మెంతి చపాతీ:
* చిన్న మెంతి కట్టలు రెండు బాగా కడిగి నీళ్ళు ఓడ్చేయాలి ఇలా..
* మామూలుగా మనం చపాతీకి కలుపుకునే పిండిలోనే ఈ కడిగిన చిన్న మెంతి ఆకులు కూడా వేసి పిండి కలుపుకోవాలి. చిన్న కట్టలే కాబట్టి తరగక్కర్లేదు.
* మామూలుగా చపాతి ఒత్తుకున్నట్లే ఒత్తేసి, కాల్చటమే.
* చిన్న మెంతి కాబట్టి చేదు కూడా తెలీదు.
* పిల్లలకి కాస్త నెయ్యి వేసి చపాతీ కాలిస్తే ఇష్టంగా తింటారు.
ఇలా ఆకుకూరలతో మేమూ చేస్తుంటామండీ.
@శిశిర: మెంతి ఆకు కాకుండా కొత్తిమీర, పుదీనా, తోటకూరలతో ఇలా చేస్తుంటానండి నేను. మిగిలిన ఆక్కూరలు ఎప్పుడూ చెయ్యలేదు..
thank you :)