skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

ములక్కాడ(drumstick) తియ్య కూర

12:43 PM | Publish by తృష్ణ




కావాల్సినవి:
* రెండు పెద్ద ములక్కాడలు
* అర చిప్ప కోరిన కొబ్బరి
* నాలుగు పెద్ద చెంచాలు నానబెట్టిన బియ్యం
* సుమారు 50gms బెల్లం లేక పంచదార (తీపి ఇష్టమున్నవారు మరికాస్త ఎక్కువ తీపి వేసుకోవచ్చు)
* పోపు కు : ఆవాలు, జీలకర్ర, మినపప్పు, రెండు ఎండు మిరపకాయలు.
* రుచికి సరిపడా ఉప్పు.

తయారీ:
* రెండు గంటల ముందుగా బియ్యం నానబెట్టి, కూర వండే ముందు తురిమిన పచ్చి కొబ్బరి వేసి మెత్తగా, జారుగా గ్రైండ్ చేసుకోవాలి.

* ములక్కాడ ముక్కలు రెండంగుళాలు చప్పున ముక్కలు తరుక్కుని, చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో పెడితే ఒక్క స్టీం రాగనే ఆపేయాలి. ఏ రకంగా ఉడకపెట్టిన ముక్కలు ముద్దవ్వకుండా చూసుకోవాలి.

* మూకుడులో గ్రైండ్ చేసిన బియ్యం, కొబ్బరి పేస్ట్ కు గ్లాసుడు నీళ్ళు(150ml) కలిపి పోసి అడుగంటకుండా ఉడకనివ్వాలి.

* బియ్యప్పిండి కాస్త ఉడికినట్లు అనిపించాకా అందులో బెల్లం లేదా పంచదార వెయ్యాలి.

* ఈ మిశ్రమం వండేప్పుడు ఎంత జారుగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వండిన కాసేపటికి (బియ్యంతో రుబ్బిన పేస్ట్ వేయటం వలన) గట్టిపడి అంతా గట్టి ముద్దగా అయిపోతుంది.
* బెల్లం / పంచదార కరిగాకా ఉడికిన ములక్కాడ ముక్కలు వేసి, చిటికెడు ఉప్పు కూడా వేయాలి. (రుచి చూసి చాలా తక్కువగా ఉప్పు వేసుకోవాలి.)




* మొత్తం అంతా మరో ఐదు నిమిషాలు  ఉడికాకా పైన చెప్పిన పదార్ధాలతో విడిగా పోపు పెట్టి, ఉడుకుతున్న ఈ కూరలో కలపాలి.

* దీనిని అన్నంలో కాకుండా విడిగా ఏదైనా స్వీట్ తిన్నట్లే మేము తినేవాళ్ళం.

 
బియ్యo నానబెట్టి రుబ్బటం కష్టమైతే బియ్యప్పిండి కూడా అప్పటికప్పుడు వాడుకోవచ్చు కానీ బియ్యం నానబెట్టి చేసుకుంటేనే రుచి బావుంటుంది. ములక్కాడ ముక్కలు మరీ మెత్తగా కాకుండా, అలాగని పచ్చిగా కాకుండా సమంగా ఉడికేలా చూసుకుంటే ఈ కూర రుచి బాగుంటుంది.ఇది తియ్యగా ఉంటుందని దీనినే మేము "ములక్కాడ పరమాన్నం" అని కూడా అనేవాళ్ళం.నాకు ఇష్టమని మా పిన్నివాళ్లు మా ఊళ్ళో ఉన్నన్నాళ్ళు ఇది చేసినప్పుడల్లా నాకు పంపిస్తూ ఉండేది. పిన్ని దగ్గర ఇది నేర్చుకున్నాను.

Labels: కూరలు 6 comments
6 Responses
  1. శ్రీ Says:
    June 20, 2011 at 8:57 PM

    పాలతో చేసే మునక్కాయల కూర అంటే నాకు బాగా ఇష్టం.మా అమ్మ చేస్తే విపరీతంగా తినేసేవాడిని.


  2. కౌటిల్య Says:
    June 20, 2011 at 10:47 PM

    భలే, భలే....నిన్న మార్కెట్ కెళ్ళినప్పుడు పది రూపాయలకి పెద్ద కట్ట ఇస్తుంటే పట్టుకొచ్చా..మునక్కాయలతో ఎప్పుడూ చేసే రొటీన్ కూరలేనా ఈసారి వెరైటీ ఏమన్నా ఉంటే బాగుంటుందనుకున్నా, కాని మీరు రాసిన రెసిపీ చూసి చేద్దామనుకునే పాటికి అది మా ఇళ్ళల్లో చేసుకునే ములక్కాడలపాయసానికి పోపు పెట్టటమే....కాని చేసి చూస్తా...ః)


  3. తృష్ణ Says:
    June 24, 2011 at 4:35 PM

    @శ్రీ: ఆనపకాయ పాలతో చేసినట్లుగానాండి? ములక్కాడ, టమేటా,ఉల్లిపాయ,బంగాళా దుంపలతో చేసే కూర కూడా బావుంటుందండీ.
    ధన్యవాదాలు.

    @కౌటిల్య: చేసారా? ఎలా వచ్చింది?
    ధన్యవాదాలు.


  4. Madhavi Pavani Says:
    June 28, 2011 at 9:55 PM

    chaala bagundandi....tappakunda try chestanu


  5. అనిర్విన్ Says:
    July 2, 2011 at 10:57 AM

    ఇదే తీపి కూర మా నానమ్మ చేస్తుంది. కానీ మునక్కాడతో కాదు, ఆనపకాయతో. She is still healthy and active today at the age of 90.

    Thanks for the recipe Trishna garu.


  6. తృష్ణ Says:
    July 2, 2011 at 2:16 PM

    @అనిర్విన్: That's great అండి. పూర్వకాలపు ఆహారంలోని పోషకాల బలం అది. ఇప్పుడు అన్నీఎరువుల పంటలే కదా.
    ధన్యవాదాలు.


Post a Comment

« Newer Post Older Post »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ▼  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ▼  June (2)
      • ములక్కాడ(drumstick) తియ్య కూర
      • పుదీనా రైస్
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    2 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.