వీకెండ్స్ లో గానీ, కాస్త తీరుబడిగా ఉన్నప్పుడు గానీ హెవీ టిఫెన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా.. సాంబార్ ఇడ్లీ బదులు సాంబార్ గారె చేస్తే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏమంటారు?
గారెలు వేసే మినప్పిండిలో కాస్త అల్లం,పచ్చిమిరపకాయలు కలిపితే మసాలా గారెలు అయిపోతాయి కదా!
* ఎంత క్వాంటిటీకి అంటే 250gms మినపప్పుకి పది పన్నెండు పచ్చిమిరపకాయలు, రెండంగుళాల అల్లం సరిపోతుంది.
* అందులో తోటకూర ఇష్టం ఉంటే, కడిగి, సన్నగా తరిగిన రెండు కట్టలు తోటకూర తరుగు కూడా కలపచ్చు.
* మినపప్పు ఒక గంట,గంటన్నర నానితే చాలు గారెలు నూనె పీల్చుకోవు.
* సాంబార్ మామూలుగా చేసేసి అందులో వేడి వేడి గారెలు వేసేస్తే మసాలా గారె with సంబార్ రెడీ :)
టిప్:
* మినపప్పు రుబ్బేప్పుడు పొరపాటున ఎక్కువ నీళ్ళు తగిలి పిండి పల్చన అయిపోతే గారెలు నూనె పీల్చేస్తాయి + రౌండ్ గా రావు. అలాంటప్పుడు పిండిలో కాస్త bajra flour అంటే సజ్జ పిండి కలిపితే పిండి గట్టిపడుతుంది.
* ఇంట్లో సాంబార్ పొడి చేసుకునే విధానం రాసిన పోస్ట్ లింక్:
http://ruchi-thetemptation.blogspot.in/2011/03/blog-post_23.html
తృష్ణ గారూ
చూడగానే తినేసిన భావం కలిగింది ఇంకేం వండుకుంటాం!ఈ సారికి ఇలా కానిచ్చేసి మళ్ళీ రెసిపీ పెట్టినపుడు ఏకంగా మీ వూరు వచ్చేస్తాం
malleeswari
@malli: :-)థాంక్స్ అండి.. ఊ..వచ్చేయండి..