చాలా రోజుల్నుంచీ నాకు తెలిసినవి, నేను పాటించేవి కొన్ని 'వంటింటి చిట్కాలు' రాయాలని.. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి.. కానీ కొత్తగా వంట మొదలుపెట్టే వారికి, తెలియనివారికి ఉపయోగపడతాయని రాస్తున్నాను.
1) ఆకు కూరలు ఫ్రిజ్ లో పెట్టేప్పుడు వేళ్ళు కట్ చేసేసి, న్యూస్ పేపర్లో గానీ, వేరే ఏదైన కాగితంలో గానీ చుట్టి కవర్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి. పేపర్ని రోల్ చేసినట్లు కుట్టాలి. మొత్తం మూసెయ్యకూడదు. తాజా ఆకుకూరలయితే ఇలా పెట్టడం వల్ల ఒక వారం గ్యారెంటీగా ఉంటాయి.
2) కొబ్బరికాయ కొట్టాకా ఒక చెక్క వాడకుండా ఉండిపోతే అది ఐస్ క్యూబ్స్ తయారయ్యే డీప్ ఫ్రిజ్ లో పెడితే పదిహేను రోజులైనా పాడవదు. అంతకంటే ఎక్కువ ఉంచితే పాడవదు కానీ డ్రై అయిపోతుంది. కొబ్బరిలో రుచి ఉండదు.
3) దోశల పిండి నానబెట్టేప్పుడు రెండు చెంచాలు శనగపప్పు వేస్తే దోశలు క్రిస్పీగా హోటల్ దోశల్లా వస్తాయి. ఒక చెంచా మెంతులు, గుప్పెడు అటుకులు వేస్తే దోశలు మెత్తగా వస్తాయి. ఇడ్లీ పిండిలో కూడా ఇలా మెంతులు వేయచ్చు. కానీ ఎక్కువ వేయకుండా చూసుకోండి. ఎందుకంటే పిండి చేదయిపోతుంది.
4) దోశలకి చాలా మంది 1:3 పోస్తారు కానీ ఒక గ్లాసు మినపప్పుకి, రెండు గ్లాసులు బియ్యo వేస్తే మెత్తగా కాక మరీ రేకుల్లా కాకుండా మీడియంగా వస్తాయి.
5) బూరెలు చేసేప్పుడు పైన తోపుకి ఒక గ్లాసు మినపప్పుకి, ఒక గ్లాసు బియ్యం పోసి నానబెట్టాలి. పిండి రుబ్బేప్పుడు ఎక్కువనీళ్ళు పోయకుండా స్పూన్ తీస్తే జారేలా ఉంటే అప్పుడు బూరెలు చీదవు.
6) ఇడ్లీ పిండి వెట్ గ్రైండర్ లో రుబ్బేప్పుడు ఒక గ్లాసుకి మూడు గ్లాసులు ఇడ్లీరవ్వ వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. అదే మామూలు మిక్సీలో తిప్పేప్పుడు ఒకటికి, రెండు గ్లాసులు రవ్వ సరిపోతుంది కానీ రాత్రి రుబ్బినప్పుడు పావు చెంచా వంటసోడా పిండిలో కలిపి ఉంచేసి, పొద్దున్నే ఇడ్లీలు వేసుకుంటే పిండి బాగా ఫెర్మెంట్ అయ్యి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇలా సోడా కలిపేట్లయితే ఫ్రిజ్ లో పెట్టేప్పుడు పిండి గిన్నెలో పావు వంతు ఖాళీ ఉండేలా చూసుకుని, గిన్నె క్రిందన కూడా ఏదైనా బేసిన్ లేదా ప్లేట్ పెడితే ఫ్రెర్మెంట్ అయిన పిండి పొంగి ఫ్రిజ్ అంతా పడిపోకుండా ఉంటుంది. చలికాలం అయితే ఇలా ప్లేట్ లో పెట్టి బయట కూడా ఉంచేయచ్చు పిండి గిన్నె.
7) గారెలు చేసేప్పుడు పిండి పల్చనయిపోతే అందులో కాస్త బాజ్రా పిండి(సజ్జపిండి) కలిపితే పిండి మళ్ళీ గట్టిపడుతుంది. గారెలు కూడా టేస్ట్ మారవు.
8) అన్నాలు టేబుల్ మీద కాకుండా క్రింద కూచుని తినేమాటయితే, ముందో పాత న్యూస్ పేపర్ పరిచి అందిపై కంచాలు, గిన్నెలు పెట్టుకుని తింటే, క్లీనింగ్ పని తప్పుతుంది. తిన్నాకా పేపర్ మడిచి పారేయచ్చు.
9) చపాతీలు వత్తేప్పుడు, వంటింట్లో గట్టు మీద న్యూస్ పేపర్ పరుచుకుని, అంది మీద చపాతీ వత్తే పీట పెట్టుకుంటే గట్టంటా పిండి పడకుండా ఉంటుంది. కూరలు తరిగేప్పుడు కూడా సేమ్ ప్రొసిజర్ పాటిస్తే క్లీనింగ్ పని తప్పుతుంది.
10) పూరీ, చపాతీల్లోకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలు చేసుకునేప్పుడు టమాటా,ఉల్లిపాయ మిక్స్ ఎక్కువగా చెప్తారు. అలా కాకుండా ఆనపకాయ ముక్కలను కూడా కాస్త ఉడకబెట్టి గ్రైండ్ చేసేస్కుంటే మంచి గ్రేవీలా ఉపయోగపడుతుంది. పులుపు కావాలంటే ఒక అర చెంచా ఆమ్చూర్ పౌడర్(డ్రై మామిడి పొడి) కలుపుకోవచ్చు.
11) పాత ఆవకాయ, మాగాయ మిగిలిపోతే క్వాంటిటీని బట్టి చూసుకుని, బెల్లం పాకం పట్టి అందులో వేడిమీదే పాత ఆవకాయ లేదా మాగాయ వేసి ఓ రెండునిమిషాల తర్వాత స్టౌ ఆపేయాలి. బాగా కలిపి సీసాలో పెట్టేసి ఓ రెండు మూడు రోజుల తర్వాత వాడుకుంటే తియ్య ఆవకాయ, తియ్య మాగాయ రెడీ! పెరుగన్నంలోకీ, దోశల్లోకీ ఈ ఊరిన తియ్య ఊరగాయ చాలా బాగుంటుంది.
12) పొద్దున్న త్వరగా వంట కావాలంటే రాత్రి కూరలు తరిగి ఫ్రిజ్ లో పెట్టుకోవడమే కాక పోటాటో, బీట్ రూట్, కేరెట్, చామదుంప, అరటి లాంటి కూరలు కాయ పడంగా ఉడకపెట్టేసి ఉంచుకుంటే పొద్దున్నే ముక్కలు తరిగి పోపు పెట్టేసుకుంటే వంట త్వరగా అయిపోతుంది.
13) పప్పులో ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైతే కాస్త పెసరపప్పు(ఇది త్వరగా ఉడుకుతుంది కాబట్టి) ఉడకపెట్టేసి అందులో కలిపేస్తే ఉప్పు సరిపోతుంది.
14) ఓ వారానికి సరిపడా మనం వాడుకునే చింతపండు వేడి నీళ్లలో ఒక్క ఉడుకు రానిచ్చి, చల్లారాకా అలానే మూతపెట్టేసి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే అప్పటికప్పుడు నానబెట్టుకునే పని తప్పుతుంది.
15) చపాతీల కోసం ఈ మధ్యన మల్టీ గ్రెయిన్ ఆటాలు చాల రకాలు వస్తున్నాయి. అలా కాకుండా లూజ్ గోధుమ పిండి లేదా branded గోధుమపిండి కొనేసుకుని, అందులో మనకి కావాల్సిన చిరుధాన్యాల పిండి(జొన్న,రాగి,సజ్జలు,సోయా మొదలైనవి) కలుపుకుని చపాతీలు చేసుకుంటే టేస్ట్ కాస్త డిఫరెంట్ గా,వెరైటీగా ఉంటుంది. ఒక రోజు జొన్న పిండి, ఒక రోజు రాగి పిండి, ఒకరోజు సజ్జ పిండి అలా కలుపుకోవచ్చు. (ఈ పిండిలన్నీ మార్కెట్లో విడివిడిగా దొరుకుతాయి.) ఒక గ్లాసు గోధుమపిండికి అర గ్లాసు జొన్న or రాగి or సజ్జ or సోయా పిండి కలుపుకోవచ్చు. ఇలా చేస్తే చపాతీలైనా, పుల్కాలైనా మెత్తగా వస్తాయి. చపాతీల రుచి కూడా మామూలుగానే ఉంటుంది + చిరుధాన్యాల్లోని పోషకాలు కూడా అందుతాయి.
ఈసారికి ఇవి! మరోసారి ఇంకొన్ని టిప్స్ రాస్తానేం..:-)
Telisinave ainaa bagga cheppaaru....Radhika (nani)
@radhika(nani):తెలీనివాళ్ళు ఉంటే ఉపయోగపడతాయని రాసానండి..
thank you :)
నైస్ పోస్టండీ.
అబ్బ, ఎంత బాగుందండీ మీ ఈ బ్లాగు డిజైన్, ఎంటరైతే వదిలి వెళ్లిపోలేనంతగా, అలా చూస్తూ ఉండిపోయేలా :)
Chala baavunnayandi ee tips.
Idivaraku eenaadu supplementary lo chitti chitkaalani ilaantive cheppevaaru.baagunnaay mee chitkaalu.
I am surprised to see someone doing the samethings I do...
.. :-)not exaggerating!
I am just surprised to see that someone is doing exactly how I do things..
For Tamrind, I takeout the seeds, boil..then grind the wholething for reducing waste of the pulp.
Kobbari mukkalu chesesi chinna bag lo pettesta deep frize lo..
Poddunne chutney cheyyalante I put everything including popu in teh mixie jar..add water in teh morning and grind..
alalm,pachimirchi mukaklu chesi, tomatoes cheap gaa unnappudu puree chesi deep fridze lo pettestaa..
inkaa boldu
ennani rayanu!
చాలా థాంక్స్ అండీ తృష్ణ గారూ ,
నాకెప్పుడూ బూరెల తోపు ఒక పెద్ద తలనెప్పిగా వుంటుంది.ఒక కప్పు మినపప్పులో మూడు కప్పుల బియ్యం పిండి కలిపి చేస్తాను. పెసరపప్పు రుబ్బి ఆవిరి మీద ఉడికించి చేసే పోలి పూర్ణం బూరెలకి యే ప్రాబ్లమూ లేదు కానీ , శనగపప్పు పూర్ణం బూరెలు మాత్రం ఎప్పుడూ చీదెయ్యటమే... ఈ సారి మీరు సూచించిన పాళ్ళు ట్రై చేస్తాను. చల్లారినా సాగకుండా బాగుంటాయి కదూ !
@నాగరాజ్ : థన్యవాద: :-)
@మహతి: ధన్యవాదాలు.
@ఇందిర: అవును కదా.. చిట్టి చిట్కాలు అని టివీలో లక్ష్మి అనే ఆవిడ వచ్చి చెప్పేవారు.
ధన్యవాదాలు.
@sujata: జనరల్ గా చాలామంది ఇవే ఫాలో అవుతూంటారేమో అనుకుంటానండి నేను.
కొబ్బరి ముక్కలు చెయ్యను కానీ కోరేసి పెడుతుంటాను నేను.
ఇంకా చెప్పండి.. ఎవరికైనా ఉపయోగపడతాయి.
థాంక్యూ :)
@sreedevi:అవును.. సాయంత్రానికి గట్టిపడకుండా ఉంటాయండి.thank you.