బజార్లో ఎక్కడ చూసినా పండుమిరపకాయలే ! ఎర్రగా భలే ఉన్నాయి చూట్టానికి. పండు మిర్చి కారం తింటే మాత్రం గూబ గుయ్యే !! అది క్రితం ఏడాది పెట్టాను. ఈసారి పండుమిర్చి, చింతకాయలు కలిపి పచ్చడి చేద్దామని ట్రై చేసాను. బాగానే వచ్చింది.
కావాల్సినవి:
పండుమిర్చి 200gms
చింతకాయలు 300gms (క్వాంటిటి ఇలా అయితే బాగా కారం లేకుండా ఉంటుంది పచ్చడి)
ఉప్పు తగినంత (పచ్చడిలో ఎవరెంత వేసకుంటే అంత)
పోపుకి:
మూడు పెద్ద చెంచాల నూనెలో ఆవాలు, మినపప్పు , 1/2sp ఇంగువ, 1/2sp పసుపు.
చేయటం:
* పండుమిరపకాయలు కడిగి ఆరబెట్టి, తడిలేకుండా ఆరాకా గ్రైండ్ చేసుకోవాలి.
* చింతకాయలు గ్రైండర్ సాయంతో కానీ రోట్లో కానీ కాస్త తొక్కి గింజ తీసేసి, గ్రైండర్లో ముద్దగా చేసి పెట్టుకోవాలి.
* తర్వాత తగినంత ఉప్పు వేసి చింతకాయ, పండు మిర్చి రెండు ముద్దలు మెత్తగా గ్రైండ్ చేసేయాలి.
* పైన చెప్పిన పదార్ధాలతో పోపు పెట్టి, స్టౌ ఆపేసాకా అందులో ఈ గ్రైండ్ చేసిన ముద్ద వేసి బాగా కలిపి, చల్లారాకా సీసాలో స్టోర్ చేసుకోవటమే.
ఈ రెండు కలిపి గ్రైండ్ చేసిన తరువాత మెంతులు కాసిని బాగా వేయించి పొడికొట్టి కలిపి పోపు పెడితే చాలా బాగుంటుంది.
చూస్తుంటే నోరూరిపోతుంది..
నిన్న పండుమిరపకాయ పచ్చడి చేస్తూ మీరు డెఫినెట్ గా ఈ పోస్టు వ్రాస్తారని అనుకున్నాను. అలాగే రాసారు. నేను చింతపండుతో చేసాను.
@ఇందిర: పండుమిర్చి+చింతపండు తో చేసే పచ్చడిలో ఇలా మెంతిపిండి కలుపుతానండి నేను. మెంతులు వేయించనక్కర్లేకుండా, పోపు వేయించాకా 'బయట కొన్న మెంతిపిండి' రెండు మూడు చెంచాలు వేసేసి ఎర్రగా వేగాకా స్టౌ ఆపేయచ్చు.
ధన్యవాదాలు.
@జ్యోతిర్మయి: పట్టండి ఓ ముద్దకలిపి పెడతాను..:))
ధన్యవాదాలు.
@నీహరిక: అవునా? ..:))
ధన్యవాదాలు.
నేను పండు మిరపకాయలు + చింతకాయలు కలిపాక మెంతిపిండి , ఇంగువ కలిపి వుంచుతాను . ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త ముద్ద తీసుకొని పోపువేస్తాను . ఇది ప్రతి సంవత్సరమూ దాదాపు 10 కిలోలు చేస్తాను :)
@mala kumar:పది కేజీలా...అమ్మో...నే పెట్టిన పావుకేజి సంవత్సరమ్ దాటినా ఇంకా ఉంటుంది...మేము చాలా తక్కువ తింటాం ఊరగాయలు..:))