శ్రీరామనవమికి అమ్మ చేసే ఈ వడపప్పు మాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇది మామూలుగా కూడా సాయంత్రాలు సలాడ్ లాగ చేసుకుని తినచ్చు..
ఎలాగంటే..
* అరకప్పు మామిడి కోరు
* ముప్పావు కప్పు కొబ్బరి కోరు
* కప్పు నానబెట్టిన పెసరపప్పు
* తగినంత ఉప్పు, కారం లేదా చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు
* అరచెంచా నూనెలో అరచెంచా ఆవాలు, చిటికెడు ఇంగువ ఇంగువ వేసిన పోపు.
పైన చెప్పినవన్నీ ఒక గిన్నెలో బాగా కలిపి రాముడికి పానకంతో పాటూ నైవేద్యం పెట్టాకా మనం ఆరగించడమే :-)
Post a Comment