మ్యాగీ మంచిది కాదు, వద్దు... అని వింటున్నా అప్పుడప్పుడు నెలకొకసారి తినేలా ఒక పేకెట్ కొనేదాన్ని మా పాప కోసం. వెజ్ ఆటా నూడుల్స్, ఓట్స్ నూడుల్స్ అంటూ ఏ రకం కొన్నా అవన్నీ కూడా మంచివి కాదనే ఆర్టికల్ ఒకటి చదివాకా, రెండేళ్ళుగా మ్యాగీ అనేది పూర్తిగా కొనడం మానేసి ప్లైన్(ఎగ్ లెస్) నూడుల్స్ కొని పాపకు చేసి పెడుతున్నాను. మ్యాగీ కన్నా బెటర్ అయినా అది కూడా నెలకు ఓ రెండు సార్లు చేస్తాను. ఆ మధ్యన ఓ సూపర్ మార్కెట్లో ప్లైన్ న్మూడుల్స్ అడిగితే Veg.Hakka Noodles పేకెట్ ఇచ్చారు అదే ఉందని.
ఈ నూడుల్స్ ప్లైన్ వాటి కంటే కాస్త లావుగా ఉంటాయంతే. టేస్ట్ కూడా వాటికన్నా ఇంకొంచెం బావున్నాయి. ప్లైన్ నుడుల్స్ తో కూడా తయారీకి క్రింద రాసిన సేం ప్రొసీజర్ ఫాలో అయిపోవచ్చు..
తయారీ:
* ముందు నూడుల్స్ మూడు రెట్లు నీళ్లలో తగినంత ఉప్పు వేసి ఉడకపెట్టి, స్ట్రైనర్ లో వార్చేసి, ఒక చెంచా నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి.
* తర్వాత కూర ముక్కలు తరుక్కోవాలి. (ఇలాగని కాదు ఏ ఆకారంలో అయినా తరుక్కోవచ్చు :))
* ఫ్రైయింగ్ పేన్ లో ఒక చెంచా నూనె వేసి కూర ముక్కలు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టేస్తే, ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి. (ఉప్పువల్ల ముక్కలు మెత్తబడి త్వరగా మగ్గుతాయి..i.e ఉడుకుతాయి)
* తర్వాత కూర ముక్కల్లో అరచెంచా వైట్ పెప్పర్(white pepper), ఒక చెంచా(medium spoon) సోయా సాస్ (soya sauce) వేసి రెండు, మూడు నిమిషాల తర్వాత ఉడికించి ఉంచిన నూడుల్స్ అందులో వేసి, నూడుల్స్ బ్రేక్ అవకుండా చెక్క గరిటెతో బాగా కలపాలి.
* ఫ్రైయింగ్ పేన్ హేండిల్ పట్టుకుని కదిపినప్పుడు స్టిక్కీగా కాకుండా నూడుల్స్ పైకీ కిందకీ కదిలేలా ఉంటే బాగా కుదిరినట్లు.
* చివర్లో తినేవాళ్ల ఇష్టాన్ని బట్టి కాస్త టమాటో సాస్ వేసి సర్వ్ చెయ్యడమే.