మావిడికాయతో పెట్టుకునే పర్మెనెన్ట్ ఆవకాయ కాకుండా టెంపరరీగా కేరెట్, కాకరకాయ, ములక్కడ, పచ్చిమెరప, కాలీప్లవర్, టమాటా మొదలైన కూరలతో కూడా టెంపరరీ ఆవకాయ పెట్టుకుంటాం కదా. అలానే కొన్ని కూరలు కలిపి కూడా మిక్స్డ్ వెజ్ ఆవకాయ పెట్టుకోవచ్చు. ఎలాగో చూసేస్తారా మరి..
కావాల్సిన కూరలు, పదార్ధాలు:
* కాలీప్లవర్
* బీన్స్
* కేరెట్
* బంగాళా దుంప(పచ్చిదే)
* బఠాణీ(నానబెట్టినవి)
* టమాటా (కొంచెం గట్టిగా ఉన్నది చిన్న ముక్కలు తరుక్కోవాలి)
పైన రాసిన కూరలన్నీ ఓ 250gms దాకా ఉండేలా చిన్నముక్కలు తరుగుకోవాలి. (అన్నీ పచ్చివే.)
* 1 inch కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, 1 inch కట్ చేసిన పచ్చిమిరప ముక్కలు ఒక అర కప్పు తీసుకోవాలి.మొత్తం కూరముక్కలన్నీ కలిపి ఒక గిన్నెలో అరచెంచా పసుపు వేసి ఉంచాలి. ముక్కల్లో తడి ఉండకూడదు.
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 20gms (బజార్లో అమ్మేది కొనుక్కున్నా సరే, ఇంట్లో తడి తగలకుండా గ్రైండ్ చేసుకున్న సరే)
* ఆవపిండి - 30gms
* కారం - 30gms
* ఉప్పు - 30gms
* నిమ్మరసం - 1/2 cup
* పసుపు - 1/2 sp
* oil - 1 cup
తయారీ:
* ఆవ,కారం ,ఉప్పు బాగా కలుపుకోవాలి. ఇందులో కూరముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
* చివరిలో నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
కొన్ని టిప్స్:
* ఓపిక ఉంటే ఒక ఉల్లిపాయ గ్రైండ్ చేసి, ఆ ముద్దను మచ్చివాసన పోయేలా కాస్త నూనెలో బాగా వేయించి ఈ ఆవకాయలో కలిపితే కూడా రుచి బావుంటుంది.
* చేసిన రెండ్రోజుల తరువాత తింటే కూర ముక్కలు ఊరతాయి.
* ముక్కలు ఎక్కువగా ఉంటే దోశల్లోకి ,చాపాతిల్లోకి కుడా బావుంటుందని నేను పిండి తక్కువ కలుపుతాను. పిండి ఎక్కువ కావాలనుకునేవాళ్ళు ఆవ,కారం,ఉప్పులను మరో పది గ్రాములు ఎక్కువగా కలుపుకోవచ్చు.
* నిమ్మరసం వెయ్యకపోతే ఈ ఆవకాయ రెండ్రోజుల కన్నా నిలవ ఉండదు. పాడయిపోతుంది.
* ఈ ఆవకాయ ఒక నెల రోజులు నిలవ ఉంటుంది కానీ ముక్కలు మెత్తబడిపోతే రుచి తగ్గిపోతుంది. అందుకని కొద్దిగా పెట్టుకుంటేనే బావుంటుంది.
భలె ఉందే ఈ వెరైటీ ఆవకాయ! నేను ట్రై చేయాలి ఐతే!
chaala bagundi ee uragaya
www.maavantalu.com