వాడుకలో మనం 'దద్దోజనం' అనే పెరుగన్నం అసలు పేరు 'దధ్యోజనం'. బయట 'curd rice' అని హోటల్స్ లో పెట్టేది చల్ల అన్నంతో, మిగిలిపోయిన అన్నంతో చేసేయచ్చు. కానీ మనకి గుడులలో పెడ్తారు కదా ప్రసాదంగా ఆ దద్దోజనం అంటే వేడి వేడి అన్నం అప్పటికప్పుడు వండి చేసేదే. ఎప్పుడైనా బిర్యాని, ఫ్రైడ్ రైస్ మొదలైన రైస్ ఐటెమ్స్ చేసినప్పుడు నేనీ దద్దోజనం చేస్తుంటాను. రెండూ కాస్త కాస్త తినేసి వంటిల్లు క్లోజ్ చేసేయచ్చని :)
కమ్మటి దద్దోజనం చేసుకోవాలంటే..
కావాల్సినవి:
* ఒక గ్లాస్ బియ్యం (nearly 150gms)
* రెండు గ్లాసుల కమ్మటి పెరుగు
(పెరుగు విజయా డైట్ మిల్క్ కాచి తోడుపెట్టినదైనా నీళ్ళు కలపకుడ్మా ఉంటే బాగుంటుంది. నే చేసినది డైట్ మిల్క్ పెరుగుతోనే))
* ఒక చెంచా నెయ్యి లేదా నూనె
* తురిమిన లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న అంగుళం అల్లం
* తగినంత ఉప్పు
* గుప్పెడు దానిమ్మ గింజలు
* పోపుకి: ఆవాలు,జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కర్వేపాకు, చిటికెడు పసుపు, రెండు పచ్చి మిరపకాయలు, ఒక ఎండు మిర్చి,
చేసే విధానం:
* గ్లాసు బియ్యానికి రెండున్నర లేదా మూడు గ్లాసుల నీళ్ళు పోసి కాస్త మెత్తని అన్నం వండాలి.పెరుగన్నం కదా అన్నం గట్టిగా ఉంటే బావుండదు.
* చెంచా నెయ్యి/నూనెలో పైన చెప్పిన పోపు పదార్ధాలతో పోపు వేయించాలి. చివరన అల్లం ముక్కలు వేసి స్టౌ ఆపేయాలి. అల్లం ముక్కలకి ఆ వేడి చాలు.
* పెరుగు నీళ్లు పొయ్యకుండా చిలికి తగినంత ఉప్పు కలపాలి. అన్నం చలారాకా అందులో వేయించిన పోపు కలపాలి. తరువాత చిలికిన పెరుగు కలపాలి.
* కొత్తిమీర ఇష్టం ఉంటే సర్వ్ చేసే ముందర కాసిని ఆకులు దధ్యోజనం పైన చల్లచ్చు.
* అన్నం,పెరుగు,ఉప్పు బాగా కలిసాకా సర్వ్ చేసే ముందు గుప్పెడు దానిమ్మకాయ గింజలు పైన చల్లితే రుచి బాగుంటుంది + దానిమ్మకాయ అరుగుదలకి చాలా మంచిది.
Tips:
* అన్నం వేడిగా ఉన్నప్పుడు పెరుగు కలిపితే పెరుగు విరిగినట్లు అయిపోయి రుచిలో తేడా వచ్చేస్తుంది.
yummy.
maha ruchiga unde ammay nee varnana,
@krishnakka,thank you..thank you :-)