ఇప్పుడు కొత్తిమీర కారం గురించి చెప్పుకుందాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి గ్రైండ్ చేసి కొన్ని కూరల్లో వేసుకోవచ్చు. వంకాయల్లో వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. నాకీ కొత్తిమీర అన్నది ఫేవొరేట్ కాబట్టీ దొండకాయ, బీరకాయ, ఆనపకాయ కూరల్లో కూడా ఈ కొత్తిమీర కారం వేస్తూంటాను. మా అన్నయ్య నాకన్నా ఒక మెట్టు పైకెక్కి కాకరకాయలో కూడా కొత్తిమీర కారం వేసి ఓరోజు వండాడు. (తినడానికి బాగానే ఉందిలెండి :))
వంకాయ-కొత్తిమీర కారం కూర తయారీ:
* పావుకేజీ వంకాయలు తోచిన విధంగా ఉప్పు వేసిన నీళ్ళల్లోకి తరుక్కోవాలి. ఇలా అయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి.
* రెండు మీడియం సైజు కొత్తిమీర కట్టలు కడిగి చటుక్కున ఎండు మూడు భాగాలుగా తెంపి పెట్టుకోవాలి. (తెంపమనడం ఎందుకంటే దానికి చాకు అక్కర్లేదని అర్థం)
* మూడు, నాలుగు మీడియం సైజు పచ్చిమిరపకాయలు (ఇది ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు) కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకోవాలి లేదా తొక్కుకున్నా సరే.
* మూకుట్లో కూరముక్కలు వేసి, ఆ ముక్కలకి సగం కొలతన నీళ్ళు పోసి, తగినంత(అరచెంచా) ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. (వంకాయల్లో తక్కువ ఉప్పు పడుతుంది. కాస్త ఎక్కువైనా కూరంతా ఉప్పు కషాయం అయిపోతుంది.)
* వంకాయముక్కలు సగం ఉడికిన తర్వాత రెండు చెంచాల నూనె వేసి గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర కారాన్ని అందులో వేసేయాలి. (నూనె తినగలిగినవాళ్ళు మరో రెండు చెంచాలు నూనె వేసుకుంటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.)
* కూర మాడకుండా మధ్య మధ్య కలుపుతూ దగ్గర పడ్డాకా స్టౌ ఆపేయడమే.
ఒకసారి నేను చేసే వెరైటీ చెప్పనా అంతా మీరు చెసినవిధంగానే రెండు స్పూన్ల నూని ముందుగానే వేసి కాసిని ఆవాలు జీలకఱ్ఱ వేయిచి అందులో ఈ నీళ్ళల్లో వంకాయలు వెసి, సరిపడంత ఉప్పు వేసి కొంచం మగ్గినతరువాత కాస్త చింతపండు పులుసు వేస్తాను. ఆతరువాత కొత్తిమీర కారం వెసి పైన నీళ్ళతో ఉన్న ప్లేట్ మూత పెడతాను, కొంచం పులుపు, ఉప్పు, కాస్త కారం అందులో కొత్తిమీర ఫ్లేవర్ ఇహ పండగే అనుకొండి.
@రమణి గారూ, మీరు చెప్పింది కూడా బావుందండీ. థాంక్స్ ఫర్ ద రెసిపీ. ఆనపకాయ్ లో కొత్తిమీర కారం వేసేప్పుడు పోపు వేస్తే బావుంటుంది కానీ ఇందులో పోపు వెయ్యకపోయినా బావుంటుంది. ఈజీగా అయిపోతుంది. మాకు చింతపండు వాడకం కూడా బాగా తక్కువండీ & మా అమ్మగారూ ఇలానే చేసేవారు.
Trishna garu, మాంసాహారం తినే కుటుంబంలో పుట్టడం వలన కాబోలు, మా ఇళ్ళలో ఎవరూ ఇలాంటివి వండటం ఎరుగను. హోటల్స్ లో కూడా చూసిన గుర్తు లేదు. మీ రెసిపి చూసి నేను కూడా చేసాను. చాలా బాగుంది. I just followed your simple steps and tips. It came out tasting good. Many thanks for sharing yummy recipes.
And also waiting for more recipes from you.
@అనిర్విన్ : Thanks a lot for following the blog.. and the encouragement. Will surely post new recipies..!