మా చిన్నప్పుడు ఎక్కువగా తిన్న ఈవినింగ్ స్నాక్ ఇది. ఈజీగా అయిపోతుందనేమో అమ్మ చేస్తూండేది. మహారాష్ట్రలో "కాందా పోహా" అని బ్రేక్ఫాస్ట్ గా ఇది ఎక్కువగా తింటూంటారు. అక్కడ హోటల్స్ లో కూడా ఇది ఒక ఐటెమ్ గా దొరుకుతుంది. మేం బొంబాయిలో ఉండగా మావారి ఆఫీసులో శనివారాలు బ్రేక్ఫస్ట్, లంచ్ పెట్టేవారు స్టాఫ్ కి . అప్పుడు రెగులర్ గా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ "కాందా పోహా" ఉండేది వాళ్ళకి. తిని తినీ బోర్ కొట్టి ఇంక శనివారాలు ఆఫీసులో టిఫిన్ స్కిప్ చేసేస్తూ ఉండేవారు ఆయన. నాకు మాత్రం మహా ఇష్టం ఇది.
చెయ్యడం ఎలాగంటే:
* ఒక పెద్ద గ్లాసు అటుకులు కాస్త పావు గ్లాసు నీళ్ళు చల్లి తడిపాలి. ఎక్కువ నీళ్ళు పోసేస్తే అటుకులు ముద్దయిపోయి పొడిపొడిగా ఉండవు. అటుకులు స్ట్రైనర్ లో పెట్టి పైనుండి నీళ్ళు పోస్తే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉన్నా చిల్లుల్లోంచి క్రిందకి పోతాయి.
* ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగి ఉంచాలి.
* మూకుడులో ఒక చెంచాల నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు,మినపప్పు, వేరుశనగ గుళ్ళు, కర్వేపాకు,మిర్చి, ఇంగువ వేసి పులిహారకి మల్లే పోపు వేయించుకోవాలి.
*పోపు వేగాకా అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాకా స్టౌ ఆపేయాలి.
* తడిపి ఉంచిన అటుకులు అందులో వేసి బాగా కలిపి, ఒక చిన్న నిమ్మకాయ రసం తీసి అటుకుల పులిహారలో బాగా కలపాలి.
* కాస్త కొత్తిమీరతో అలంకరించి తినెయ్యడమే :)
బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ లాగనే కాక రాత్రిపూట లైట్ గా భోజనం చెయ్యాలనుకున్నప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు.
hmm tondi tondi.indake zst five mins back mee ruchi blog lo tiffins kosam search cheste same photos to ee old post dorikindi.( variety vantalu cheyalanukunnappudalla mee blog nu visit cheyadam alavatu :-))malli ade repost cheste naa lanti mee abhimanulu em ayipovali.anayam kotta kotta tiffins to adaragotteyandi.ikkada daily mee blog follow ayye vanta raani maalanti vallam untam mari.
extremely sorry andi very very sorry.mee blog nu roju chuddam alavaatu vantala kosam ivvala o look vesinappuddu ee item 2 times chusanu.so meeru 2 times post chesarani porabaddanu.pls pls em anukokandi.sorry andi.nijanga mee vantalu bavuntayi.keep posting.
@vasu:పర్వాలేదండి.
నా బ్లాగ్ ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు. చూస్తూ ఉండండి :)