కాకరకాయతో చేసే కూరలు ఇందాకటి టపాలో రాసాను కదా:
http://ruchi-thetemptation.blogspot.in/2012/11/blog-post.html
ఇప్పుడు కాకరకయతో రెండు రకాల పులుసులు:
1.కాకరకాయ బెల్లం పులుసు:
* రెండు కాకరకాయలు చిన్నవిగా తరిగి ఉడికించాలి.
* మెంతులు,ఆవాలు,జీలకర్ర,ఇంగువ, కర్వేపాకు లతొ పోపు పెట్టి,అందులో ఒక ఉల్లిపాయ ముక్కలు చేసి కాస్త వేయించాలి.
* తర్వాత నిమ్మకాయంత చింతపండు నానబెట్టి రసం తీసి , అది + ఒక పెద్ద గ్లాసుడు నీళ్ళు(300ml) ఒక పెద్ద గిన్నెలో పోయాలి.
* ఇప్పుడు వేగిన ఉల్లిపాయముక్కలు, ఉడికిన కాకరకాయ ముక్కలు అందులో వేసి మరగనివ్వాలి.
* అప్పుడు నిమ్మకాయంత బెల్లం తరుగు కూడా వేసి బాగా కలవనివ్వాలి.
* చివరలో రెండుచెంచాల బియ్యప్పిండి కాస్త నీళ్లల్లో పల్చగా కలుపుకుని అది పులుసులో పొయ్యాలి. దీనివల్ల పులుసు చిక్కబడుతుంది.
* కొత్తిమీర ఇష్టమైతే ఇందులో దింపేముందు వేసుకోవచ్చు.
*మొత్తమంతా మరో ఐదు నిమిషాలు మరగనిచ్చి దింపేసుకోవాలి.
2.కాకరకాయ పచ్చిపులుసు:
* రెండు కాకరకాయలు, ఒక ఉల్లిపాయ ముక్కలు చేసి వేయించి స్టౌ ఆపేయాలి. (వేపుడు లాగానే)
* తర్వాత నిమ్మకాయంత చింతపండు నానబెట్టి రసం, తగినంత ఉప్పు వేసి కలిపి, ఒక గ్లాసుడు నీళ్ళూ (nearly 300ml) వేగిన కూరలో పోయాలి. పొయ్యి మీద పెట్టకూడదు.
* ఆవాలు, మెంతులు, కాస్త జీలకర్ర, కర్వేపాకు, ఇంగువలతో పోపు పెట్టుకోవాలి.
* ఇందులో నిమ్మకాయంత బెల్లం కూడా తరిగి కలిపితే ఆహా ఏమి రుచి :)
* ఇది easy + నా ఫేవొరేట్ !
Post a Comment