mixed sprouts |
white pepper
Eggless mayonnaise(ఇది Egg ఉన్న mayonnaise కన్నా బెటర్ అని నా అభిప్రాయం. ఏదైనా mayonnaise ఎక్కువ తినకూడదంటారు. once in a while పర్లేదన్నమాట...:))
a pinch mustard powder
salt (as per the taste)
red chilli powder (1/2 sp)
తరిగిన కొత్తిమీర
తురిమిన కేరెట్
dressing 2: (ఈ ప్రయోగం ఇవాళ పొద్దున్న చేసాను)
tomato sauce ఒక పెద్ద sp
soya sauce ఒక పెద్ద sp
salt (as per the taste)
red chilli powder (1/2 sp)
తరిగిన కొత్తిమీర
తురిమిన కేరెట్
రెండింటిలో కలిపిన mixed sprouts మరియు ఇతర పదార్ధాలు :
మొలకలొచ్చిన పెసలు, మొంతులు(పెద్దగా చేదు ఉండవు), ఉలవలు, బొబ్బర్లు, నల్ల శనగలు, తెల్ల శనగలు, బఠాణీలు, మొన్న కొన్న అల్ఫాల్ఫా మొలకలు + కేప్సికం, కొద్దిగా స్వీట్ కార్న్ గింజలు.
ఇవన్నీ కూడా కుక్కర్లో ఉప్పు వేసి కొంచెం ఉడికించాలి. అంటే ఒక విజిల్ వచ్చాకా ఆపేయాలి. బాగా ముద్దగా ఉడకనివ్వకూడదు. ఉడకబెట్టకుండా కూడా తినచ్చు. నాలా గడ్డి గాదం తినేవాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ పాపం శ్రీవారిలా పచ్చివి తినటానికి కష్టపడేవాళ్ళకి కొద్దిగా ఉడకబెట్టి చేస్తే ప్రసన్నంగా తినగలరన్నమాట.
ఇక డ్రెస్సింగ్ ఐటేమ్స్ అన్నీ కలిపేసుకుని దాన్లో ఈ ఉడకబెట్టిన మొలకలన్నీ కలిపేసుకోవాలన్నమాట. సలాడ్ రెడీ ! నిన్న రాత్రి ఇవాళ పొద్దున్న రెండు రకాలు తినాకా మేం ok కాబట్టి మీరూ ప్రయత్నించవచ్చు...:)
వావ్! ఇవేంటో భలే ఈజీగా ఉన్నయే! నాకు అన్ని పదార్ధాలు తెలుసు..ఆ మయొనైజ్ ఏదో తప్ప! ;) చూడాలి ఈ సలాడ్ల సంగతి!! మర్చిపోయా...సలాడ్లలో 1/2 టీస్పూన్ ఆలివాయిల్ వేస్తే...అలాగే స్వీట్ ఆల్మండాయిల్ వేస్తే...చాలా బాగుంటుందిట! ఈసారి ఇవి ట్రై చేసి చూడండీ :)
నాకు ఈ లైన్ నచ్చింది ;)
>> నాలా గడ్డి గాదం తినేవాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ..
హ్హహ్హహ్హా! నేను మీటైపే! ;)
హాయ్ అండి తృష్ణ గారు,
నేను మీరు చెప్పిన డ్రెస్సింగ్ ౨ చేశాను ఇవాళ...కారెట్ తురమడానికి బద్ధకి౦చి ముక్కలు వేసాను. అబ్బ ఇవ్వాళే ఈ మొలకెత్తిన గింజలతో ఏమి చేస్తే బాగుంటుంది అనుకుంటూ నిద్ర లేచాను..మీ రెసిపి తో రుచికరమైన సలాడ్ చేసుకున్న..ధన్యవాదాలు..అలాగే, మీ ఆవకాయ బ్లాగ్ చూసి నోరూరి అర్జెంటు గ మా అమ్మ ని మాగాయ పచ్చడి పంపమని అడగాలి అని డిసైడ్ అయ్యాను :)
@ఇందు: హ..హా.. సేమ్ పించ్ అయితే..:))
ఇదీ ట్రై చేసేయండి మరి. నేను మయోనీస్ మొదటిసారి అక్కడ నుంచే తెప్పించుకున్నది. ఇప్పుడు ఇక్కడా దొరుకుతోంది. కాకపోతే నేను ఎగ్ లెస్ మయొనీస్ కొంటాను. అది ఎప్పుడైనా.
అన్ని సలాడ్స్ లోకీ ఆలివ్ ఆయిల్ బాగోదండి. కొన్నింటిలోకే బావుంటుంది. సలాడ్ ప్రయోగాలు బాగానే చేసాను నేను..:))
@వినీల: థాంక్స్ అండి. చాలా సంతోషం కలిగింది మీ వ్యాఖ్య చూసి.. సలాడ్ బాగున్నందుకు.