దొండకాయలు కాయపడంగా ఎక్కువ నూనె వెయ్యకుండా వండుకోవచ్చు.
శనగపప్పు కారం వేసి:
కావాల్సినవి:
పావుకేజీ దొండకాయలు
శనగపప్పు కారానికి కావాల్సినవి:
శనగపప్పు నాలుగు చెంచాలు
మినపప్పు మూడు చెంచాలు
ఆవాలు ఒక చెంచా
జీలకర్ర ఒక చెంచా
పావు స్పూన్ మెంతులు
రెండు చెంచాల కొబ్బరి(optional)
ఎండు మిరపకాయలు నాలుగైదు
ఉప్పు తగినంత
తయరీ:
* ముందుగా ఒక చెంచా నూనెలో పైనచెప్పిన పోపుసామానులో పప్పులన్నీ వేయించి స్టౌ ఆపేసాకా కొబ్బరి ఉంటే అందులో కలపాలి. తర్వాత బరగ్గా(మరీ మెత్తగా కాకుండా) గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా కలిపేసి ఉంచాలి.
* కడిగిన దొండకాయలను రెండువైపులా మధ్యదాకా కట్ చేసుకోవాలి.
* వాటిలో గ్రైండ్ చేసుకున్న పొడి కూరి అదంతా వేగేదాకా చాలా టైమ్ పడుతుంది. నూనె కూడా పడుతుంది. అందుకని ముందు రెండువైపులా స్లిట్ చేసిన దొండకాయలను ఒక టీగ్లాసుడు నీళ్ళు,అర చెంచా ఉప్పు వేసి చిన్న కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికించి దింపేయాలి. నీళ్ళు కొద్దిగానే పోసాం కాబట్టి వంపేయాల్సిన అవసరం ఉండదు. (అంతగా ముక్కల్లో నీళ్ళు మిగిలితే చారులోకో పప్పులోకో అవి వాడచ్చు.)
* ఇప్పుడు దొండకాయలు చల్లారాకా అందులోకి రెండువైపులా గ్రైండెడ్ పౌడర్ కూరాలి.
* పాన్ లో గానీ, మూకుడులో గానీ రెండు చెంచాల నూనె వేసి అందులో దొండకాయలు వేసి మాడకుండా రెండు నిమిషాలకొకసారి అటు ఇటు తిప్పుతూ వేగనివ్వాలి.
* శనగపప్పు కారం కూరిన దొండకాయల కూర రెడీ అయిపోతుంది..:)
========================================
అసలు మీ వంటలకు పెద్ద ప్రాక్టీసర్ను, నన్ను మర్చిపోతే ఎలా? మీకు థాంక్స్ చెబుతూ ఓ టపా కూడా రాసాను. కొంచం బద్ధకం వదిలించుకుని పబ్లిష్ చేస్తా.పైగా మీ వంటలు అచ్చిక బుచ్చిక చెత్త అంతా కలపమని కాకుండా సింపుల్గా చేసుకుని హాయిగా తినేట్లుంటాయి. ఇహ కామెంట్లంటారా మీకు తెలీనిదేముంది???
Thanks sunita gaaru..:)