"చుండో" పచ్చిమావిడికాయలతో చేస్తారు. దీనిని చెపాతీలతో తింటారు గుజరాతీవాళ్ళు. మేం బొంబాయిలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక గుజరాత్ వాళ్ళు ఉండేవారు. ఆవిడ నాకు భక్రీ, చుండో మొదలైనవి టేస్ట్ చూపించి ఎలా చేయాలో చెప్పేవారు. నేనూ ప్రతి వేసవిలో తప్పనిసరి చేస్తుంటాను. ఇవాళే చేసాను. ఎలా చేయాలంటే:
రెండు పచ్చిమావిడికాయల తురుము
మావిడి తురుములో సగం కొలత పంచదార
ఉప్పు రెండు చెంచాలు
కారం ఒకటిన్నర చెంచాలు
జీలకర్ర ఒక చెంచా
పసుపు అర చెంచా
* పుల్లటి పచ్చడి మావిడికాయలు రెండింటిని తురుముకోవాలి.
* ఆ తురుములో అరచెంచా పసుపు, రెండు చెంచాల ఉప్పు కలిపి మూడు గంటలు పక్కన పెట్టాలి. (ఊట ఊరుతుంది.)
* తర్వాత తురుముకు సగం కొలత ఉన్న పంచదార తీసుకుని దాంట్లో కలిపి మందపాటి మూకుడులో పొయ్యి మీద పెట్టాలి.
* పంచదార తురుముకి వుప్పావు వంతు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే.
* మధ్య మధ్య అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
* ఆ మిశ్రమం దగ్గర పడ్డాకా ఒకటిన్నర చెంచాల కారం వేసి, మరీ రెండు మూడు నిమిషాల తరువాత ఒక చెంచా జీలకర్ర వేసి దింపేసుకోవాలి.
ఇది నేను చేసిన ప్రయోగం:
ఇంట్లో ఉంటే కనుక చిటికెడు కుంకుమపువ్వు(saffron) తయారైన మిశ్రమంలో వేస్తే రుచి అమోఘం.
ఈ "చుండో" చపాతీల్లోనే కాక దోశల్లోకి కూడా బావుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మావిడికాయ జామ్ మాదిరి అన్నమాట. వేసవికాలంలోనే ఎందుకు చేసుకోవాలంటే పచ్చడిమావిడికాయలతో పెడితేనే రుచి బావుంటుంది. తడి తగలకుండా తయారు చేస్తే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. పిల్లలే కాక పెద్దలు కూడా ఇష్టంగా తింటారు(తీపి ఇష్టమున్నవాళ్ళు).
మరో ట్రెడిషనల్ పధ్ధతి కూడా ఉంది. మా ఇంటిపక్క గుజరాతీ ఆవిడ ఇలా చేసేవారు. మావిడి తురుములో వెయ్యాల్సిన పదార్ధాలన్ని వేసేసి ఊట వచ్చాకా అది విడిగా తీసి, ఎండలో ఓ వారం పాటు రోజూ ఊట విడిగా తీసి మళ్ళీ రాత్రి కలిపి మళ్ళీ పొద్దున్నే తీసేసి(మన మజ్జిగ మెరపకాయల టైపులో) పాకం ఇగిరేదాకా ఎండలో పెట్టడం. అది కష్టం అంటే పొయ్యి మీద చేసే పైన చెప్పిన విధానం చెప్పిందావిడ. ఆవిడ పేరు బావుండేది "పారుల్" అని. అర్ధం ఏంటండీ అంటే తెలీదనేది..!
:D ఫొటో మాతరం సూపరుంది :) మీరు చేసారు కాబట్టి రుచీ బానే ఉండుంటుంది. నేను ట్రై చేయనా వద్దా? అని డిలేమాలో ఉన్నా!! కాని నాకు ఇలా కొంచెం తీపి+పులుపు+ఉప్పు+కారాం లాంటి కాంబో టేస్ట్స్ అంటే భలే ఇష్టం :)
నేను మొన్ననే చేసాను ఇది. నాకూ, మా అబ్బాయికీ ఇది చపాతీలలో తినడమంటే చాలా ఇష్టం. నేను ఒక అర చెంచాడు పెప్పర్ కూదా వేసాను కారంతో పాటు. బాగా వచ్చింది.
@ఇందు: తప్పకుండా చెయ్యండి. చాలాబావుంటుంది. నేను ఉత్తినే కూడా తినేస్తాను..:)
@ప్రసీద: భలే! మీకు తెలుసన్నమాట. పెప్పర్ వేస్తారా? నేనుఈసారి ట్రై చేస్తాను.
చూడటానికి భలే ఉంది. మొన్నే మా ఆదరాబాదరా నించి వచ్చాను. అక్కడ ఉన్నప్పుడు పోస్ట్ చేసుండొచ్చు కదా మీరు. :((((((((((( మాకిక్కడ దొరికే మావిడికాయలు అంత పులుపు ఉండవు.
@పద్మ: చాలా రోజుల్నుంచీ అనుకుంటున్నాను కానీ నేను చేసాకా ఫోటోతో పాటూ పెడదామని ఆగానండి. తీపిదే కాబట్టి మీకు దొరికే కాయతోనే కానిచ్చేయండి ఈసారికి..:)
చుడ్డానికి చాలా బాగుంది.నెను తప్పకుండా ట్రై చేస్తాను.
Thank you
www.maavantalu.com