డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్, వెయిట్ ప్రాబ్లంస్ రీత్యా మంచిది కాదు కానీ మనకు దొరికే ఐదారు రకాల డ్రైఫ్రూట్స్(బాదం, పిస్తా, అంజీర్, జీడిపప్పు, కిస్మిస్, ఆక్రోడ్) రోజుకి తలొకటి తింటే ఆరోగ్యానికి, ముఖ్యంగా ఎదిగే పిల్లలకీ, ప్రెగ్నెంట్ లేడీస్ కీ ఎంతో మంచిది. ఇవన్నీ డ్రై ఫ్రూట్ లడ్డులో కలుస్తాయి కాబట్టి రోజుకి ఒకటి తినచ్చు. అదీ ఖజ్జూరాలతో చేసినదయితే ఇంకా మంచిది. ఖజ్జూరాలతో అయితే పూర్తిగా నేచురల్ షుగర్స్ ఉపయోగించినట్లే.
డ్రై ఫ్రూట్స్ తో చేసిన లడ్డూ రెండు రకాలుగా చేస్తారు. బెల్లం పాకంతో లేదా ఖజ్జూరాలతో. పిల్లలైనా, పెద్దలైనా రోజుకి ఒకటి తింటే మంచి పోషకాలు అందుతాయి. బలకరం. బయట కొనేకంటే ఇంట్లోనే తయారుచేస్కుంటే ఎలా ఉంటుంది? అని ఐడియా వచ్చింది మాకు. వెంఠనే ప్రయత్నాలు మొదలెట్టి ఆఖరికి సక్సెస్ఫుల్ గా పూర్తి చేసాను. తయారీకి ఓ అరగంట సమయం పడుతుంది.
కావాల్సినవి:
1) 1/2 kg ఖజ్జూరాలు( lion dates అయితే బెటర్)
(తీపి తక్కువ ఉండాలి అంటే 300,350gms వాడినా చాలు.నేను తక్కువే వాడాను)
2) 100 gm పిస్తా
3) 100 gm జీడిపప్పు
4) 100 gm అంజీర్
5) 100 gm బాదాం
6) 50 gm కిస్మిస్
7) 50 gm ఆక్రోడ్
8)1 చెంచా ఏలకుల పౌడర్
9)1 చెంచా గసగసాలు
10) edible gum(నార్త్ ఇండియన్స్ gaund అంటారు) ఒక చెంచాడు.
11)రెండు చెంచాల నెయ్యి
12) 1/2 చెంచా జాజికాయ (nutmeg) పౌడర్ - optional
(జాజికాయ ఇంట్లో ఉంటే ఓ అరచెంచా పౌడర్ కొట్టుకోవడమే)
13) 100 gm ఎండు కొబ్బరి పొడి - optional
edible gum(gaund) ఇలా ఉంటుంది. సూపర్ మార్కెట్లలో, కిరాణా షాప్స్ లో దొరుకుతుంది.
దీనిని కొంచెం నెయ్యిలో(పావు చెంచా) వేయిస్తే పాప్కార్న్ లాగ పెద్దవవుతాయి. మాడకుండా కలుపుతూ వేగగానే స్టౌ ఆపేసి, చల్లారాకా పొడి చేసి ఉంచాలి దీనిని. లడ్డూలు చుట్టడానికి ఇది బైండింగ్ ఏజెంట్ అన్నమాట.
ముందస్తు తయారీ:
1) ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ విడి విడిగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. పొడి అవ్వకుండా, పలుకులు కనబడేలా ఒకటి రెండు సార్లు తిప్పితే చాలు. అంజీర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తిప్పాలి. అంజీర్ తో పాటే కిస్మిస్ వేసేయచ్చు.
2) జాజికాయ, ఏలకులు విడివిడిగా పౌడర్ కొట్టి ఉంచుకోవాలి.
3) గసగసాలు కావాలంటే పొడి చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా వాడుకోవచ్చు.
4) edible gum పైన చెప్పినట్లు వేయించి, పొడి చేసుకోవాలి.
5) ఖజ్జూరాలు గింజ తీసేసి కాస్త గోరువెచ్చని నీటిలో కడిగేసి గ్రైండ్ చేసి ఉంచాలి. ఇది కూడా ఓమాటు తిప్పితే సరిపోతుంది. మరీ ముద్దగా అక్కర్లేదు.
తయారీ:
1) కాస్త పెద్ద మూకుడులో రెండు చెంచాల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ మూడు నాలుగు నిమిషాలు కలుపుతూ వేయించాలి.
2) అప్పుడు జాజికాయ పొడి, ఏలకుపొడి, గసగసాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుతూ వేయించాలి.
3) తర్వాత ఖజ్జూరాల ముద్ద వేసి అడుగంటకుండా మరో మూడు నిమిషాలు కలపాలి.
4) స్టౌ ఆపేసిన వెంఠనే edible gum పొడి వేసి మరోసారి అంతా మిక్స్ చెయ్యాలి.
5) మొత్తం మిశ్రమం కాస్త చల్లరాకా చేత్తో ఉండలు చుట్టుకోవటమే. మధ్యలో వేడి తగ్గి ఉండ రావట్లేదనిపిస్తే ఓసారి పొయ్యి మీద డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని వేడి చేసుకుంటే ఉండ అవుతుంది. ఆరాకా లడ్డూలు గట్టిపడిపోతాయి.
6) రుచికరమైన డ్రైఫ్రూట్స్ లడ్డూలు తినటానికి రెడీ!
చాలా బాగుంది ట్రై చేస్తా .ఒకసారి చేసాకాని ఉండాలా అవ్వలేదు .ఇలా చేస్తా ఈసారి
@radhika(nani):nutricious అండి.. ప్రయత్నించండి.
thank you.