* పెరుగు కాస్త పుల్లది ఉంటే మెంతిమజ్జిగ బావుంటుంది.
* పెరుగులో కాస్త ఉప్పు వేసి చిలికేసుకోవాలి.
* పోపులో :
మినపప్పు,మెంతులు, జీలకర్ర, ఆవాలు,ఇంగువ,మిర్చి,కర్వేపాకు + ఒక చెంచా వాము కూడా వేసి బాగ వేగాకా
*చిలికిన మజ్జిగలో ఈ పోపు వెయ్యాలి.
* మెంతులు ఇష్టపడనివారు పొపు అంతా వేగాకా అందులో పచ్చి మెంతిపిండి వేసుకోవచ్చు. మెంతిపిండి వేగాకా రంగుమారి కమ్మని వాసన వస్తుంది. అప్పుడు స్టౌ ఆపేయటమే.
* పైన కొత్తిమీర చల్లుకుంటే బావుంటుంది.
*ఇది ఇది మంచి appetizer. అన్నంలో కలుపుకోకపొయినా బౌల్ లో పోసుకుని సూప్ లాగ తాగేయచ్చు.
* వాము ఎసిడిటీని తగ్గిస్తుంది. డైజషన్ కి కూడా చాలా మంచిది.
* మెంతులు వంటికి ,జుట్టుకీ, కొలెస్ట్రాల్ తగ్గించటానికీ కూడా మంచివి కాబట్టి తరచుగా మెంతిమజ్జిగ చేసుకోవటం ఆరోగ్యానికి మేలు.
bagundandi
అసలైనది మరిచారు, చిటికడు పసుపు వేయాలి,నేతితో మాత్రమే పోపువేయాలి:)
@శర్మ గారూ, నేను మెంతిమజ్జిగలో 'పసుపు' వెయ్యనండి. అలా తెల్లగా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఇక నెయ్యి వాడకం మానేసి ఏళ్లౌతోంది...అందుకని 'నెయ్యి పోపు' సంగతి మరిచిపోయానండీ..:)
వెన్న చిలికిన మజ్జిగలో నేతిపోపు వేసి మెంతిమజ్జిగ పెడితే ఇక ఆ రుచికి తిరుగుందా?!
ధన్యవాదాలు.
తృష్ణ గారు,
ఏమీ అనుకోక ఒక సారి చిటికెడు పసుపేసి, చిక్కటి కొద్దిగా పులిసిన మజ్జిగలో నేతిపోపుతో మెంతి మజ్జిగ చేసుకుని తిని చెప్పరూ? ఎలాఉందో? పసుపు ఆంటీ ఆక్సిడెంట్ అండీ!
@శర్మ గారూ, ఏమనుకోనండీ. కానీ పైన కామెంట్ రాసా కదండీ నేతిపోపు రుచి తెలీక కాదు.. నెయ్యి మానేసానని. అందుకని :) మా అమ్మగారు పెరుగు పచ్చళ్ల లో, చారుల్లో కూడా నేతి పోపే వేసేవారు. నేతి రుచికేమండి.. అద్భుతం కదా!
ఇక "పసుపు" అయితే నేను దాదాపు అన్ని కూరల్లో ,పప్పుల్లో వేస్తానండి. ఈ బ్లాగులో చాలా వంటల్లో నేను రాసాను "చిటికెడు పసుపు" వెయ్యమని. ఈ ఒక్క మెంతిమజ్జిగలోనే ఎందుకో నాకు నచ్చదు అన్నానండీ.. అంతే :)
మీరు చెప్పునట్టు మెంతి మజ్జిగ చేసాము, చాలా బాగా వచింది. చాలా చక్కగా వివరించారు, చాలా మంచి ఐటమ్స్ బ్లాగు రూపంలో అందిస్తున్న మీకు ధన్యవాదాలు.