"రైతా" అని ఉత్తరాది వాళ్లు రకరకాలు చేస్తారు గానీ కమ్మని ఇంగువపోపు పెట్టిన మన పెరుగుపచ్చళ్ల ముందు ఆ రైతాలన్నీ బలాదూరే ! రాత్రిపూట భోజనంలోకి రోజు ఏదో ఒక పెరుగుపచ్చడి చేసేది అమ్మ. ఆనపకాయ, పొట్లకాయ, తోటకూర, అరటి దూట, కేరెట్.. మదలైనవాటితో. ఏదీ లేకపోతే చిన్న అల్లంముక్కతొక్కేసి, ఓ పచ్చిమిరపకాయ, కాస్తంత కొత్తిమీర వేసి పొపు పెట్టేసేది. అదో రకం అన్నమాట.
కళ్లకి మంచిదని, ఐరన్, కేల్షియమ్, ఫోలిక్ ఏసిడ్ ఎక్కువగా ఉంటాయని నేను తోటకూర ఎక్కువగా వాడతాను. తోటకూరతో పప్పు, ఆవ పెట్టి పులుసు, పచ్చడి, పెరుగుపచ్చడి, వడలు, గారెలు మొదలైనవెన్నో చేసుకోవచ్చు. ఇవాళ 'తోటకూర పెరుగుపచ్చడి ' ఎలా చెయ్యాలో చెప్తాను..
* ముందు తోటకూరను బాగా కడగాలి. లేకపోతే తినేప్పుడు మట్టి వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది ఈ అకుకూర.
* రెండు కట్టలు ఆకుకూర తరిగి, ఒక గ్లాసు నీటిలో ఉడికించాలి. తోటకూర త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్లో అక్కర్లేకుండా ఏదైనా గిన్నెలోనే ఉప్పు వేసి, మూతపెట్టి ఉడికించుకోవచ్చు. ఆకుకూరలు ఉడికించేప్పుడు ఆకుతరుగులో సగం నీళ్ళు పోస్తే చాలు. నీళ్ళు వేస్ట్ అవ్వవు, ఆకు ఉడికాకా పారబొయ్యక్కర్లేదు.
* ఆకు రంగు మారకుండా ఉడికించుకుంటే పోషకాలు నిలిచి ఉంటాయి.
* ఉడికిన తోటకూరను ఇలా మేష్ చేసుకోవాలి. ఆకులు ఆకులుగా కొందరు తినటానికి ఇష్టపడరు.
* తర్వాత పెరుగులో తగినంత ఉప్పు వేసి చిలుక్కోవాలి.
* తర్వాత పెరుగులో తగినంత ఉప్పు వేసి చిలుక్కోవాలి.
* ఆవాలు, మినపప్పు, మెంతులు(ఎర్రగా వేగాలి), చిటికెడు ఇంగువ, ఒక ఎండు మిర్చి వేసి పోపు వేయించి, చిలికిన పెరుగులో వేసి కలపాలి.
* అప్పుడు అందులో ఉడికించి మేష్ చేసి ఉంచిన తోటకూర బాగా కలపాలి.
* ఇలా చేసుకున్న పెరుగుపచ్చడి రోజూ తింటే చాలా మంచిది. అన్నంలోనే కాక ఉత్తిగా కూడా తినేయచ్చు.
* ఇలా చేసుకున్న పెరుగుపచ్చడి రోజూ తింటే చాలా మంచిది. అన్నంలోనే కాక ఉత్తిగా కూడా తినేయచ్చు.
=========================
simple తోటకూర కూర:
* తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కాస్త జీలకర్ర్ర, పోపు వేయించాలి. అందులో రెండు తోటకూర కట్టలకి మూడు పచ్చిమిరపకాయలు, అంగుళం అల్లం ముక్కతొక్కి ఆ ముద్ద వేసి, అది కాస్త వేగాకా వడ్చి ఉంచిన తోటకూర అందులో వేసి బాగా కలపాలి. ఉప్పు తక్కువైతే కాస్తంత కలుపుకోవాలి.
* కొందరు తోటకూరలో టమాటా,ఉల్లిపాయ,వెల్లుల్లి కూడా వేసి కూర చేసుకుంటారు.
చిన్నప్పుడు పెరట్లో విరివిగా కాస్తుండేప్పుడూ తోటకూర అంటే పెద్ద ఇష్టముండేది కాదు గాని, ఇప్పుడు దూరమైనాక అపురూపమైనాక ఎప్పుడెప్పుడు నా సమ్మర్ గార్డెన్ కాపుకొస్తుందా అని ఎదురు చూస్తుంటా. పెరుగు పచ్చళ్ళలో నాకు పొట్లకాయతో చాలా ఇష్టం
బాగుంది .టేస్త్ చేసి ఎల ఉందొ రేపు చెప్తాను.