skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

Green Tea అద్భుతాలు

11:34 AM | Publish by తృష్ణ


మనం నిత్యం తాగే "టీ" ముఖ్యంగా నాలుగు రకాలు. వైట్, గ్రీన్, బ్లాక్, వూలాంగ్ (బ్లాక్ డ్రాగాన్ టీ). ఈ టీ ఆకులన్నీ Camellia sinensis అనే టీప్లాంట్ నుంచే వస్తాయి. కాకపోతే ఆకులను "స్టీమ్ చేయటం", "ఫెర్మెంట్ చేయటం"(oxidation), "ఎండబెట్టడం" మొదలైన ప్రోసెసింగ్ విధానంలో తేడా వల్ల వాటికి ఆ యా పేర్లు, ప్రత్యేకమైన రుచులు వచ్చాయి. మిగిలిన టీలన్నింటిలోకీ "బ్లాక్ టీ" కొద్దిగా స్ట్రాంగ్ గానూ, ఎక్కువ కెఫీన్ ను కలిగి ఉంటుంది.

ప్రస్తుతం నేను చెప్పబోయేది ఆరోగ్యకరమైన "గ్రీన్ టీ" గురించి. చైనా లో పుట్టిన ఈ గ్రీన్ టీ ఈ మధ్యనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది. అతి తక్కువగా ఫెర్మెన్ట్ చేయబడ్డ టీ ఆకులు ఇవి.
గ్రీన్ గ్రీన్ టీ కూడా చాలా వరైటీలు ఇప్పుడు లభ్యమౌతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వైద్య పరమైన రీసర్చ్ లు, ప్రయోగాల వల్ల గ్రీన్ టీకు సంబంధించిన ఎన్నో ప్రయోజనాలూ, ఉపయోగాలూ కనుగొనబడ్డాయి. గ్రీన్ టీ తాగటo వల్ల చేకూరే ఆరోగ్యపరమైన కొన్ని ఉపయోగాలు:

* గ్రీన్ టీలో EGCG (Epigallocatechin Gallate) అనే శక్తివంతమైన anti-oxident ఉంది. (anti-oxidents శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కాపాడతాయి)

* రెగులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి "హార్ట్ డిసీజెస్" వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.

* కొన్నిరకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ టీ లో ఉంది.

* అధిక బరువును తగ్గిస్తుంది.

* రోజూ గ్రీన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

* బేక్టీరియాను నివారించే సామర్ధ్యం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ ను రానివ్వకుండా చేయటమే కాక పళ్ళ ను కూడా సురక్షితంగా ఉంచగలుగే శక్తి గ్రీన్ టీకు ఉంది.

* గ్రీన్ టీ చర్మ రక్షణకు, సౌందర్యపోషణకు కూడా ఉపయోగకరం అని శాస్త్రవేత్తలు కనుగొనటమ్ వల్ల మార్కెట్లో గ్రీన్ టీ తో తయారు చేసిన సబ్బులు, షాంపూలూ, డియోడరెంట్ళు, క్రీమ్లు కూడా లభ్యమౌతున్నాయి.

మరి ఇన్ని ఉపయోగాలున్న గ్రీన్ టీ ను రోజూ తాగటం మొదలెట్టేయండి. నేను రెండు సంవత్సరాల నుంచీ రోజూ మధ్యాహ్నాలు తాగుతున్నాను. మార్కెట్లో దొరికే గ్రీన్ టీబ్యాగ్స్ కన్నా , గ్రీన్ టీ ఆకులను కొనుక్కుంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో త్రాగచ్చు.

గ్రీన్ టీ తయారీ:
* ఒక కప్పు నీళ్ళు బాగా మరగబెట్టి దింపుకోవాలి.
* తరువాత ఒక చిన్న చెంచాడు గ్రీన్ టీ ఆకులను అందులో వేసి 1,2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
* ఫ్లేవర్ కోసం ఆకులతో బాటుగా పావు చెంచా నిమ్మరసం, పంచదార బదులు తేనె కలుపుకుంటే ఆరోగ్యకరం.
* రెండు నిమిషాల తరువాత వడబోసుకుని త్రాగేయటమే..!

ఫ్లేవర్స్:

* నిమ్మరసంతో బాటుగా రెండు మూడు పుదీనా ఆకులను కూడా వేసుకుంటే అమోఘంగా ఉంటుంది.
* నిమ్మరసంతో పుదీనాకు బదులు చిన్న అల్లం ముక్క తొక్కి వేసుకున్నా బాగుంటుంది.
* నిమ్మరసం వాడకపోయినా పుదీనాకు బదులు నాలుగు తులసి ఆకులు కూడా వాడవచ్చు.

Labels: టీలు - రకాలు 7 comments

Kitchen Essentials:

11:34 AM | Publish by తృష్ణ


చాలావరకూ జీవితంలో మనం చేసే ఏ పని అయినా గుప్పెడు ముద్ద కోసమే. మనిషికి తృప్తి, ఇంక చాలు అనిపించేది కూడా ఒక్క భోజనం విషయంలోనే. అలాంటి భోజనం ప్రశాంతంగా తింటే అరుగుదల కూడా సాఫీగా జరుగుతుందనేది అందరికీ తెలిసినదే. అంతే కాక భోజనం తయారు చేసే ఇల్లాలు లేక మరెవరైనా ప్రశాంతంగా వంట చేయటం అనేది కూడా చాలా అవసరం. లేకపోతే వంట చేసేవారి చిరాకుపరాకులు కూడా ఆహారంతో పాటూ తినేవారిలోకి చేరతాయి అని ఎక్కడో చదివాను.

మిగతా చిరాకుల సంగతి ఎలా ఉన్నా, వంటింట్లో కావాల్సిన పదార్ధాలన్నీ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవటం వల్ల వండేవారికి సగం చిరాకు తగ్గుతుండనేది నా స్వానుభవం. మంచి ఆరోగ్యానికి దోహదపడే మన భోజనాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా తయారు చేసుకునేందుకు మనం కొన్ని అవసరమైన పదార్ధాలను,వస్తువులనూ వంటింట్లో అందుబాటులో ఉంచుకుంటే వంట చేయటం ఎంతో తేలికౌతుంది. నా కిచన్లో నేను ఎప్పుడూ రెడీగా ఉంచుకునే కొన్ని వస్తువుల వివరాలు ఇక్కడ ఇవ్వాలని...అవి కొత్తగా వంట మొదలుపెట్టే ప్రతివారికీ ఉపయోగకరంగా ఉంటాయని నా నమ్మకం.

ఇవి ఒక లిస్ట్ రాసేసుకుని ఉంచేసుకుంటే ప్రతి నెలా మర్చిపోయే సమస్య ఉండదు. ఇవన్నీ ఒకేసారి కాకపోయినా నెలకు కొన్ని చప్పున కొనుక్కోవచ్చు.

రోజువారీ పోపుసామాను:
* ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మిర్చి, ఇంగువ, పసుపు, ధనియాలు, వెల్లుల్లి
* కర్వేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చి మిర్చి ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.



కూరల్లోకి కొన్ని పొడులు:

1) శనగపప్పు కారం:
శనగపప్పు(కొద్దిగా ఎక్కువ), మినపప్పు,
ఆవలు, జీలకర్ర _ పప్పుల్లో పావు వంతు,
మెంతులు _ అర స్పూన్
ఎండుమిర్చి _ తగినంత (ఇది వెయ్యకపోయినా పర్వాలేదు. కూరలో వేసుకోవచ్చు)

అన్ని కలిపి ఒక్క చెంచా నూనెలో ఎర్రగా వేయించుకుని మరి మెత్తగా కాకుండా పొడి చేసుకుని ఉంచుకోవాలి. నెల పైగ నిలవ ఉంటుంది ఈ పౌడర్.

2) గుల్లశనగపప్పు / పుట్నాలపప్పు కారం:
గుల్ల శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా పొడి చేసుకుని ఉంచుకోవాలి.

3) నువ్వులకారం:
నూపప్పు, తగినన్నిమిరపకాయలూ ఎర్రగా వేయించుకుని పొడి చేసుకోవాలి. తరువాత ఉప్పు కలపాలి.
ఇది వేడి వేడి అన్నంలో కూడా కలుపుకుని తినవచ్చు.

4) జీలకర్ర పొడి :
జీలకర్ర ఎర్రగా వేయించి పొడిచేసుకోవాలి. (వేయించకుండా కూడా చేసుకోవచ్చు.)

5) ఎండు కొబ్బరి :
ఎండు కొబ్బరి పొడి కొనే కన్నా మార్కెట్లో దొరికే ఎండుకొబ్బరి చిప్పలు కొనుక్కుంటే అవసరం అయినప్పుడు కాస్తంత గ్రేటర్ తో తురిమేసుకుంటే తాజాగా ఉంటుంది.
6)
వేరుశనగపొడి:
వేరుశనగ/పల్లీలు బాగా వేయించి ఓపిక ఉంటే పొట్టు తీసి లేక తియ్యకుండా పొడి చేసి కారం, ఉప్పు కలుపుకుని పెట్టుకోవాలి. ఇది కూడా వేడి అన్నంలోకి తినటానికి బాగుంటుంది.

ఈ క్రిందవి బజార్లో రెడీగా దొరుకుతాయి: (కొద్దిగా, నెలకు సరిపడా కొనుక్కుంటే ఫ్రెష్ గా ఉంటాయి ఈ పొడులన్నీ)

7)
ధనియాల పొడి
8)
మిరియాలపొడి
9) ఆవపొడి
10)
మెంతిపొడి
11)సాంబార్ పొడి.(బజార్లో కొన్న పొడిని సాంబార్ లో మాత్రం వెయ్యను నేను....:) ఇది వేరేగా తయారు చేసుకుంటాను. తయారీ గురించి వేరే టపాలో ప్రత్యేకంగా రాస్తాను..:) )


వెరైటీలు తినే అలవాటు ఉంటే కొనుక్కోవలసిన powders and pastes:
1) Pavbhaji masala
2)Chole masala
3)Chat masala
4)Rajmah masala
5) Ginger, garlic paste
(ఇవి విడివిడిగా కూడా కొనుక్కోవచ్చు)
6)Garam masala powder
7)Corn Flour
8)Dry mango powder
9)Whitepepper powder
10) Priya veg.curry masala
(చపాతి లేక పూరీల్లోకి కూరముక్కలు, ఈ పేస్ట్, రెండు స్పూన్ల ఆయిల్, రెండు రొబ్బలు కొత్తిమీర,పొదీనా వేసేసి 2ltrs or 3ltrs కుక్కర్లో పెట్టేస్తే మూడు నిమిషాల్లో మంచి కర్రీ రెడీ అయిపోతుంది.)
11)Priya biriyani paste
(కూరముక్కలు, బియ్యం, తగినన్ని నీళ్ళు, నెయ్యి, ఈ బిరియానీ పేస్ట్ వేసేసి కుక్కర్లో పెట్టేస్తే మంచి బిరియానీ రెడీ అయిపోతుంది. వంట రానివాళ్ళు కూడా సులువుగా చేయవచ్చు.)

కొన్ని ముఖ్యమైన మసాలా పదార్ధాలు:
దాల్చినచెక్క, ఏలకులు, మిరియాలు, లవంగాలు, షాజీరా, బిరియాని పువ్వు, బిరియానీ ఆకు, జాజికాయ, జీడిపప్పు మొదలైనవి.


ఇవన్నీ కాక వంట సోడా, నిమ్మ ఉప్పు, బ్లాక్ సాల్ట్, అజినమోటో, వెనిగర్, సోయా సాస్, మయోనీస్, టొమేటో సాస్ మొదలైనవి వీలైనప్పుడు కొనుక్కుని ఉంచుకుంటే చైనీస్ ఐటెమ్స్ లేక సూప్స్, సలాడ్స్ చేసుకోవటానికి ఉపయోగపడతాయి.వెజిటేరియన్ వంటకు ముఖ్యంగా ఉపయోగపడేవి ఇవేనా? అంటే తొంభై శాతం ఇవే. మిగిలినవి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇంకా కూడా కొనుక్కోవచ్చు.

ఇవన్నీ కొత్తగా వంట మొదలెట్టేవారికోసం మాత్రమే...:)

Labels: Kitchen Essentials 3 comments

ఎలా ఉంది?

11:05 AM | Publish by తృష్ణ


Cooking is my passion...నాకు వచ్చిన వంటలతో ఒక బ్లాగ్ పెట్టాలన్నది నా చిరకాల కోరిక. ఇన్నాళ్ళకి అది కార్యరూపంలోకి వచ్చింది. ఇందులో ముఖ్యంగా నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న మామూలు తెలుగు వంటలు, ఇంకా చెప్పాలంటే గోదావరిజిల్లా వంటలు ఎక్కువ ఉంటాయి. ఆ తరువాత నేను పెద్దయ్యేకొద్దీ ఆసక్తితో నేర్చుకున్న రకాలు ఉంటాయి.

"రుచి...the temptation " పేరు బాగుందా? తినటం కన్నా వండి పెట్టడం అంటే ఎక్కువ ఇష్టం నాకు. అందులోనూ వంటింట్లో కొత్త కొత్త ఎక్స్పరిమెంట్స్ చేయటం అంటే మరీ ఇష్టం. ఈ బ్లాగ్ లో నేను రాయబోయే వంటకాలు శాకాహారానికి సంబంధించినవీ, సామాన్యమైనవే అయినా అస్సలు వంట రానివాళ్ళకు ఉపయోగపడేలా రాయాలన్నది నా కోరిక.

నా మొదటి బ్లాగ్ "తృష్ణ" లో రాసిన కొన్ని వంటల లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను.

౧)ఒక మంచి టిఫిన్:

౨) మెంతికూర సాంబార్ :

౩) cabbage పచ్చడి:

౪) ఆరోగ్యకరమైన హెల్త్ డ్రింక్:

౫) pav bhaaji, పచ్చి బొప్పాయి కూర, వెరైటీ దోసావకాయ

౬) దంపుడు బియ్యం(brown rice):

౭) stevia (a natural sugar substitute) :


Labels: recipe links 4 comments
« Newer Posts
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ▼  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ▼  June (3)
      • Green Tea అద్భుతాలు
      • Kitchen Essentials:
      • ఎలా ఉంది?

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.