1.రెగులర్ దోసావకాయ:
పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్ లో అన్ని సీజన్స్ లో ఎక్కువగా కనబడే ఇంస్టంట్ ఆవకాయ..దోసావకాయ! అప్పటికప్పుడు అతిథులు వస్తున్నారంటే గబగబా వంట చేసేస్తాం కదా.. అలాంటప్పుడు చటుక్కున ఫ్రెష్ ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు దొరకని సీజన్ లో అయితే మిగతావాటికన్నా దోసావకాయ అయితే చాలా బావుంటుంది. ఓ గంట, రెండు గంటల్లో రెడీ అయిపోతుంది!
చేయడం కూడా ఈజీనే..
* ఒక అరకేజీ దోసకాయ ఉంటే, గింజలు తీసేసి తొక్కతో పాటూ సన్నగా పచ్చడికి తరిగినట్లు ముక్కలు తరిగేసుకోవాలి. ముక్క చేదు ఉందేమో చెక్ చేసుకోవాలి.
* 1/2 టీ గ్లాసు కారం, ఉప్పు, ఈ రెండీటికీ కాస్త ఎక్కువగా(సుమారు రెండు చెంచాలు) పచ్చి ఆవపొడి కలిపి, ముప్పావు టీ గ్లాసుడు నూనె వేసి మొత్తం బాగా కలపాలి.
* తరిగిన దోసకాయ ముక్కలని కలిపిన పిండిలో వేసేసి మళ్ళీ బాగా కలపాలి.
*దోసకాయ పులుపు కాబట్టి మిగతా కూరలతో చ్ఃఏసిన ఆవకయల్లోలాగ నిమ్మకాయ పిండక్కర్లేదు.
* దోసావకాయకి దోసకాయ గట్టిగా ఉండాలి, కాయ పులుపు ఉండాలి. అప్పుడు రుచి ఇంకా బావుంటుంది.
2.పచ్చిమిరపకాయలతో దోసావకాయ:
దోసావకాయ అంటే చాలామందికి పైన రాసినదే తెలుసు. అదికాక పచ్చిమిర్చితో చేసుకునేది మరొకటి ఉంది. ఎర్ర దోసావకాయ కన్నా ఇది చాలా బావుంటుంది. ఇదివరకూ తృష్ణ లో రాసానీ రెసిపీ. ఒకచోట ఉంటాయని మళ్ళీ ఇక్కడ రాస్తున్నా!
తయారీకి కావాల్సినవి:
* ఒక మీడియం దొసకాయ ఇలా తరిగినది.
* మేము కారం తక్కువ కాబట్టి ఆ దోసకాయకి నేను 8,9 పచ్చి మిర్చి తీసుకుంటాను.
* ముందు మిక్సీలో పచ్చిమిరపకాయలన్నీ పేస్ట్ చేసి ఉంచాలి.
* దీనిలోకి 2,3 చెంచాల పచ్చి ఆవ పొడి వేసి,(మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.) 4,5 చెంచాల నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. పేస్ట్ బాగా మిక్స్ అయినట్లు కనబడ్డాకా,
* అందులో తరిగిన దోసకాయ ముక్కలు వేసి బాగా కలపాలి.
"ఆవ" వేడి చేస్తుంది కాబట్టి ఇది తిన్న రోజు మజ్జిగ ఎక్కువ తాగాలి.
ఎక్కడైనా ఈ దోసావకాయ ఉందంటే సగం అన్నం దీనితోనే లాగించేస్తాను. అంత ఇష్టం ఇదంటే నాకు!
ఎలా చేయాలో తెలియక మా ఆవిడ ఇంతవరకూ ఎప్పుడూ చేయలేదు. చెప్పి మహోపకారం చేసారు. ధన్యవాదాలు.
ఒక్క సందేహం... నూనె పచ్చిదేనా? వేడిచేయాలా?
Pachchide andi. Maamulu aavakayaku vaadinatle.
thanks for the visit.