చాలావరకూ జీవితంలో మనం చేసే ఏ పని అయినా గుప్పెడు ముద్ద కోసమే. మనిషికి తృప్తి, ఇంక చాలు అనిపించేది కూడా ఒక్క భోజనం విషయంలోనే. అలాంటి భోజనం ప్రశాంతంగా తింటే అరుగుదల కూడా సాఫీగా జరుగుతుందనేది అందరికీ తెలిసినదే. అంతే కాక భోజనం తయారు చేసే ఇల్లాలు లేక మరెవరైనా ప్రశాంతంగా వంట చేయటం అనేది కూడా చాలా అవసరం. లేకపోతే వంట చేసేవారి చిరాకుపరాకులు కూడా ఆహారంతో పాటూ తినేవారిలోకి చేరతాయి అని ఎక్కడో చదివాను.
మిగతా చిరాకుల సంగతి ఎలా ఉన్నా, వంటింట్లో కావాల్సిన పదార్ధాలన్నీ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవటం వల్ల వండేవారికి సగం చిరాకు తగ్గుతుండనేది నా స్వానుభవం. మంచి ఆరోగ్యానికి దోహదపడే మన భోజనాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా తయారు చేసుకునేందుకు మనం కొన్ని అవసరమైన పదార్ధాలను,వస్తువులనూ వంటింట్లో అందుబాటులో ఉంచుకుంటే వంట చేయటం ఎంతో తేలికౌతుంది. నా కిచన్లో నేను ఎప్పుడూ రెడీగా ఉంచుకునే కొన్ని వస్తువుల వివరాలు ఇక్కడ ఇవ్వాలని...అవి కొత్తగా వంట మొదలుపెట్టే ప్రతివారికీ ఉపయోగకరంగా ఉంటాయని నా నమ్మకం.
ఇవి ఒక లిస్ట్ రాసేసుకుని ఉంచేసుకుంటే ప్రతి నెలా మర్చిపోయే సమస్య ఉండదు. ఇవన్నీ ఒకేసారి కాకపోయినా నెలకు కొన్ని చప్పున కొనుక్కోవచ్చు.
రోజువారీ పోపుసామాను:
* ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మిర్చి, ఇంగువ, పసుపు, ధనియాలు, వెల్లుల్లి
* కర్వేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చి మిర్చి ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
కూరల్లోకి కొన్ని పొడులు:
1) శనగపప్పు కారం:
శనగపప్పు(కొద్దిగా ఎక్కువ), మినపప్పు,
ఆవలు, జీలకర్ర _ పప్పుల్లో పావు వంతు,
మెంతులు _ అర స్పూన్
ఎండుమిర్చి _ తగినంత (ఇది వెయ్యకపోయినా పర్వాలేదు. కూరలో వేసుకోవచ్చు)
అన్ని కలిపి ఒక్క చెంచా నూనెలో ఎర్రగా వేయించుకుని మరి మెత్తగా కాకుండా పొడి చేసుకుని ఉంచుకోవాలి. నెల పైగ నిలవ ఉంటుంది ఈ పౌడర్.
2) గుల్లశనగపప్పు / పుట్నాలపప్పు కారం:
గుల్ల శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా పొడి చేసుకుని ఉంచుకోవాలి.
3) నువ్వులకారం:
నూపప్పు, తగినన్నిమిరపకాయలూ ఎర్రగా వేయించుకుని పొడి చేసుకోవాలి. తరువాత ఉప్పు కలపాలి.
ఇది వేడి వేడి అన్నంలో కూడా కలుపుకుని తినవచ్చు.
4) జీలకర్ర పొడి :
జీలకర్ర ఎర్రగా వేయించి పొడిచేసుకోవాలి. (వేయించకుండా కూడా చేసుకోవచ్చు.)
5) ఎండు కొబ్బరి :
ఎండు కొబ్బరి పొడి కొనే కన్నా మార్కెట్లో దొరికే ఎండుకొబ్బరి చిప్పలు కొనుక్కుంటే అవసరం అయినప్పుడు కాస్తంత గ్రేటర్ తో తురిమేసుకుంటే తాజాగా ఉంటుంది.
6) వేరుశనగపొడి:
వేరుశనగ/పల్లీలు బాగా వేయించి ఓపిక ఉంటే పొట్టు తీసి లేక తియ్యకుండా పొడి చేసి కారం, ఉప్పు కలుపుకుని పెట్టుకోవాలి. ఇది కూడా వేడి అన్నంలోకి తినటానికి బాగుంటుంది.
ఈ క్రిందవి బజార్లో రెడీగా దొరుకుతాయి: (కొద్దిగా, నెలకు సరిపడా కొనుక్కుంటే ఫ్రెష్ గా ఉంటాయి ఈ పొడులన్నీ)
7) ధనియాల పొడి
8) మిరియాలపొడి
9) ఆవపొడి
10) మెంతిపొడి
11)సాంబార్ పొడి.(బజార్లో కొన్న పొడిని సాంబార్ లో మాత్రం వెయ్యను నేను....:) ఇది వేరేగా తయారు చేసుకుంటాను. తయారీ గురించి వేరే టపాలో ప్రత్యేకంగా రాస్తాను..:) )
వెరైటీలు తినే అలవాటు ఉంటే కొనుక్కోవలసిన powders and pastes:
1) Pavbhaji masala
2)Chole masala
3)Chat masala
4)Rajmah masala
5) Ginger, garlic paste
(ఇవి విడివిడిగా కూడా కొనుక్కోవచ్చు)
6)Garam masala powder
7)Corn Flour
8)Dry mango powder
9)Whitepepper powder
10) Priya veg.curry masala
(చపాతి లేక పూరీల్లోకి కూరముక్కలు, ఈ పేస్ట్, రెండు స్పూన్ల ఆయిల్, రెండు రొబ్బలు కొత్తిమీర,పొదీనా వేసేసి 2ltrs or 3ltrs కుక్కర్లో పెట్టేస్తే మూడు నిమిషాల్లో మంచి కర్రీ రెడీ అయిపోతుంది.)
11)Priya biriyani paste
(కూరముక్కలు, బియ్యం, తగినన్ని నీళ్ళు, నెయ్యి, ఈ బిరియానీ పేస్ట్ వేసేసి కుక్కర్లో పెట్టేస్తే మంచి బిరియానీ రెడీ అయిపోతుంది. వంట రానివాళ్ళు కూడా సులువుగా చేయవచ్చు.)
కొన్ని ముఖ్యమైన మసాలా పదార్ధాలు:
దాల్చినచెక్క, ఏలకులు, మిరియాలు, లవంగాలు, షాజీరా, బిరియాని పువ్వు, బిరియానీ ఆకు, జాజికాయ, జీడిపప్పు మొదలైనవి.
ఇవన్నీ కాక వంట సోడా, నిమ్మ ఉప్పు, బ్లాక్ సాల్ట్, అజినమోటో, వెనిగర్, సోయా సాస్, మయోనీస్, టొమేటో సాస్ మొదలైనవి వీలైనప్పుడు కొనుక్కుని ఉంచుకుంటే చైనీస్ ఐటెమ్స్ లేక సూప్స్, సలాడ్స్ చేసుకోవటానికి ఉపయోగపడతాయి.వెజిటేరియన్ వంటకు ముఖ్యంగా ఉపయోగపడేవి ఇవేనా? అంటే తొంభై శాతం ఇవే. మిగిలినవి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇంకా కూడా కొనుక్కోవచ్చు.
ఇవన్నీ కొత్తగా వంట మొదలెట్టేవారికోసం మాత్రమే...:)
annee chaala baaga ichaaru, annee ruchi ki ruchi aragyaaniki arogyam icheve unnaayi, ila pettukunte soukaryanga untundi kooda.
Note: trishna gaaru, ajinomoto maatram, manam chesukune padaarthaalaki ruchi isthundi kaanee aarogyaaniki manchidi kaadani vinnaanu. ajinomoto ante monosodium glutamate, adi brain cells ni damage chesthundata, prathyekanga pillalaki asalu manchidi kaadu, chinese foods lo, kurkure laanti padarthaalalo vaadthaaru daanni
aparna
@heartstrings: yap, what u told about ajinamoto is correct. I use it once in 2,3 months only to make "chinese fried rice"...maybe thats ok..and thankyou verymuch for the info. & comment too.
And i never buy kurkure and other kind of chips for my kid. somehow i don't like buying junk foods for chidren.
thats very good that you don't buy junk food for your daughter, i too avoid buying such things for my kids.
aparna