ఇదేంటి అచ్చం పీజా లాగే ఉంది అని చూస్తున్నారా? ఇది ఇడ్లీ పిండితో వేసిన మినపట్టు. నాలుగు రోజులకు రుబ్బుకున్న ఇడ్లీ పిండి చివరకు వచ్చాకా ఇడ్లీలు పుల్లబడతాయని నేను చివరి పిండిని అట్లుగా వేస్తుంటాను.(చాలామంది ఇలానే చేస్తారు) వాటిని నేను ఉత్తి అట్లుగా కాక ఇలా రకరకాలుగా ప్రయోగాలు చేస్తానన్నమాట.
ఇక ఫోటోలోని దానిపై ఏమేమి పదార్ధాలు వేసానంటే:
* సోయా గ్రాన్యూల్స్
* టమాటా ముక్కలు
* సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు
* గ్రేటేడ్ ఉల్లిపాయ ముక్కలు
* గ్రేటేడ్ అల్లం
ఈ ఫోటోలోది రోస్ట్ అయ్యాకా రూపం. బావుంది కదా?
చేసే విధానం:
ఈ అట్టు రుచి అంతా "సోయా గ్రాన్యూల్స్" వల్లే. ఒక లేయర్ పిండి వేసి మళ్ళీ కాసిని సోయా గ్రాన్యూల్స్ చల్లి, మళ్ళీ ఒక గరిట ఇడ్లీ పిండి వేసేసి పైన మళ్ళి సోయా గ్రాన్యూల్స్ + పైన చెప్పిన ఉల్లి, టమాటా మొదలైన ముక్కలు వేసు చక్కగా రోస్ట్ చేసుకుని లాగించటమే.
సోయా గ్రాన్యూల్స్ బజార్లో దొరుకుతాయి. అవి గోరువెచ్చని ఉప్పు నీటిలో వేసి ఐదు నిమిషాల తరువాత నీరు వంపేసి, గట్టిగా పిండేయాలి. అవి చపాతీ కూరల్లో కూడా ఓ గుప్పెడు వేస్కోవచ్చు. చేసే కూర ఏదైనా రుచి తేడా రాదు + పోషకాలు వెళ్తాయి. అదన్నమాట !
చూస్తూనే నోరూరుతోంది. బాగుంది మీ ఐడియా.
అసలు నన్నడిగితే pizza ని ఇటాలియన్ మినపట్టు అని పిలవాలి.
chaalaa bagundandi pizza