అదివరకు నేను రాసిన మల్టీగ్రైన్ పిండి తయారు చేసిన మన్నా బ్రాండ్ నుంచి రకరకాల ఆరోగ్యకరమైన మాల్టేడ్ రాగి పౌడర్, ఇతర పిండిలు, రవ్వలు వస్తున్నాయి. వాళ్లదే "రాగిసేమ్యా" కూడా మార్కెట్లో దొరుకుతోందిట. నాకు మొన్న మిలెట్ ఫెస్ట్ లో దొరికింది. రాగి ఉపయోగాల గురించి గతంలో చెప్పుకున్నాం కదా, అంతమంచిది కాబట్టి మరి రాగిసేమ్యా కొనేసా. ఉప్మా చేసా.. బాగానే ఉంది. నెలకోసారి తినచ్చు..
తయారీ:
మామూలు ఉప్మా లోలాగే పోపు వేసేసి, నీళ్ళు పోసి,ఉప్పు వేసి, నీళ్ళు మరుగుతూండగా రాగిసేమ్యా వేసేయటమే. పాళ్ళు: ఒక గ్లాస్ రాగిసేమ్యాకి ఒక గ్లాస్ నీళ్ళు. ఎక్కువ పోస్తే ముద్దయిపోతుంది.
అల్లం, పచ్చిమిర్చి, కాక కేరెట్, ఉల్లిపాయ, వేరుశనగపప్పు లాంటి అదనపు అలంకారాలు ఎన్ని వేసుకోగలిగితే అంత రుచి :)
ఇక రెండో రకం మల్టీ గ్రైన్ రవ్వ. ఇది కూడా మిలెట్ ఫెస్ట్ లో దొరికింది. ఇది బజార్లో కొన్ని సూపర్మార్కెట్లలో అదివరకు చూసాను నేను. ఈ మల్టీ గ్రైన్ రవ్వఉప్మా కూడా కూడా రుచి బాగానే ఉంది. ఒకవేళ దొరక్కపోతే మనమే గోధుమ,జొన్న రవ్వ,సజ్జ రవ్వ,రైస్ రవ్వ(ఇవన్నీ విడివిడిగా మార్కెట్లో దొరుకుతాయి) అన్ని కలిపి మిక్స్ చేసేసుకుంటే మల్టీగ్రైన్ రవ్వ అయిపోతుంది :)
తయారీ:
గోధుమరవ్వ ఉప్మా చేసుకున్నట్లే. పైన రాసినట్లు పోపు, కూరముక్కలు,ఉప్పు వేసేసి, బుల్లి కుక్కర్లో పెట్టేస్తే రెండు విజిల్స్ వచ్చాకా ఆపేయటమే.
ఇవండీ ఉప్మా కబుర్స్... మరి వీటిల్లో మీరేది ట్రై చేస్తారు?
మీరు ఇన్ని రకాలూ ఒకే రోజు చేసేసారా?నేను రాగి ట్రయ్ చేస్తానండీ!
@nagarani erra:భలేవారే, మనిషన్నవాడెవడైనా ఇన్ని ఒకే రోజు తినగలడాండీ :) సరదాకి కొన్ని ఫోటోలు అని రాసి, కొన్ని పాత పోస్ట్ లింక్స్ కూడా ఇచ్చా కదండి.. :)
Graet post on Upma varieties. Try Kanchi Upma also.
తృష్ణ గారూ - సూపర్‌గా ఉన్నాయండీ!
నన్నడిగితే, అసలు ఉప్మా తయారీ ఓ ఆర్ట్ అంటాను. ఓసోస్, ఉప్మా ఏ కదా అని బోలెడు మంది మొదలెడతారు కానీ, సరీగ్గా పళ్ళు కుదిరిన ఉప్మా రుచి మాత్రమే మనసుకు పట్టుకుంటుంది.
నాకు బొంబాయి రవ్వ ఉప్మా - హాయిగా అల్లం పచ్చిమిర్చి అరివేపాకు దట్టించి చేస్తే భలేగా ఇష్టం. ఐతే గోధుమ రవ్వ ఉప్మా మంచిదని అమ్మ అదే చేసుకోమంటుంది లెండి.
సేమ్యా ఉప్మా స్కూల్ రోజుల్లో చాలా ఇష్టం గా ఉండేది, ఇప్పుడేమిటో మోజు తగ్గిపోయింది. :)).
మీరు కిచెన్ రారాణి అన్నమాట. నాకొక పనసపొట్టు కూర బాకీ ఉన్నారు. గుర్తుంచుకోండీ :)))
Love,
@Manasa chamarhti: మానసా, "ఉప్మా తయారీ ఓ ఆర్ట్ " - రైటో !
పొయ్యి వెలిగించటం రాని భర్తలున్న భార్యలందరూ కిచన్ రాణులేనండీ :) వండుకోవటం రాదు కానీ అక్కడొక్కచోటా మాట్లాడకుండాపెట్టింది తినాల్సిందే!
పనసపొట్టు కూర ఎప్పుడైనా రెడీ అవుతుంది... మీరావ్వటమే ఆలస్యం !
@Andhraman: అలాగేనండి :)
@Nasreen Basu: Thank you very much for the comment. You really boosted my spirits. Keep reading :)