skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

సలాడ్ ప్రసాదం :-)

9:00 AM | Publish by తృష్ణ



శ్రీరామనవమికి అమ్మ చేసే ఈ వడపప్పు మాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇది మామూలుగా కూడా సాయంత్రాలు సలాడ్ లాగ చేసుకుని తినచ్చు..
ఎలాగంటే..
* అరకప్పు మామిడి కోరు
* ముప్పావు కప్పు కొబ్బరి కోరు
* కప్పు నానబెట్టిన పెసరపప్పు
* తగినంత ఉప్పు, కారం లేదా చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు
* అరచెంచా నూనెలో అరచెంచా ఆవాలు, చిటికెడు ఇంగువ ఇంగువ వేసిన పోపు.

పైన చెప్పినవన్నీ ఒక గిన్నెలో బాగా కలిపి రాముడికి పానకంతో పాటూ నైవేద్యం పెట్టాకా మనం ఆరగించడమే :-)

Labels: salads 0 comments

బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )

7:56 PM | Publish by తృష్ణ




winter melon, ash gourd లేదా white gourd అని పిలవబడే బూడిదగుమ్మడి కాయతో మనం ఎక్కువగా ఒడియాలు పెట్టుకుంటాం కదా. దానితో కూర, పప్పు, హల్వా, సూప్ మొదలైనవి కూడా చేసుకోవచ్చు. ఎన్నో ఔషధగుణాలున్న ఈ బూడిదగుమ్మడి కాయను ఈ విధంగా రకరకాల వంటల్లో వాడతారని నాకు బొంబాయిలో ఉన్నప్పుడు తెలిసింది. అక్కడ మార్కెట్లో కూరలతో పాటూ బూడిదగుమ్మడికాయలు, కట్ చేసిన ముక్కలు బాగా అమ్మేవారు. నేను మినప్పిండి కలిపి అట్టు చెయ్యడానికి కొంటూ ఉండేదాన్ని. మీరూ ఇలానే తింటారా అని అడిగితే.. కూర గురించి చెప్పారు అప్పటి మా పక్కింటివాళ్ళు. 

ఇది బాగా వాటర్ కంటేట్ ఉన్న కాయ కాబట్టి ఆనపకాయను ఎలా వండుకుంటామో అలా కూరలు చేసుకోవచ్చు. కాకపోతే ఇందులోని గింజలు తీసేసి వండుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిదైన బుడిదగుమ్మడి కాయను తరచూ ఏదో విధంగా వండుకుంటే మంచిది.


బుడిదగుమ్మడి పప్పు తయారీ:
* మందపాటి తొక్క తీసేసి, మధ్యలో ఉన్న గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.

* పప్పు, తరిగిన ముక్కలు(ఆనపకాయ పప్పు లాగనే), కాస్త పసుపు కలిపి కుక్కర్లో పెట్టాలి. అన్నంతో అయితే మూడు విజిల్స్, విడిగా పప్పు ఒక్కటే పెడితే రెండు విజిల్స్ రాగానే స్టౌ ఆపేయాలి.

* ఒక చెంచా నూనెలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కర్వేపాకు, ఒక ఎండు మిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, చిటికెడు ఇంగువ పోపు పెట్టుకోవాలి. 

* పోపు వేగాకా ఉడికిన పప్పు, బుడిదగుమ్మడి ముక్కలు పోపులో వేసేసి రెండు నిమిషాల తర్వాత పప్పు దింపేయడమే.

* బుడిదగుమ్మడి ముక్కలు మరీ చప్పగా ఉంటాయి కాబట్టి పప్పు పోపులో వేసాకా అర చెంచా సాంబారు పౌడర్ లేదా అర చెంచా amchur powder(డ్రై మ్యాంగో పౌడర్) వేస్తే రుచి బావుంటుంది.


టిప్:
చాలామంది పప్పులో చింతపండు రసం వేస్తారు. కానీ వంటల్లో చింతపండు వాదకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. దాని బదులు పులుపు కోసం పప్పులో డ్రై మ్యాంగో పౌడర్(amchur powder) వాడచ్చు.


బుడిదగుమ్మడి కాయ లోని ఔషధగుణాలు, ఉపయోగాల గురించి క్రింద లింక్స్ లో చూడవచ్చు:
http://vegrecipes4u.com/health-benefits-of-ash-gourd-winter-melon/

http://www.alwaysayurveda.com/ash-gourd/

Labels: పప్పులు 0 comments

Veg.Hakka Noodles

3:10 PM | Publish by తృష్ణ


మ్యాగీ మంచిది కాదు, వద్దు... అని వింటున్నా అప్పుడప్పుడు నెలకొకసారి తినేలా ఒక పేకెట్ కొనేదాన్ని మా పాప కోసం. వెజ్ ఆటా నూడుల్స్, ఓట్స్ నూడుల్స్ అంటూ ఏ రకం కొన్నా అవన్నీ కూడా మంచివి కాదనే ఆర్టికల్ ఒకటి చదివాకా, రెండేళ్ళుగా మ్యాగీ అనేది పూర్తిగా కొనడం మానేసి ప్లైన్(ఎగ్ లెస్)  నూడుల్స్ కొని పాపకు చేసి పెడుతున్నాను. మ్యాగీ కన్నా బెటర్ అయినా అది కూడా నెలకు ఓ రెండు సార్లు చేస్తాను. ఆ మధ్యన ఓ సూపర్ మార్కెట్లో ప్లైన్ న్మూడుల్స్ అడిగితే Veg.Hakka Noodles పేకెట్ ఇచ్చారు అదే ఉందని. 


ఈ నూడుల్స్ ప్లైన్ వాటి కంటే కాస్త లావుగా ఉంటాయంతే. టేస్ట్ కూడా వాటికన్నా ఇంకొంచెం బావున్నాయి. ప్లైన్ నుడుల్స్ తో కూడా తయారీకి క్రింద రాసిన సేం ప్రొసీజర్ ఫాలో అయిపోవచ్చు..

తయారీ:
* ముందు నూడుల్స్ మూడు రెట్లు నీళ్లలో తగినంత ఉప్పు వేసి ఉడకపెట్టి, స్ట్రైనర్ లో వార్చేసి, ఒక చెంచా నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి.




* తర్వాత కూర ముక్కలు తరుక్కోవాలి. (ఇలాగని కాదు ఏ ఆకారంలో అయినా తరుక్కోవచ్చు :))



* ఫ్రైయింగ్ పేన్ లో ఒక చెంచా నూనె వేసి కూర ముక్కలు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టేస్తే, ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి. (ఉప్పువల్ల ముక్కలు మెత్తబడి త్వరగా మగ్గుతాయి..i.e ఉడుకుతాయి)
* తర్వాత కూర ముక్కల్లో అరచెంచా వైట్ పెప్పర్(white pepper), ఒక చెంచా(medium spoon) సోయా సాస్ (soya sauce) వేసి రెండు, మూడు నిమిషాల తర్వాత ఉడికించి ఉంచిన నూడుల్స్ అందులో వేసి, నూడుల్స్ బ్రేక్ అవకుండా చెక్క గరిటెతో బాగా కలపాలి. 
* ఫ్రైయింగ్ పేన్ హేండిల్ పట్టుకుని కదిపినప్పుడు స్టిక్కీగా కాకుండా నూడుల్స్ పైకీ కిందకీ కదిలేలా ఉంటే బాగా కుదిరినట్లు.


* అన్నీ బాగా కలిసాయి అనిపించాకా, ఉప్పు చెక్ చేసి స్టౌ ఆపేయాలి.
* చివర్లో తినేవాళ్ల ఇష్టాన్ని బట్టి కాస్త టమాటో సాస్ వేసి సర్వ్ చెయ్యడమే.

Labels: snacks n sweets, tiffins
« Newer Posts Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.