skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

quick & easy : దొండకాయ(Tendli/Ivy gourd) మొత్తుకూర!

3:50 PM | Publish by తృష్ణ



"మొత్తుకూర..?" ఇదేం పేరని నవ్వుకోకండి. దొండకాయల్ని మొత్తి చేసే కూర కాబట్టి మేం దీనిని మొత్తుకూర అంటాం. ఈజీగా, త్వరగా అయిపోయే కూర ఇది. 

ఎలా చెయ్యాలంటే:
* ముందర దొండకాయల్ని కడిగి రెండువైపులా కొసలు కట్ చేసేసుకోవాలి. (లేతవైతే చేతితో గిల్లేసినా చాలు. ఒకోసారి అదీ చెయ్యను నేను :))


* పచ్చిమిర్చి, అల్లం తొక్కే రాయి/కల్వం తీసుకుని ఎవరిమీద కోపం ఉందో వాళ్లని తల్చుకుంటూ దొండకాయల్ని ఒక మొత్తుమొత్తండి. కోపం అన్నానని మరీ దొండకాయల్ని పచ్చడి చేసేయకండి. కాయ కాస్త చిట్లేలా(స్లిట్ అయ్యేలా) జస్ట్ అలా ఒక చిన్న దెబ్బ వెయ్యండి చాలు. ఇలా..



* తర్వాత చిన్న కుక్కర్(2 or 3 ltrs) తీసుకుని అందులో ఒక చెంచా ఆయిల్ వేసి, మొత్తి ఉంచిన దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, తొక్కిన వెల్లుల్లి రేకలు నాలుగు, పావు చెంచా పసుపు, పావు చెంచా జీలకర్ర పొడి, అర గ్లాసు నీళ్ళు(ఈ కొలతలు ఓ పావుకేజీ దొండకాయలకి) పోసి విజిల్ పెట్టేసి, రెండు  విజిల్స్ రాగానే స్టౌ ఆపేయాలి. 
ఒకవేళ చిన్న కుక్కర్ లేకపోతే మూకుడులోనే ఇవన్నీ వేసి మూత పెట్టాలి. మూకుడైతే మరో అర గ్లాస్ ఎక్కువ నీళ్ళు పోయాలి.

* కుక్కర్ మూత తీసి నీళ్ళేమైనా మిగిలి ఉంటే ఇగిరేదాకా ఐదు నిమిషాలు కూరని పొయ్యిపై ఉంచాలి.

* ఉప్పుకారాలు చెక్ చేసుకుని అవసరమైతే కలిపాలి. ఒకవేళ ఎక్కువైతే కూరలో అరగ్లాస్ నీళ్ళు పోసి అటుఇటు కదిపి ఓ గిన్నెలోకి వంపేసుకోవాలి. అవి కూర ఉడికిన నీళ్ళు కాబట్టి తర్వాత ఏ చారులోకో వాడుకోవచ్చు.


 కూర అలానే తినేయచ్చు కానీ కూర ముక్కలు బాగా వేగినట్లు అవ్వాలి అనుకుంటే కుక్కర్లోంచి ఏదైనా పేన్/మూకుడు లోకి షిఫ్ట్ చేసి, ఒక చెంచా ఆయిల్ వేసి మధ్య మధ్య కదుపుతూ ఐదు నిమిషాల తర్వాత స్టౌ ఆపేయాలి.


* మూకుడులోనే ఉడకపెడితే నీళ్ళు ఇగిరిపోయాకా చెంచా ఆయిల్ వేసి, ముక్కలు బాగా వేగినట్లయ్యాకా ఆపేయాలి.


* అన్నం లేదా చపాతీల్లోకి ఈ కూర బావుంటుంది.

***   ***   ***

* దొండకాయ కారం పెట్టి చేసిన కూర రెసిపీ క్రింద లింక్ లో:
http://ruchi-thetemptation.blogspot.in/2012/06/blog-post_04.html

***    ***

టిప్:

దొండకాయలు ఫ్రై చేసేప్పుడు కూడా ఇలా కాసిని నీళ్ళు పోసి చిన్న కుక్కర్లో పెట్టి, ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చాకా ఆపేసి, తర్వాత మూకుట్లో ఫ్రై చేసుకుంటే త్వరగా అవుతుంది కూర + ఎక్కువ నూనె వాడక్కర్లేదు . ముక్కల్ని బట్టి కాసిని నీళ్ళు పోతే కాబట్టి కుక్కర్లో పెట్టినా కూర ముక్కలు పేస్ట్ అవ్వవు.

Labels: quick & easy, కూరలు 4 comments
4 Responses
  1. Unknown Says:
    November 9, 2014 at 11:43 AM

    కూరగాయలు కొయ్యటానికి బద్ధకం వున్న నాలాంటి వాళ్ళకి భలే రెసిపీ చెప్పారు :). ఇంతకీ ఈ దొండకాయ మొత్తుడికీ,మొహం మొత్తుడుకీ తేడా ఏమిటంటారు ??


  2. తృష్ణ Says:
    November 10, 2014 at 10:53 AM

    @Swarna M :అసలు సంబంధమే లేదండి :) ఏ వస్తువుతోనో, పరికరం తోనో ,మనిషితోనో బాగా విసిగిపోతే మొహం మొత్తేస్తోంది అంటారు కదా!
    thank you.


  3. లక్ష్మీ'స్ మయూఖ Says:
    November 15, 2014 at 10:20 PM



    తృష్ణగారూ, ఇంటిలో ఎవరిమీదైనా కోపంగా ఉంటే ఆ రోజు ఈ మొత్తుడు దొండకాయ కూర చేసికోవచ్చునుకదా. కోపం ఎవరిమీదైతే ఎక్కువగా వుందో అన్ని ఎక్కువ దొండకాయలు మొత్తవచ్చుక్కదా.చాలా ఫన్నీగా అనిపించింది.


  4. తృష్ణ Says:
    November 16, 2014 at 9:51 PM

    @swarajya lakshmi mallampalli: :)


Post a Comment

« Newer Post Older Post »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ▼  2014 (24)
    • ►  December (2)
    • ▼  November (2)
      • quick & easy : దొండకాయ(Tendli/Ivy gourd) మొత్తుకూర!
      • వంకాయ-కొత్తిమీరకారం
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    2 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.