
మార్కెట్లోకి వక్కాయలు వచ్చాయి.. మరి పచ్చడి చేసేస్కుందామా? వాక్కాయలు మరీ పండిపోకుండా గ్రీన్ గా ఉన్నవి కొనుక్కోవాలి.. ఇలా..
వాటి మధ్యన గింజలు తీసేయాలి క్రింద ఫోటోలోలాగ. లేకపోతే పచ్చడి చేదొస్తుంది.
కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకుంటామో అలానే అన్ని పాళ్ళు తీసుకుని, చింతపండు బదులుగా ఈ వాక్కయల్ని వాడాలి. అంతే.
కొలతలు కావలంటే:
* మొదట ఆవలు, మినపప్పు (కాస్త ఎక్కువ), కాస్త జీలకర్ర, రెండు ఎండు మిర్చి, కాస్త ఇంగువ, ఓ రొబ్బ కర్వేపాకు లతో పోపు పెట్టుకోవాలి.
తర్వాత:
* ఒక కొబ్బరి చిప్ప (మొత్తం కాదు సగమే..:)) చిన్నగా ముక్కలు...