బియ్యం లేకుండా ఎన్ని రకాల దోశలు చేయచ్చా అన్ని రకాలూ ప్రయోగాలు చేస్తున్నా నేను. మొన్నొకరోజున సజ్జలతో దోశలు చెప్పా కదా.. ఇవాళ జొన్న దోశల రెసిపీ చెప్పుకుందాం. సజ్జ దోశల కన్నా ఈ జొన్నదోశలు నాకు బాగా నచ్చాయి. బజార్లో జొన్నపిండి కాక జొన్నలు కూడా దొరుకుతాయి. ఇవి కాస్త కాస్త చప్పునే కొనుక్కోవాలి. (మాక్సిమం కేజీ) ఎక్కువగా కొనుక్కుంటే పురుగుపట్టి పాడయిపోతాయి.(అనుభవసారం:))
కావాల్సినవి:
జొన్నలు : ఒక పెద్ద గ్లాసు
మినప గుళ్ళు: అర గ్లాసు (పైన చెప్పిన క్వాంటిటీలో సగం)
చెంచా మెంతులు
తయారీ:
* వేడిచేసిన రెండుగ్లాసుల నీటిలో జొన్నలు నానబెట్టాలి.
* విడిగా మినపప్పు, మెంతులు పెద్ద గ్లాసుడు నీళ్లలో నానబెట్టాలి.
* 5 గంటల పాటు జొన్నలు,మినపప్పు నానాకా మెత్తగా రుబ్బుకోవాలి. పైన చెప్పిన క్వాంటిటి అయితే వెట్ గ్రైండర్ లో తిరుగుతాయి.
* జొన్నలు బాగా నలగటానికి మామూలు దోశ పిండి కన్నా కాస్త ఎక్కువసేపు పడుతుంది. అందుకే వెచ్చని నీటిలో నానబెట్టడం.
* రుబ్బిన పిండిలో తగినంత ఉప్పు కలుపుకుని కావాలంటే అరగ్లాసు నీళ్ళు కలిపి బాగా కలుపుకోవాలి.
* ఈ పిండితో ఫ్రెష్ గా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. లేదా రాత్రంతా బయట ఉంచేసి(ఫ్రిజ్ లో పెట్టకుండా) పొద్దున్నే దోశలు వేసుకోవచ్చు.
hot water ante goru vechaga vunde water lo na andi?
@sravya: గోరువెచ్చ కన్నా కాస్త ఎక్కువగా వేడి చేసిననీటిలో అండి. అలా అని మరిగేనీళ్ళు కాదన్నమాట.
తృష్ణ గారూ !ఈజొన్న దోశలు నేనూ 3నెలల క్రిందట ట్రై చేసాను .గ్రాండ్ సక్సస్!ఇక బియ్యం తో మానేశా .చాల నచ్చింది ఇంట్లోవాళ్ళకి . ఇక కనపడ్డవాళ్ళనందరినీ వాయించేస్తున్నా .జొన్నరొట్టెలతో కుస్తీ పట్టీ పట్టీ,ఒకసారి కుదరితే మరొకసారి కుదరక,ఆఖరుకు దోశలకు ఫిక్సయిపోయానన్నమాట .వచ్చీరాని టైపింగ్ తో బ్లాగు లో కూడా పెట్టేసాను .మీది నాదీ ప్రాసెస్ అంతాఒకటే .మీరు చక్కగా క్లుప్తంగా బాగా చెప్పారు .
Super and healthy too :)
@nagarani yerra:అవునా, మీ బ్లాగ్లో చూడలేదండీ. చూస్తానుండండి. నేను మిల్లెట్ ఫెస్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ చిరుధాన్యాలతో రెసిపి బుక్ కొన్నా. అందులోవన్ని ఒక్కొక్కటే ప్రయొగాలు చేస్తున్నానండి.
thank you.
@praveena:thanks for the visit :)
we use this type atlu -
mix wheat flour, jonna flour, sajja flour, ragi flour , sometimes brown rice flour,
( multi grain flour, all flours seperate ga girni lo pattali ) , sometimes 1 spoon of soya flour ( girni lo soya beans pattali ). soya flour more unte, gattiga aipothai atlu.
so, ila anni grains flours kalipesi ( like 2 garitelu wheat flour lo 1 garite other flours ala ) wheat flour more unte atlu baaga easy to make, instant ga atlu poskotame mixing onion & mirapakaya, salt in it.
nutritious plus tastes soooooooooo well. please try it. thank you for ur blog.