skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

ఆంధ్రా pizza

7:49 PM | Publish by తృష్ణ



ఇదేంటి అచ్చం పీజా లాగే ఉంది అని చూస్తున్నారా? ఇది ఇడ్లీ పిండితో వేసిన మినపట్టు. నాలుగు రోజులకు రుబ్బుకున్న ఇడ్లీ పిండి చివరకు వచ్చాకా ఇడ్లీలు పుల్లబడతాయని నేను చివరి పిండిని అట్లుగా వేస్తుంటాను.(చాలామంది ఇలానే చేస్తారు) వాటిని నేను ఉత్తి అట్లుగా కాక ఇలా రకరకాలుగా ప్రయోగాలు చేస్తానన్నమాట.


ఇక ఫోటోలోని దానిపై ఏమేమి పదార్ధాలు వేసానంటే:

* సోయా గ్రాన్యూల్స్

* టమాటా ముక్కలు

* సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు

* గ్రేటేడ్ ఉల్లిపాయ ముక్కలు

* గ్రేటేడ్ అల్లం


ఈ ఫోటోలోది రోస్ట్ అయ్యాకా రూపం. బావుంది కదా?






చేసే విధానం:

ఈ అట్టు రుచి అంతా "సోయా గ్రాన్యూల్స్" వల్లే. ఒక లేయర్ పిండి వేసి మళ్ళీ కాసిని సోయా గ్రాన్యూల్స్ చల్లి, మళ్ళీ ఒక గరిట ఇడ్లీ పిండి వేసేసి పైన మళ్ళి సోయా గ్రాన్యూల్స్ + పైన చెప్పిన ఉల్లి, టమాటా మొదలైన ముక్కలు వేసు చక్కగా రోస్ట్ చేసుకుని లాగించటమే.



సోయా గ్రాన్యూల్స్ బజార్లో దొరుకుతాయి. అవి గోరువెచ్చని ఉప్పు నీటిలో వేసి ఐదు నిమిషాల తరువాత నీరు వంపేసి, గట్టిగా పిండేయాలి. అవి చపాతీ కూరల్లో కూడా ఓ గుప్పెడు వేస్కోవచ్చు. చేసే కూర ఏదైనా రుచి తేడా రాదు + పోషకాలు వెళ్తాయి. అదన్నమాట !

Labels: tiffins, అట్లు - రకాలు 2 comments

One salad - Two dressings !!

1:05 PM | Publish by తృష్ణ


mixed sprouts
dressing one :(ఈ ప్రయోగం నిన్న రాత్రి చేసాను)


white pepper
Eggless mayonnaise(ఇది Egg ఉన్న mayonnaise కన్నా బెటర్ అని నా అభిప్రాయం. ఏదైనా mayonnaise ఎక్కువ తినకూడదంటారు. once in a while పర్లేదన్నమాట...:))

a pinch mustard powder
salt (as per the taste)
red chilli powder (1/2 sp)
తరిగిన కొత్తిమీర
తురిమిన కేరెట్


dressing 2: (ఈ ప్రయోగం ఇవాళ పొద్దున్న చేసాను)


tomato sauce ఒక పెద్ద sp
soya sauce ఒక పెద్ద sp
salt (as per the taste)
red chilli powder (1/2 sp)
తరిగిన కొత్తిమీర
తురిమిన కేరెట్




రెండింటిలో కలిపిన mixed sprouts మరియు ఇతర పదార్ధాలు :


మొలకలొచ్చిన పెసలు, మొంతులు(పెద్దగా చేదు ఉండవు), ఉలవలు, బొబ్బర్లు, నల్ల శనగలు, తెల్ల శనగలు, బఠాణీలు, మొన్న కొన్న అల్ఫాల్ఫా మొలకలు + కేప్సికం, కొద్దిగా స్వీట్ కార్న్ గింజలు.

ఇవన్నీ కూడా కుక్కర్లో ఉప్పు వేసి కొంచెం ఉడికించాలి. అంటే ఒక విజిల్ వచ్చాకా ఆపేయాలి. బాగా ముద్దగా ఉడకనివ్వకూడదు. ఉడకబెట్టకుండా కూడా తినచ్చు. నాలా గడ్డి గాదం తినేవాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ పాపం శ్రీవారిలా పచ్చివి తినటానికి కష్టపడేవాళ్ళకి కొద్దిగా ఉడకబెట్టి చేస్తే ప్రసన్నంగా తినగలరన్నమాట.



ఇక డ్రెస్సింగ్ ఐటేమ్స్ అన్నీ కలిపేసుకుని దాన్లో ఈ ఉడకబెట్టిన మొలకలన్నీ కలిపేసుకోవాలన్నమాట. సలాడ్ రెడీ ! నిన్న రాత్రి ఇవాళ పొద్దున్న రెండు రకాలు తినాకా మేం ok కాబట్టి మీరూ ప్రయత్నించవచ్చు...:)




Labels: experiments, salads 4 comments

Gujarati 'chundo'

6:00 PM | Publish by తృష్ణ


"చుండో" పచ్చిమావిడికాయలతో చేస్తారు. దీనిని చెపాతీలతో తింటారు గుజరాతీవాళ్ళు. మేం బొంబాయిలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక గుజరాత్ వాళ్ళు ఉండేవారు. ఆవిడ నాకు భక్రీ, చుండో మొదలైనవి టేస్ట్ చూపించి ఎలా చేయాలో చెప్పేవారు. నేనూ ప్రతి వేసవిలో తప్పనిసరి చేస్తుంటాను. ఇవాళే చేసాను. ఎలా చేయాలంటే:

రెండు పచ్చిమావిడికాయల తురుము
మావిడి తురుములో సగం కొలత పంచదార
ఉప్పు రెండు చెంచాలు
కారం ఒకటిన్నర చెంచాలు
జీలకర్ర ఒక చెంచా
పసుపు అర చెంచా

* పుల్లటి పచ్చడి మావిడికాయలు రెండింటిని తురుముకోవాలి.
* ఆ తురుములో అరచెంచా పసుపు, రెండు చెంచాల ఉప్పు కలిపి మూడు గంటలు పక్కన పెట్టాలి. (ఊట ఊరుతుంది.)
* తర్వాత తురుముకు సగం కొలత ఉన్న పంచదార తీసుకుని దాంట్లో కలిపి మందపాటి మూకుడులో పొయ్యి మీద పెట్టాలి.
* పంచదార తురుముకి వుప్పావు వంతు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే.
* మధ్య మధ్య అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
* ఆ మిశ్రమం దగ్గర పడ్డాకా ఒకటిన్నర చెంచాల కారం వేసి, మరీ రెండు మూడు నిమిషాల తరువాత ఒక చెంచా జీలకర్ర వేసి దింపేసుకోవాలి.

ఇది నేను చేసిన ప్రయోగం:
ఇంట్లో ఉంటే కనుక చిటికెడు కుంకుమపువ్వు(saffron) తయారైన మిశ్రమంలో వేస్తే రుచి అమోఘం.

ఈ "చుండో" చపాతీల్లోనే కాక దోశల్లోకి కూడా బావుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మావిడికాయ జామ్ మాదిరి అన్నమాట. వేసవికాలంలోనే ఎందుకు చేసుకోవాలంటే పచ్చడిమావిడికాయలతో పెడితేనే రుచి బావుంటుంది. తడి తగలకుండా తయారు చేస్తే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. పిల్లలే కాక పెద్దలు కూడా ఇష్టంగా తింటారు(తీపి ఇష్టమున్నవాళ్ళు).


మరో ట్రెడిషనల్ పధ్ధతి కూడా ఉంది. మా ఇంటిపక్క గుజరాతీ ఆవిడ ఇలా చేసేవారు. మావిడి తురుములో వెయ్యాల్సిన పదార్ధాలన్ని వేసేసి ఊట వచ్చాకా అది విడిగా తీసి, ఎండలో ఓ వారం పాటు రోజూ ఊట విడిగా తీసి మళ్ళీ రాత్రి కలిపి మళ్ళీ పొద్దున్నే తీసేసి(మన మజ్జిగ మెరపకాయల టైపులో) పాకం ఇగిరేదాకా ఎండలో పెట్టడం. అది కష్టం అంటే పొయ్యి మీద చేసే పైన చెప్పిన విధానం చెప్పిందావిడ. ఆవిడ పేరు బావుండేది "పారుల్" అని. అర్ధం ఏంటండీ అంటే తెలీదనేది..!

Labels: chutneys n పచ్చడ్స్ 6 comments

my most favourite - ఉప్పుడుపిండి పులిహోర !

3:36 PM | Publish by తృష్ణ




ఇప్పుదంటే చాలామంది రాత్రిళ్ళు అన్నం మానేసి టిఫిన్ తింటున్నారు కానీ నా చిన్నప్పుడు పెద్దలందరూ వారాలు చేసేవారు. "శనివారం","ఆదివారం","గురువారం" అంటూ. ఆయవారాల్లో రాత్రిళ్ళు తిఫిన్ తినేవారు. అలాంటి వారపు రోజుల్లో మా ఇంట్లో ఎక్కువగా చేసే టిఫిన్ ఉప్పుడుపిండి. ఇది మా అన్నయ్యకు చాలా చాలా ఇష్టం. శనివారం రాత్రి చేస్తే కొంచెం ఎక్కువ చేయించుకుని ఆదివారం పొద్దున్నే ఉప్పుడుపిండిలో ఆవకాయ కలుపుకుని తినటం వాడి మోస్ట్ ఫేవొరేట్ హాబీ ! మేం అన్నయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు వాడు కలుపుకున్న (ఉప్పుడుపిండిలో) ఆవకాయ ముద్దలు అడిగి తినటం నాకూ, మా తమ్ముడికీ ఎంతో ఇష్టమైన పని. అన్నయ్య పెళ్ళిచూపుల్లో అమ్మాయికి "ఉప్పుడుపిండి చేయటం" వస్తే చాలండి ఇంకేమీ రాకపోయినా పర్వాలేదు అని చెప్పాం.


ఇక ఆ ఉప్పుడుపిండితోనే పులిహోర చేస్తారు. అది నాకు చాలా చాలా ఇష్టం. my most favourite అనొచ్చు. కానీ అది నేర్చుకొవటం తేలికైన పని కాదు. అప్పట్లో గుండ్రని ఇత్తడి గిన్నెతో వండేవారు. సులువు తెలుకోకపోతే ఓ పట్టాన సరిగ్గా చెయ్యటానికి రాదు. ఉప్పుడుపిండి చెయ్యటానికి కావాల్సినది బియ్యం రవ్వ. కాస్త నూనె, పెసరపప్పు బద్దలు వేసి, salt వేసి, కావాలంటే ఆవగింజలు, కర్వేపాకు పోపు వేసి వండుతారు. మధ్య మధ్యన గరిటెతో తిప్పుతూ ఉండటం ఇంకా కష్టం. అదివరకూ బియ్యాన్ని పిండిమరకు పట్టుకెళ్ళి రవ్వ ఆడించుకోవాల్సివచ్చేది. ఇప్పుడు "rice rawa" అని మార్కెట్లో దొరుకుతుంది. ఉండ్రాళ్ళకి రాత్రి బియ్యం తడిపి, ఆరబెట్టి, పొద్దుటే దంచి, జల్లించి నానా హైరానా పడేవారు పూర్వం. ఇప్పుడు ఉండ్రాళ్ళు కూడా దాంతోనే(rice rawa) చేసేస్తున్నారు .

ఇంతకీ నేను ఉప్పుడుపిండిపులిహోర నేర్చుకోవటానికి చాలా పరిశోధనలు చేసాను. ఇత్తడి గిన్నెలో, కుక్కర్లో, చిన్న కుక్కర్లో డైరెక్ట్ గా రవ్వ పోసి...రవ్వను ముద్దవ్వకుండా వండటానికి నానాతంటాలు పడేదాన్ని. నాన్నమ్మ, అమ్మ చేసినట్లు, పిన్నివాళ్ల అత్తగారు చేసినట్లు పొడిపొడిగా రవ్వ జలజలా రాలేలా "ఉప్పుడుపిండి పులిహోర" చెయ్యటం అసలు వస్తుందా అని బెంగ పెట్టుకున్నా కూడా. కానీ ఈ మధ్యనే కాస్త బాగా పొడిపొడిగా చెయ్యటం నేర్చుకున్నా. నాకు ఇత్తడిగిన్నె కన్నా, పెద్దకుక్కర్లో కన్నా, 2 ltrs బుల్లికుక్కర్లో డైరెక్ట్ గా వండితే బాగా వచ్చింది.

చేసే విధానం:
* ఒక గ్లాసు బియ్యం రవ్వ

ఒకటింపావు నీళ్ళు

తగినంత ఉప్పు

రెండు చెంచాలు నూనె వేసి బుల్లికుక్కర్లో డైరెక్ట్ గా సన్న సెగ మీద స్టౌ మీద పెట్టాలి. నీళ్ళు తక్కువైతే రవ్వ ఉడకదు. ఎక్కువైతే ముద్దైపోతుంది. అందుకని నీళ్ళు ఎంత పొయ్యాలో రెండుమూడు సార్లు వండితే కానీ పాళ్ళు తెలీదు. ఏ రకం బియ్యంతో రవ్వ చేసామో అన్నదాని మీద కూడా పొడిగానా,ముద్దగానా అన్నది ఆధారపడి ఉంటుంది.

* స్టౌ ఆపేసాకా బాగా చల్లారాకా మూత తీసి ఉడికిన రవ్వను ఏదైనా బేసెన్లో గానీ పెద్ద గిన్నెలో కానీ వెయ్యాలి.

* పులిహోరకు మామూలుగా పెట్టుకునే పోపు(ఆవాలు,జీలకరా,మినపప్పు,శనగపప్పు,వేరుశెనగ,కర్వేపాకు,ఎండు మిర్చి,పచ్చి మిర్చి,ఇంగువ,పసుపు) పెట్టుకుని ఆ ఉడికిన బియ్యం రవ్వలో కలపాలి. మామూలు పులిహోరలో లాగనే అల్లం తురుముకుని వేస్తే రుచి బావుంటుంది. వేరుశనగ బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు.

* రవ్వ బాగా ఆరాకా(చల్లారాకా) ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మరసం బదులు మావిడి కోరుతో కూడా చేయచ్చు. చింతపండు రసం కూడా వేసి చేసుకోవచ్చు.

* చింతపండు రసంతో చేస్తే గనుక ఇందులో నూపొడెం కూడా కలుపుకోవచ్చు.

* ఇందులో పసుపు కాస్త తక్కువ వాడితే చూట్టానికి బావుంటుంది.


అన్నంలోకి ఎప్పుడైనా అన్ని ఐటెమ్స్ వండటం బధ్దకం అనిపిస్తే నేను ఇదొక్కటే + కాస్తంత రైస్ వండేసి "కర్డ్ రైస్" కూడా చేసేస్తా. రెడీగా రెండు ఐటెమ్స్ తినేసేలాగన్నమాట.

Labels: పులిహోర 2 comments
« Newer Posts Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ▼  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ▼  May (4)
      • ఆంధ్రా pizza
      • One salad - Two dressings !!
      • Gujarati 'chundo'
      • my most favourite - ఉప్పుడుపిండి పులిహోర !
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.