చలికాలం అయిపోతోంది కానీ ఇంకా లేత ముల్లంగి దొరుకుతోంది. ముల్లంగి వాసన నచ్చక కూరగా కానీ పచ్చడిగా కానీ తినలేనివారు ముల్లంగి తురుముకుని చపాతీ చేసుకోవచ్చు.
ముల్లంగి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో క్రింద లింక్ లో చూడవచ్చు:
http://en.petitchef.com/recipes/health-benefits-of-mooliradish-fid-418423
తయారీ:
* ముందుగా లేత ముల్లంగి ఇలా తురుముకోవాలి.
* ముల్లంగి వాసన నచ్చకపోతే, ఆ తురుములో కాస్తంత ఉప్పు వేసి ఐదు నిమిషాలు అట్టే పెట్టి, ఆతర్వాత ముల్లంగి తురుముని గట్టిగా పిండేసి, గోధుమపిండిలో కలపాలి.
* రెండు గ్లాసుల గోధుమపిండికి, ఒకటిన్నర గ్లాసుల ముల్లంగి తురుము వేసి చపాతీ పిండి కలుపుకోవాలి. ఇలా..
* కలుపుకున్న పిండిని వీలయినంత త్వరగా వత్తేసుకోవాలి. ఎక్కువ సేపు ఉంచితే ముల్లంగిలో ఉన్న తేమ వల్ల పిండి బాగా మెత్తగా అయిపోతుంది.
* వీలయినంత సన్నగా చపాతీ వత్తుకుని, పెనం మీద చపాతీ చూట్టు పావు చెంచా నూనె వేసి మీద చపాతీ కాల్చుకోవాలి.
* రుచికరమైన ముల్లంగి చపాతీలు ఏదైనా ఆకుకూరపప్పుతో కానీ, ఏదైనా కూరతో కానీ తినవచ్చు.
ముల్లంగి పరోటా తెలుసు గానీ.. ఇది తెలీదు.. I'll try it. Thanks for the recipe. :)
@madhuravani: పరోటా కన్నా ఇది చేయటం ఈజీ అని ఇది రాసా మధురా... ఇందులోనే ముల్లంగి తురుములో ఉప్పు వేసి పిండే ముందరే ఉల్లిపాయ కూడా తురుముకుని కలిపి ఆ తర్వాత చపాతి పిండి కలుపుకుంటే ఇంకా రుచి బావుంటుంది.
Really I hate mullangi for its smell.
Thank u for suggesting alternative usage
పరోటాకి, చపాతీకి తేడా సోదాహరణంగా వివరించగలరు (5 మార్కుల ప్రశ్న)
నేను చపాతీలు చేసుకునేటప్పుడు ఇలాంటి ప్రయోగాలు బోలెడు చేస్తూ ఉంటానండీ. ముల్లంగితో ఎప్పుడూ ట్రై చేయలేదుకానీ నా ఫేవరేట్ కొత్తిమీరతో బోలెడు సార్లు చేశా. దాన్ని కొత్తిమీరకారం పెట్టిన చపాతీ అని పిలుచుకుంటా.రెండు మూడు సార్లు ఆవకాయ, మాగాయతో ట్రై చేసాకానీ ఎందుకో కుదరలేదు.
(ఓరి నీ తింగరి ప్రయోగాలు సంతకెళ్ళా అని తిట్టుకుంటున్నారు కదా..నాకు వినిపిస్తోంది :) )
ఈ పరోటాకి, చపాతీకి తేడా ఏంటో తెలిసి చావదు నాకు. రెండూ ఒకేలా కనిపిస్తాయి. :(
తృష్ణ, అలా ముల్లంగి లో నీళ్ళు పిండేస్తే అందులో వుండే పోషక పదార్ధాలు పోవూ?
రోటీ లు ఒక నాలుగు రోజులు నిలవ వుండే చిట్కా చెపుదూ. వూరు వెళ్ళేప్పుడూ దేశం కాని దేశం లో ఇలా రోటీల వంటీవి మహత్తరమైన ప్రత్యమ్నాయాలు కదా.
@kastephale:ధన్యవాదాలు.
@శంకర్: పేద్ద ప్రశ్న..:)) నాకు తెలిసింది చెప్తాను..
పరోటా, చపాతి రెండూ గోధుమపిండితో చేసేవే. అయితే పరోటాలు రకరకాలుంటాయి. ముఖ్యంగా ఇది కాస్త 'మందంగా' ఉంటుంది. పొరలుపొరలుగా ఏ కూరా స్టఫ్ చేయకుండా చేసేవి ఉంటాయి, అలా కాక క్యాబేజీ, కాలీప్లవర్, ఆలూ, మూలీ, ఆకుకూరలు ఇలా చాలా రకాలతో స్టఫ్ చేయబడి, పచ్చిమిర్చి, కారం,ఇలా మసాలా పొడులు కూడా కలుపుకుని స్టఫ్డ్ పరాటాలు చేస్తారు. అది కాస్త కష్టం కూడా. స్టఫ్ఫింగ్ బయటకు వచ్చేయకుండా జగ్రత్త పడుతూ వత్తుకోవాలి.
ఇక చపాతీ ఏదీ స్టఫ్ చేయకుండా, మామూలుగా కాల్చేది. దీనిని కూడా రెండు మూడూ మడతలు పెట్టి, ఒక్కో మడతకీ నెయ్యి లేదా నూనె రాసి మడుస్తారు.(కొన్ని చోట్ల చపాతీ ట్రయాంగిల్ లాగ మడుస్తారు). వత్తేప్పుడు మాత్రం వీలైనంత పల్చగా వత్తుతారు. కాల్చేప్పుడు కూడా సైడ్స్ లో నూనె లేదా నెయ్యితో కాలుస్తారు. ఏ అయిల్ వాడకుండా కూడా చపాతీ చేసుకోవచ్చు. బయట హోటల్స్ లో అయితే మైదా కూడా కలిపేస్తారు.
రోటీ లేదా ఫుల్కా కూడా గోధుమపిండితో చేస్తారు. కానీ నేను/నెయ్యి వాడకుండా చాలా చాలా పల్చగా వత్తుకుని పెనం మీద లేదా ఒకవైపు కాలాకా డైరెక్ట్ గా పొయ్యి మీద కాలుస్తారు. కొన్ని చోట్ల నిప్పులపై గమేళా బోర్లించి అందిమీద కాలుస్తారు. చాలా హోటల్స్ లో 'తందూర్'లో కాలుస్తారు.
చాలామంది ఇలా తేడాలేమీ లేకుండా అన్ని రకాలు కలిపేసి చేసేస్తూ ఉంటారు. నేనూ చపాతీ పిండిలోనే క్యాబేజీ తురుము, ముల్లంగి తురుము, కొత్తిమీర, మెంతి ఆకు మొదలైనవి కలిపేసి చేసేస్తూ ఉంటాను. ఇంక స్టఫ్డ్ పరాఠా లాగ చేయకుండా !
భావన గారూ, బావున్నారా? నిన్న మీ వ్యాఖ్య మిస్సయ్యా...
అంటే అది ముల్లంగి వాసన పడనివారికోసం..
కలిపిన చపాతీ పిండి అయితే ఫ్రిజ్ లో రెండ్రోజులు ఉంచచ్చు కానీ రోటీలు ఎలా ఉంచాలో తెలీదండి మరి... :(
ధన్యవాదాలు.