మసాలా లేకుండా:
* ముందుగా ఒక గ్లాస్(nearly 150gms rice) అన్నం వండేసుకోవాలి.
* మూడు చెంచాల నూనె/నెయ్యిలో క్రింద ఐటెమ్స్ తో పోపు పెట్టుకోవాలి:
శనగపప్పు రెండు చెంచాలు,
మినపప్పు రెండు చెంచాలు,
ఆవాలు ఒక చెంచా,
జీలకర్ర ఒక చెంచా,
ఇంగువ పావు చెంచా,
కర్వేపాకు రెండు రొబ్బలు,
మూడు ఎండు మిరపకాయలు,రెండు పచ్చిమిరపకాయలు.
* బఠాణీ ఇష్టమైతే గుప్పెడు నానబెట్టుకుని ఉడికించుకోవాలి విడిగా
* చివరిగా ఒక చిప్ప తురిమిన కొబ్బరికోరు వేసి స్టౌ ఆపేయాలి.
* విడిగా పెట్టుకున్న అన్నంలో పైన వేయించిన పోపు వేసేసుకుని, బఠాణీ , తగినంత ఉప్పువేసి బాగా కలిపేసి దింపేసుకోవాలి.
* పది జీడిపప్పు పలుకులు విడిగా వేయించుకుని రైస్ పైన అలంకరించచ్చు.
* ఇది సింపుల్గా అయిపోయేది. బజార్లో ఈ మధ్యన కొబ్బరిపాలు అమ్ముతున్నారు. రుచి కావాలనుకునేవారు బియ్యం ఉడికేప్పుడు కాస్త నీరు తగ్గించుకుని ఆ కొబ్బరిపాలు కలిపి కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుంది.
***********************************
మసాలాతో కొబ్బరన్నం:
మసాలా దినుసులు:
1 అంగుళం దాల్చిన చెక్క,
2,3 ఏలకులు,
2,3 లవంగాలు,
ఒక పెద్ద ఉల్లిపాయ తరిగినది,
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా
బఠాణీ ఇష్టమైతే గుప్పెడు నానబెట్టుకుని ఉడికించుకోవాలి విడిగా,
ఒక చెక్క కొబ్బరి కోరు,
విధానం:
* దాల్చిన చెక్క,ఏలకులు,లవంగాలు వేయించి గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత కాస్త నూనెలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకుని, రెండూ కలిపి ఒక గ్లాసు(nearly 150gms rice) బియ్యం + కొబ్బరికోరు కూడా వేసేసి కుక్కర్లో ఉడికించాలి. మాములుగా రైస్ ఉడికేంత టైం చాలు.
* పది జీడిపప్పు పలుకులు విడిగా వేయించుకుని రైస్ పైన అలంకరించచ్చు.
*బజార్లో ఈ మధ్యన కొబ్బరిపాలు అమ్ముతున్నారు. రుచి కావాలనుకునేవారు బియ్యం ఉడికేప్పుడు కాస్త నీరు తగ్గించుకుని ఆ కొబ్బరిపాలు కలిపి కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుంది.
* ఉల్లిపాయ,టమాటో ముక్కలతో చేసిన రైతా ఇందులోకి బావుంటుంది.
మాకు కొబ్బరన్నం అంటే కొబ్బరిపాలతో వండేదే...ఇలా కొబ్బరి తురిమి కలిపితే, దాన్ని నేను "కోకోనట్ రైస్" అనేవాణ్ణి...;)
పైగా అమ్మ చక్కగా కొబ్బరిపాలు తీసేది...వాటితో ఇంకా ఏవేవో వంటలు చేసేది...ఉల్లిపాయసం కొబ్బరిపాలతోనే చేస్తారు...బజార్లలో దొరికే కొబ్బరిపాలు ఎలా ఉంటాయో ఏమో...;)
@కౌటిల్య: నేను స్కూల్లో ఉండగా మొదటిసారి ఒకరిదగ్గర ఇది నేర్చుకున్నప్పుడు ఇలాగే కొబ్బరిపాలతో చేసాను. తర్వాత తర్వాత ఇది ఈజీ అనిపించి ఇలాగే చేసేస్తున్నా.
అవును, కొబ్బరిపాలతో మంచి మంచి వంటలు ఉన్నాయి. వెజిటబుల్స్ అన్నీ ఉడకబెట్టి కొబ్బరిపాల్తో కలిపి ఒక గ్రేవీ టైప్ కర్రీ ఒకటుంది. హోం మేడ్ ఫ్రెష్ ది ఎప్పుడూ సేఫ్ అయినా హడావుడి ప్రపంచంలో బజార్లో దొరికేదానితోనే సరిపెట్టేసుకోవాలి మరి !!
thank you.