కావాల్సిన పదార్ధాలు:
బియ్యం: 300gms
వంకాయలు: 250gms
ధనియాలు : రెండు చెంచాలు
కొబ్బరి : పావుకప్పు (తురిమినది)
మినపప్పు: రెండు చెంచలు
శనగపప్పు: రెండు చెంచాలు
ఇంగువ : చిటికెడూ
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: మూడు
పసుపు : పావు చెంచా
ఉప్పు: తగినంత
జీడిపప్పు: 10
నూనె: మూడు చెంచాలు
నెయ్యి: రెండు చెంచాలు
క్రింద చెప్పిన పదార్ధాలన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి:
* ధనియాలు, మినపప్పు, శనగపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, కొబ్బరి,7 లేక 8 ఎండు మిరపకాయలు, ఇంగువ కాస్తంత నూనెలో వేయించి మెత్తగా పొడికొట్టుకోవాలి లేదా గ్రైండ్ చేసుకోవాలి.
తయారీ:
* ముందుగా బియ్యాన్ని కడిగి, పులిహోరకు వండినట్లు కాస్త బిరుసుగా వండి చల్లారబెట్టి ఉంచాలి.
* వంకాయలు చిన్నగా తరిగి రెండు మూడు చెంచాల నూనెలో నూనెలో వేసి, ఉప్పు వేసి మూత పెడితే ముక్కలు త్వరగా మగ్గుతాయి.
* వేగిన కూరలో గ్రైండ్ చేసుకున్న మసాలపొడి వేసి,పసుపు వేసి బాగా బాగా కలపాలి.
* తర్వాత చల్లారిన అన్నం కూరలో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం పొడిగా ఉంటే వాంగీబాత్ ముద్దవ్వకుండా ఉంటుంది.
* అన్నం, కూర బాగా కలిసాకా స్టౌ ఆపేయాలి.
* చివరగా నెయ్యిలో జీడిపప్పు వేయించాలి.
* జీడిపప్పు వేయించిన నెయ్యి వాంగీబాత్ లో కలిపేసి, పైన జీడిపప్పు + కొత్తిమీర కలిపి అలంకరించాలి.
భలే కలర్ఫుల్ గా ఉంది !
నేను ఇలా చేస్తాను కానీ కొబ్బరి వేయనండి , క్రీం లాగా దొరుకుతుంది చూడండి అది వేస్తాను .
నేను చేసే విధానం కొంచెం తేడా. కూరలో అన్నం కలపను. విడిగా అన్నంలోనే కూర వేసి ఇంకొంచెం మసాలా పొడి కూడా వేసి కొంచెం నూనె వేస్తాను. అన్నం వేడికి ఆ నూనె వేగినట్టు అవుతుంది. చివరికి కాస్త నిమ్మరసం కూడా పిండుతాను.
సింపుల్ గ ఉంది ట్రై చెయ్యాలి. థాంక్స్.
అబ్బ నోరూరుతోందండీ ఆ ఫొటో చూస్తుంటే
వాంగీ బాత్ ఇంత సింపులా....అయితే చేసేస్తా!
ఏ వంకాయలు వాడాలండీ? తెల్లవా? నీలంవా?
@శ్రావ్య వట్టికూటి: కోకోనట్ క్రీం వేస్తారా? ఒకోసారి ఇంట్లో కొబ్బరికాయ లేకపోతే వెయ్యకుండా కూడా చేస్తూంటానండీ.బానే ఉంటుంది.
ధన్యవాదాలు.
@పద్మ: కొంతమంది చింతపండు రసమ్ కూడా కూరలో వేస్తుంటారండి...నిమ్మరసం ఐడియా కూడా బావుంది.
ధన్యవాదాలు.
@రావ్ ఎస్ లక్కరాజు: చాలా సింపుల్ అండీ. ట్రై చేయండి బావుంటుంది.
ధన్యవాదాలు.
@ఆ.సౌమ్య: పైన పొడుగువంకాయల ఫోటో పెట్టాకదాండీ... వాటితో చేస్తే బావుంటుంది. తెల్ల వంకాయలతో నేనెప్పుడూ ప్రయత్నించలేదు. వాటితో పచ్చడే బావుంటుంది. లేదా అల్లం పచ్చిమిర్చి వేసి ముద్ద కూర ! తెల్లవయినా చిన్నవి దొరికితే గుత్తొంకాయ కూర కూడా చెస్కోవచ్చు.
వాంగీబాత్ చేసాకా ఎలా వచ్చిందో చెప్పండీ.
ధన్యవాదాలు.
ఏంది మీరు బెంగళూరు లో ఎప్పుడు తిన్లేదా??
తెల్లొంకాయతో మస్తు టేస్టొస్తాది.
మత్తే, ఎల్లిపాయెయ్యరా మీరు?
@bullabbai: నేను బెంగుళూరు లో తినలేదండీ. తెల్ల వంకాయలతో కూడా చేస్తారని నాకు తెలీదండీ. నాకు తెలిసీ చాలావరకూ తెల్ల వంకాయలు గిజరుగా, గింజలతో నిండి ఉంటాయి.
ఉల్లిపాయ కూడా ఎప్పుడూ వెయ్యలేదండీ నేను.
ధన్యవాదాలు.
తృష్ణ గారు.. చేసే విధానం సవివరంగా బాగా చెప్పారు...
ఇదేదో సింపుల్ గా వుంది.. నేనూ వందేకి ట్రై చేస్తా... మీ వంటకం నా చేతిలో పది ఖూనీ అయితే దానికి మన్నించాలి .. హ హ హ :))
--
హర్ష
హర్షా, ఖూనీ ఏం అవ్వదు. బాగా వస్తుంది అనుకుని చేసెయ్..! విజయీభవ...:))
Looks tasty! :)