వడపప్పు రెసిపీ ఏమిటి అనుకుంటున్నారా? ఇది అమ్మ మా చిన్నప్పటి నుండీ శ్రీరామనవమి కి చేసే స్పెషల్ వడపప్పు. పానకం, ఈ వడపప్పు పెద్ద గిన్నెతో చెస్తే అటొచ్చి ఇటొచ్చీ తినేసి సాయంత్రం అవ్వకుండానే నేనూ ,తమ్ముడూ రెండు గిన్నెలూ ఖాళీ చేసేసేవాళ్లం. అందులోనూ మా ఇంట్లో బెల్లం ఉండేది కాదు పంచదార పానకమే :) ఇంతకీ ఈ వడపప్పులో స్పెషల్ ఏంటంటే 'మామిడికోరు'!
ఎలా చెయ్యాలంటే..
ఒక టీ గ్లాస్ నానబెట్టిన పెసరపప్పు
ఒక చెక్క కొబ్బరికోరు
చిన్న మామిడికాయ కోరు(మామిడికాయ పుల్లటిదైతే కొబ్బరికోరులో సగం ఉండేలా చూసుకోవాలి
సన్నగా తరిగిన ఒక పచ్చి మిరపకాయ
అరచెంచా ఆవాలు, చిటికెడు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి.
చిన్న చెంచాడు ఉప్పు
* నానిన పెసరపప్పు తడి లేకుండా వాడేసి ఒక గిన్నెలోకి తీసుకుని, పైన చెప్పినవన్నీ వేసి బాగా కలపాలి.
* పచ్చి మిరపకాయ ఇష్టం లేకపోతే కాస్త కారం వేసుకోవచ్చు.
చెప్పాలంటే, ఇదో మంచి సలాడ్. కొబ్బరి, మామిడి రెండిటిదీ భీభత్సమైన కాంబినేషన్ కదా..అందులోనూ కూరల్లో వేసేకన్నా raw కొబ్బరి తింటేనే మంచిది అంటారు కూడా. శ్రీరామనవమి కే కాక మామూలుగా కూడా ఈవినింగ్స్ స్నాక్ లాగ పచ్చి మామిడికాయలు దొరికినంత కాలం ఇది చేసుకుని తినచ్చు. కానీ ఇలా తినేప్పుడు పెసరపప్పు కాస్త తక్కువ వేసుకుంటే ఏమీ చెయ్యకుండా ఉంటుంది.
Good one !!
@sruthi: thanks andi.