* పెరుగు కాస్త పుల్లది ఉంటే మెంతిమజ్జిగ బావుంటుంది.
* పెరుగులో కాస్త ఉప్పు వేసి చిలికేసుకోవాలి.
* పోపులో :
మినపప్పు,మెంతులు, జీలకర్ర, ఆవాలు,ఇంగువ,మిర్చి,కర్వేపాకు + ఒక చెంచా వాము కూడా వేసి బాగ వేగాకా
*చిలికిన మజ్జిగలో ఈ పోపు వెయ్యాలి.
* మెంతులు ఇష్టపడనివారు పొపు అంతా వేగాకా అందులో పచ్చి మెంతిపిండి వేసుకోవచ్చు. మెంతిపిండి వేగాకా రంగుమారి కమ్మని వాసన వస్తుంది. అప్పుడు స్టౌ ఆపేయటమే.
* పైన కొత్తిమీర చల్లుకుంటే బావుంటుంది.
*ఇది ఇది మంచి appetizer. అన్నంలో కలుపుకోకపొయినా బౌల్ లో పోసుకుని సూప్ లాగ తాగేయచ్చు.
* వాము ఎసిడిటీని తగ్గిస్తుంది. డైజషన్ కి కూడా చాలా మంచిది.
* మెంతులు వంటికి ,జుట్టుకీ, కొలెస్ట్రాల్ తగ్గించటానికీ కూడా మంచివి కాబట్టి తరచుగా మెంతిమజ్జిగ చేసుకోవటం ఆరోగ్యానికి మేలు.