Cooking is my passion...నాకు వచ్చిన వంటలతో ఒక బ్లాగ్ పెట్టాలన్నది నా చిరకాల కోరిక. ఇన్నాళ్ళకి అది కార్యరూపంలోకి వచ్చింది. ఇందులో ముఖ్యంగా నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న మామూలు తెలుగు వంటలు, ఇంకా చెప్పాలంటే గోదావరిజిల్లా వంటలు ఎక్కువ ఉంటాయి. ఆ తరువాత నేను పెద్దయ్యేకొద్దీ ఆసక్తితో నేర్చుకున్న రకాలు ఉంటాయి.
"రుచి...the temptation " పేరు బాగుందా? తినటం కన్నా వండి పెట్టడం అంటే ఎక్కువ ఇష్టం నాకు. అందులోనూ వంటింట్లో కొత్త కొత్త ఎక్స్పరిమెంట్స్ చేయటం అంటే మరీ ఇష్టం. ఈ బ్లాగ్ లో నేను రాయబోయే వంటకాలు శాకాహారానికి సంబంధించినవీ, సామాన్యమైనవే అయినా అస్సలు వంట రానివాళ్ళకు ఉపయోగపడేలా రాయాలన్నది నా కోరిక.
నా మొదటి బ్లాగ్ "తృష్ణ" లో రాసిన కొన్ని వంటల లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను.
౧)ఒక మంచి టిఫిన్:
౨) మెంతికూర సాంబార్ :
౩) cabbage పచ్చడి:
౪) ఆరోగ్యకరమైన హెల్త్ డ్రింక్:
౫) pav bhaaji, పచ్చి బొప్పాయి కూర, వెరైటీ దోసావకాయ
౬) దంపుడు బియ్యం(brown rice):
౭) stevia (a natural sugar substitute) :
సరే!! అలానే. మా బడి మూసేస్కున్నాం ఐతే :):)
మాకు రెండుసిలబస్‌లూ చెప్పండి మేష్టారు/మేడం. (తి)వినే ఓపికుంది
బ్లాగ్ పేరూ, టెంప్లేట్ రెండూ బాగున్నాయి.
keep cooking! :-)
@bhaskar ramaraju:నలభీములతో పోటీ ఏమిటండీ..మరీనూ..!
@చైతన్య: అయితే శ్రధ్ధగా చదివి, ఓపిగ్గా తింటూండండి...:)
@మధురవాణి: thankyou.