శెనగలతో ఏమేమి చేయచ్చు అంటే..
* ముందు వాటిని మూటకట్టి మొలకలు తెప్పించాలి. అప్పుడు వాడుకుంటే ఆరోగ్యకరం.
* మొలకెత్తిన పచ్చి శెనగలు ఓ గుప్పెడుదాకా తినగలం :)
* ఉడకబెట్టుకుని ఉప్పు,కారం వేసుకుని ఇంకాసిని తినచ్చు.
* ఇంకా వంకాయ, క్యేబేజీ మొదలైన కరల్లో, ఉప్మాల్లో కాసిని శెనగలు వేసేస్తూ ఉండచ్చు.
* శనగలతో 'పాఠోళీ' మంచి కూర. రెసిపీ అప్పుడేప్పుడో చెప్పేసాను కదా..( http://ruchi-thetemptation.blogspot.in/2010/09/blog-post.html )
* chole masala with white chana
* chana masala with black chana
ఇక ఇప్పుడు రెండు చిన్న రెసిపీలు చెప్తాను..
1) శెనగలు సాతాళింపు:
* సాతాళించు అంటే నూనెలో వేయించడం అని అర్థం. శెనగలన్నీ సరిపోయేంత ఎక్కువ నూనె అక్కర్లేదు కానీ వాయినానికి వచ్చే దోసిడు శెనగలకి ఒక చెంచా నూనె చాలు.
* ఒక చెంచా నూనెలో మినపప్పు, ఆవాలు,జీలకర్ర, కర్వేపాకు,ఎండు మిర్చి చిటికెడు ఇంగువ వేసి పోపు వేయించాలి. తర్వాత మొలకెత్తిన శెనగలు అందులో వేసి మూకుడుపై మూత పెట్టి అంది మీద కాసిని(అర గ్లాసుడు) నీళ్ళు పోయాలి. నాన్స్టిక్ పేన్ అయితే నీళ్ళు అక్కర్లేదు. క్లోజ్డ్ లిడ్ ఉంటుంది కాబట్టి.
* మధ్య మధ్య కలుపుతూ ఉంటే ఐదు నిమిషాల్లో శెనగలు వేగిపోతాయి.
* ఉడకపెడితే మెత్తబదతాయి కానీ ఇలా చేయడం వల్ల శెనగలు మెత్తబడతాయి + క్రిస్పీగా ఉంటాయి కూడా.
* స్టౌ ఆపేసాకా వేగిన శనగలకి తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలిపి, కొత్తిమీర చల్లి, ఓ నిమ్మ చెక్కపిండితే... రుచి అద్భుత: :-)
* శనగలు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే మూతలో నీళ్ళు పొయ్యకుండా ఓపెన్ గా ఫ్రై చెయ్యాలి. మరో స్పూన్ నూనె వెయ్యాలి. అంతకన్నా అక్కర్లేదు.
2) శెనగ వడలు:
కప్పుడు శెనగలు(సుమారు వందగ్రాములు)
రెండు పచ్చిమిరపకాయలు
అంగుళం అల్లం ముక్క
కాస్త కొత్తిమీర లేక పుదీనా(రెండిటికీ రెండు రకాల రుచి వస్తుంది)
ఒక మిడియం ఉల్లిపాయ ముక్కలు
రెండు చెంచాలు బియ్యప్పిండి
* ముందు శెనగలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర/ పుదీనా కలిపి మెత్తగా మిక్సీలో తిప్పేసుకోవాలి. మెత్తబడటానికి కాసిని నీళ్ళు పోసుకోవచ్చు.
* తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు శెనగల ముద్దలో కలపాలి.
* రెండు చెంచాల బియ్యప్పిండి కూడా ఈ ముద్దలో కలపాలి.
* చిన్న చిన్నగా ముద్దలు తీసుకుని వడల్లా నూనెలో వేయించుకోవడమే.
* ఇవి వేడిగా తింటే క్రిస్పీగా బాగుంటాయి. చల్లారిపోతే మెత్తబడిపోతాయి.
3)vadas with mix of corn kernels
3/4cup black chana
1/3cup corn kernels
Bavundi :)Radhika (nani)
Vadalu chaalaa baaguntaay:-))
ఈ రోజు ఉదయం చేశాను తృష్ణగారూ...చాలా బాగున్నాయ్, చేయడానికి కూడా తేలిగ్గా ఉంది. శనగలన్నీ మళ్ళీ మంగళవారం రాకుండా..ఊరికే అందరికీ పంచి పెట్టకుండా తినడం ఇదే మొదలు. మిమ్మల్ని చాలా సార్లు తల్చుకున్నాను పొద్దున. మావారికి కూడా నచ్చాయి. మా ఇద్దరి నుండి మీకు చాలా చాలా థాంక్స్. :)
@manasa Camarthi: Happy to know..thank you too for trying the recipe :)