మా చిన్నప్పుడు అమ్మ చేసే ఈ బ్రెడ్ ఉప్మా మాకు బాగా నచ్చేది. పోటీలు పడి ప్లేట్ ఖాళీ చేసేవాళ్ళం.
ఈ ఉప్మా చేయటం చాలా సులువు కూడా.
కావాల్సినవి:
ఒక చిన్న బ్రెడ్ పేకేట్
ఒక పెద్ద ఉల్లిపాయ
నాలుగు వెల్లుల్లు రేకులు
ఒక కేరెట్
కాస్త కొత్తిమీర
పోపుకి:
ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, చిటికెడు ఇంగువ, పావు చెంచా పసుపు, తగినంత ఉప్పు,కర్వేపాకు, రెండు పచ్చి మిర్చి, ఒక ఎండు మిర్చి.
చేసే విధానం:
* రెండు చెంచాల నూనెలో పోపు వేయించాలి. అందులో చితక్కొట్టిన వెల్లుల్లిరేకులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి.
* ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాకా, కేరెట్ తురుముకున్నది లేదా చిన్న ముక్కలు గానీ చేసి ఉల్లిపాయ ముక్కలతో కలిపి రెండు నిమిషాలు వేయించాలి.(పైన ఫోటోలోని ఉప్మాలో నేను కేరెట్ బదులు గాజర్ వాడాను)
* ఉల్లిపాయలు వేగాకా, చిన్న చిన్న ముక్కలుగా చిదిమిన బ్రెడ్ ముక్కలు అందులో వేసి, పసుపు, కాస్తంత ఉప్పు వేసి బాగా కలపాలి. బ్రెడ్ ముక్కలు గట్టిగా ఉంటే కాస్తంత నీళ్ళు చిలకరిస్తే మెత్తబడతాయి.
* నాలుగైదు నిమిషాలు అడుగంటకుండా బాగా కలిపిన తరువాత కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.
* నోరూరించే బ్రెడ్ ఉప్మా రెడీ. ఇది మిల్క్ బ్రెడ్ తోనే కాక, వీట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు !!
ఫొటో మాంచి కలర్ ఫుల్ గా ఉందండీ..ఈ వీకెండ్ ట్రై చెయ్యాల. ఇంగువ కంపల్సరీ ఏం కాదుగా? నేనెప్పుడూ వాడలేదండీ.. మొన్న ఒకడబ్బా కొన్నాను గానీ ఆ స్మెల్ చూశాక కూరలో వేస్తే ఏమవ్వుద్దో అని డౌటొచ్చి ఆగిపోతున్నా ;(
raj, ఇంగువ avoid చేయవచ్చు.no problem..:)కానీ కొన్ని కూరల్లో ఇంగువ లేనిదే రుచి రాదు.
Thanks for the visit.
టెంప్టింగ్. ఫొటొ భలే కలర్‌ఫుల్‌గా ఉంది.ఉప్మాలో వెల్లుల్లి వేస్తారా? ఇంటరెస్టింగ్. మా ఇంట్లో వెల్లుల్లి వాడకం ఎక్కువ. కానీ ఉప్మాలో వినలేదు. ట్రై మాడాలి ఈసారి.
@రాజ్ ఇంగువ లేని పులిహోర, పచ్చళ్ళు చేసుకుని వేస్ట్. కొన్ని కూరలు కూడా వేస్ట్. IMO
@padma: ఈ ఒక్క బ్రెడ్ ఉప్మా లోనే. మరే ఉప్మాలోనూ వెల్లుల్లి బాగోదు..:)
thank you.
well said about 'hing"..:)
"పోటీలు పడి ప్లేట్ ఖాళీ చేసేవాళ్ళం. చేయటం చాలా సులువు కూడా."
ఏంటి ప్లేట్ ఖాళీ చేయడం సులువా తృష్ణ గారూ? :))
అయినా ఈ టైపు టిపినీలు నాకు నచ్చవు. బ్రెడ్ జ్వరం వచ్చినప్పుడే తింటారని నా ప్రగాఢ ఫీలింగ్. కానీ ఇది స్వాతికి నచ్చే టిఫిన్ కేటగిరీ. ఈ పోస్ట్ చూడమని చెప్తా.
@shankar: corrected..:))
Looks tasty.. ఇది కూడా ట్రై చేసేస్తా.. :D
గాజర్ వేరూ కారెట్ వేరూనా??? ఇన్నాళ్ళూ నేను రెండూ ఒకటే అనుకుంతున్నాను...???
@స్ఫూరిత: కేరెట్ జాతికి చెందిందే గాజర్ అండి. చలి ప్రదేశాల్లో(ఢిల్లీ లాంటి చోట్ల) ఎక్కువ దొరుకుతుంది. కాస్త ఎరుపు రంగులో ఉండి, తేమ శాతం ఎక్కువ ఉండి, ఎక్కువ తియ్యగా కూడా ఉంటుంది. కేరెట్ కన్నా తీపి శాతం ఇందులో ఎక్కువ ఉన్నందువల్ల సుగర్ వాళ్లకి పనికిరాదు. డిసెంబర్ ,జనవరి నెలల్లో మనకీ దొరుకుతుంది.
thanks madhuraa..:)